S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/16/2016 - 07:11

హైదరాబాద్, సెప్టెంబర్ 15: గ్యాంగ్‌స్టర్ నరుూం డైరీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డైరీలో ఎవరి పేర్లున్నాయనే మీమాంస ప్రజాప్రతినిధుల గుండెల్లో గుబులు రేపుతుండగా, పోలీసు అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. సిట్ ఆధీనంలోని డైరీయే కీలకమైన ఈ కేసులో గణేశ నిమజ్జనం తరువాత నరుూంతో లింకులు ఎవరితో ఉన్నాయి..డైరీలో ఎవరెవరి పేర్లున్నాయనే విషయాన్ని ప్రకటించేందుకు సిట్ సిద్ధమైంది.

09/16/2016 - 07:10

హైదరాబాద్, సెప్టెంబర్ 15: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గురువారం జరిగిన గణేశ నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. నలుగురు చిన్నారులు సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో యువకుడు నాలాలో గల్లంతు కాగా బంజారాహిల్స్‌లో గణేశుని విగ్రహం లారీలో ఎక్కిస్తుండగా కిందకు పడిపోయింది.

09/16/2016 - 06:37

సిరిసిల్ల, సెప్టెంబర్ 15: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలో వినూత్నంగా వేప మొక్కలు వాటంతట అవే గుండ్రంగా తిరగడంతో వింతను తిలకించడానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గురువారం స్థానిక శాంతినగర్‌లోని ఒక నేత కార్మికుడి ఇంటి ముందు వేప చెట్టుకింద నాలుగు వేప మొక్కలు పెరిగి, వాటంతట అవే గుండ్రంగా తిరుగుతూ కనిపించాయి. దీనితో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వింతను చూడడం ప్రారంభించారు.

09/16/2016 - 06:34

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 15: కృష్ణా జలాలతో పసిడి పంటల పాలమూరును చూడబోతున్నామని, దశాబ్దాల కలలు నేరవేరుతుంటే రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోందని, కానీ కాంగ్రెస్, టిడిపి నాయకుల కళ్లలో మాత్రం కన్నీరు వస్తున్నాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్, టిడిపి అభివృద్ధి నిరోధక పార్టీలని, ఆ పార్టీలను తెలంగాణలో లేకుండా చేయాల్సిన బాధ్యత రైతులపై ఉందన్నారు.

09/16/2016 - 06:33

మిర్యాలగూడ, సెప్టెంబర్ 15: రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 17 నుండి నాలుగు నెలల పాటు మహాజన పాదయాత్ర చేపట్టనున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి తెలిపారు.

09/16/2016 - 06:32

కొత్తూరు, సెప్టెంబర్ 15: దేశంలోనే హైదరాబాద్ నగరాన్ని ఐటి హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, అందుకు కేంద్ర ప్రభుత్వం సానుకులంగా స్పందించినట్లు ఐటి శాఖ మంత్రి తారకరామారావు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ సమీపంలో పి అండ్ జి పరిశ్రమలో ప్లానింగ్ సర్వీస్ సెంటర్‌ను ఆయన గురువారం ప్రారంభించారు.

09/16/2016 - 06:32

హైదరాబాద్, సెప్టెంబర్ 15:అంతర్జాతీయంగా చాలా వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, వీటికి ఐటి కేంద్రంగా నిలుస్తోందని సిస్కో అధ్యక్షుడు దినేష్ మల్కాని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం - సిస్కోల మధ్య గురువారం హెటెక్ సిటీలో ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో దినేష్ మల్కానీ మాట్లాడుతూ ఐటి రంగ విధానం ఆవిష్కరణలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.

09/16/2016 - 06:31

హైదరాబాద్, సెప్టెంబర్ 15: కొత్త జిల్లాల ఏర్పాటు తరువాతనే అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. జిఎస్‌టి బిల్లు కోసం ఒక రోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. బిఎసి సమావేశంలో రెండు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

09/16/2016 - 06:31

సంగారెడ్డి, సెప్టెంబర్ 15: రెండేళ్లుగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితితో పూర్తిగా అడుగంటిపోయిన మెదక్ జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టులోకి అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల వరదనీరు రావడం మరోమారు ప్రారంభమైంది. ఖరీఫ్ ప్రారంభంలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు 7 టిఎంసిల వరకు నీటి నిల్వ పెరగా అందులోంచి లీకేజీలతో కొంత మొత్తం తగ్గిపోయింది.

09/16/2016 - 06:16

హైదరాబాద్/కుషాయిగూడ/కోహెడ, సెప్టెంబర్ 15: లిబియా ఉగ్రవాదుల చెరలో నిరుడు జూలైలో బందీలైన తెలుగు ప్రొఫెసర్లు విడుదల కావటంపై వారి కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. బుధవారం రాత్రి వారిద్దరూ విడుదలైనట్టు ప్రకటన వెలువడడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఏడేళ్ల క్రితం వీరు ప్రొఫెసర్లుగా లిబియా వెళ్లారు. ఉగ్రవాదుల చెరలో 14 నెలలు బందీగా ఉన్న గోపికృష్ణ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు.

Pages