S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/16/2016 - 06:15

హైదరాబాద్, సెప్టెంబర్ 15: తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో సీట్లపై నేటికీ స్పష్టత రాలేదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందిన కాలేజీలను సైతం అడ్మిషన్ల జాబితాలో ఇంకా చేర్చకపోవడంతో సీట్ల సంఖ్య అభ్యర్ధులు ఆశించినంతగా పెరగలేదు. ఎమ్సెట్ -3 ఫలితాలను ప్రకటించడంతో పాటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో అడ్మిషన్లకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది.

09/16/2016 - 06:11

హైదరాబాద్, సెప్టెంబర్ 15: ఆది దేవుడి నామస్మరణతో భాగ్యనగరం పులకరించింది. జైబోలో గణేష్ మహారాజ్‌కీ జై..! గణపతి బొప్పా మోరియా..అనే నినాదాలతో వినాయక్‌సాగర్ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ లడ్డూను ఈసారి రూ. 14.65లక్షలకు నగర శివారు కీసరకు చెందిన స్కైలాబ్ రెడ్డి దక్కించుకున్నారు.

09/16/2016 - 05:37

హైదరాబాద్, సెప్టెంబర్ 15: ఐటి దిగ్గజం సిస్కోతో తెలంగాణ ప్రభుత్వం గురువారం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్రాన్ని డిజిటలైజ్ చేసే ప్రక్రియలో భాగంగా ఈ ఒప్పందాలు కుదిరాయి.

09/16/2016 - 05:36

హైదరాబాద్, సెప్టెంబర్ 15:‘జిల్లాల పునర్విభజన దేనికోసమైతే జరుగుతోందో ఆ పరమార్థం నెరవేరాలి. ఇది ప్రజల సెంటిమెంట్‌తో కూడుకున్న అంశం. లోతైన అధ్యయనం లేకుండా కొందరు అధికారులు గణాంకాలతో మొక్కుబడి నివేదికలు ఇచ్చారు. ముసాయిదాలో జరిగిన తప్పిదాలను తుది నోటిఫికేషన్‌లో అయినా సరిదిద్దాలి’- ఇటీవల రెవిన్యూ ఉన్నతాధికారులు, కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సిఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి.

09/16/2016 - 05:35

హైదరాబాద్, సెప్టెంబర్ 15: మహిళల్లో రొమ్ము కాన్సర్ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో దానిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్టవ్య్రాప్తంగా ఉచిత మొబైల్ బ్రెస్ట్ కాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎంఎన్‌జె కాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఫైజర్ కంపెనీ సహకారంతో ఈ కార్యక్రమం శుక్రవారంనుంచీ అమలు కానుంది.

09/16/2016 - 06:29

తడిసి ముద్దయిన పాలమూరు
3 గంటలు కుంభవృష్టి
పొంగిపొర్లిన పెద్ద చెరువు
నల్లగొండ జిల్లాలో మూసీకి వరద
కరీంనగర్, వరంగల్ అతలాకుతలం
రంగారెడ్డిలో పొంగిన వాగులు
కొట్టుకుపోయిన రైలు పట్టాలు
వికారాబాద్-బీదర్ మధ్య నిలిచిన రైళ్లు

09/16/2016 - 05:14

హైదరాబాద్, సెప్టెంబర్ 15: తెలంగాణలో జరిగిన ఎమ్సెట్ -3లో ఏపి అమ్మాయి మానస టాపర్‌గా నిలిచింది. మెడికల్, డెంటల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ సీట్ల భర్తీకి నిర్వహించిన ఎమ్సెట్-3 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు. గుడివాడకు చెందిన రేగెళ్ల ప్రఫుల్ల మానస 160 మార్కులకు 152 మార్కులు సాధించి, అగ్రస్థానంలో నిలిచింది.

09/15/2016 - 18:04

హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌లో గురువారం వినాయక నిమజ్జనం, శోభయాత్ర కార్యక్రమాలను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హెలికాప్టర్‌ ద్వారా వీక్షించారు. నిమజ్జనాలు కొనసాగుతున్న తీరు, బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డిలతో కలిసి ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నెక్లెస్‌రోడ్‌, ట్యాంక్‌బండ్‌ పరిసరాలను పరిశీలించారు.

09/15/2016 - 17:44

హైదరాబాద్‌ : గురువారం ఉదయం వర్షం కారణంగా హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనోత్సవాలు మందకొడిగా సాగినప్పటికీ మధ్యాహ్నానికి నగరం నలుమూలల నుంచి తరలివస్తున్న గణనాథుల వెంట వేలాది మంది భక్తులు ట్యాంక్‌బండ్‌కు పోటెత్తుతున్నారు. ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం పూర్తి కావడంతో పాటు వర్షం తగ్గడంతో ట్యాంక్‌బండ్‌కు భక్తుల తాకిడి పెరిగింది. విగ్రహాల నిమజ్జనం కోసం అధికారులు 23 క్రేన్‌లు ఏర్పాటుచేశారు.

09/15/2016 - 16:49

కరీంనగర్‌: కొత్త జిల్లాల్లో ఉద్యోగుల సంఖ్య పెంచాలని టీఎన్జీవో నేత దేవీప్రసాద్ అన్నారు. కొత్త జిల్లాల్లో ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేస్తారని దేవీప్రసాద్‌ అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రథమస్థానంలో ఉందని చెప్పారు.

Pages