S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/17/2016 - 14:25

నల్గొండ : ప్రజల అభిప్రాయం మేరకే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్‌శర్మ శనివారం స్పష్టం చేశారు. భువనగిరి మండలం పగిడిపల్లి వద్ద ఓ ప్రైవేటు స్కూల్‌ భవనంలో కలెక్టర్‌ కార్యాలయం, హన్మాపురంలోని ఓ కళాశాలలో ఎస్పీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. యాదాద్రి జిల్లాకు కావాల్సిన కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాల తాత్కాలిక భవనాలను ఆయన పరిశీలించారు.

09/17/2016 - 13:55

హైదరాబాద్: అమెరికాలో మరణించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, గ్రేహౌండ్స్ మాజీ బాస్ ఎంవీ దినకర ప్రసాద్ అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో శనివారం నిర్వహించారు. 1980 బ్యాచ్‌కు చెందిన దినకర ప్రసాద్ రంగారెడ్డి జిల్లా ఎస్పీగా, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేశారు. ఇంటలిజెన్స్ శాఖలో మావోయిస్టు వ్యతిరేక విభాగం చీఫ్‌గా, గ్రేహౌండ్స్ డీఐజీగా సమర్థవంతంగా పనిచేశారు.

09/17/2016 - 13:52

వరంగల్‌ : ధర్మసాగర్‌ చెరువులో శనివారం ఉదయం ఈతకు వెళ్లిన నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో ముగ్గురు విద్యార్థినులున్నారు. గల్లంతైన వారు శ్రీనిధి, శివసాయి, శ్రావ్యారెడ్డి, శివసాయికృష్ణగా గుర్తించారు. వీరంతా వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

09/17/2016 - 13:34

హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ విద్యార్ధి నల్లి ప్రవీణ్ మానసిక ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నామని మాదాపూర్ డీసీపీ కార్తికేయ తెలిపారు. ప్రవీణ్‌కు చెందిన నోట్‌బుక్‌లు, ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నామని, సూసైడ్‌ నోట్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామన్నారు.

09/17/2016 - 11:52

మెదక్‌ : ప్రమాదవశాత్తూ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన జహీరాబాద్‌ మండలం అల్లీపూర్‌ నేతాజీనగర్‌లో చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం ఇస్మాయిల్‌ కుమారుడు అన్సార్‌ (6), ఇర్ఫాన్‌ కుమారుడు ఇషాన్‌ (5) అదృశ్యమయ్యారు. ఎంత గాలించినా వారి ఆచూకీ తెలియలేదు. భారీ వర్షాలకు చిన్నారుల మృతదేహాలు ఓ ఇంటి నిర్మాణం కోసం తవ్విన పిల్లర్‌ గుంతలో శనివారం ఉదయం పైకి తేలాయి.

09/17/2016 - 11:20

మహబూబ్ నగర్: జూరాల ప్రాజెక్టు కు వారం రోజులుగా నీటి ఉధృతి పెరిగింది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 57.500 వేల క్యూసెక్కులకు చేరింది. రెండు గేట్లను రెండు మీటర్ల మేర ఎత్తి 65,650 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వ‌దులుతున్నారు. ప్రాజెక్టు ప్రధాన, కుడి కాలువ కు 150 క్యూసెకులు ,ఎడమ కాలువ కు 300 క్యూసెక్కుల నీటిని వదులు తున్నారు.

09/17/2016 - 11:17

హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ విద్యార్ధి నల్లి ప్రవీణ్ హాస్టల్ లో ఉరి వేసుకుని శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు ప్రవీణ్ ను సమీపంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రవీణ్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించడంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. షాద్‌న‌గ‌ర్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

09/17/2016 - 11:13

కరీంనగర్‌ : సైదాపూర్‌ మండలం దుద్దనపల్లి సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ట్రాక్టర్‌ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలో పడి, ముగ్గురు మృతి చెందినట్లు వారి బంధువులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌పై నలుగురు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది సాయంతో మృత దేహాలను బావిలోంచి బయటికు తీసేందుకు ప్రయతిస్తున్నారు.

09/17/2016 - 07:05

హైదరాబాద్, సెప్టెంబర్ 16: వరుణుడి ప్రతాపానికి మహానగరం విలవిలలాడింది... వాన తాకిడికి వణికింది... ఒక్కముక్కలో చెప్పాలంటే నిలువునా మునిగింది... రహదారులన్నీ చెరువులను తలపించాయ. రాజధాని నగరాన్ని రెండు గంటలపాటు వరుణుడు తన గుప్పిట్లో బంధించాడనడంలో అతిశయోక్తి లేదేమో. ఆ స్థాయలో వర్షబీభత్సం నగర వాసుల్ని గడగడ లాడించింది. జనజీవనం ఒక్కసారిగా స్తంభించింది.

09/17/2016 - 07:04

హైదరాబాద్, సెప్టెంబర్ 16: తెలంగాణ రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. తాజాగా కురుస్తున్న వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా డెంగీ, వైరల్ ఫీవర్ సోకుతుండడంతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. పట్టణాలు, పల్లెల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.

Pages