S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/15/2016 - 15:47

హైదరాబాద్ : హైదరాబాద్లో వినాయకుడి విగ్రహాల చేతిలోని లడ్డూలకు క్రేజ్ విపరీతంగా పెరిగింది. బాలాపూర్ లడ్డూను కాంగ్రెస్ నేత స్కైలాబ్ రెడ్డి రూ.14.65 లక్షలకు దక్కించుకున్నాడు. జూబ్లీ హిల్స్ మధురా నగర్‌లో వినాయకుని లడ్డూను వేలం పాటలో ప్రశాంత్ నాయుడు అనే వ్యక్తి రూ.9,99,999 కు దక్కించుకున్నాడు. బడంగ్‌పేట లడ్డూను రూ.5.41 లక్షలకు గాదె నర్సింహ తీసుకున్నాడు.

09/15/2016 - 15:37

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌ వెంకటేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతిని నిర్వాహకులు నిమజ్జనం కోసం గురువారం తరలిస్తుండగా విగ్రహం కింద పడిపోయింది. ప్రత్యేక వాహనంలో విగ్రహం అమర్చడానికి ప్రయత్నిస్తున్న సమయంలో క్రేన్ హుక్కు ఊడిపోయింది. దీంతో విగ్రహం కింద పడిపోయింది. ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

09/15/2016 - 15:26

హైదరాబాద్‌: నగరంలోని నాగోల్‌లో గురువారం ఓ యువకుడు రోడ్డు దాటుతూ నాలాలో పడిపోయాడు. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు యువకుడి కోసం గాలింపు చేపట్టారు. నాగోల్‌లో ఈరోజు మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది.

09/15/2016 - 15:19

కందుకూరు : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పోరడోని కుంటలో నలుగురు విద్యార్థులు గురువారం ఈతకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయారు. ముగ్గురు విద్యార్ధుల మృతదేహాలను గ్రామస్థులు బయటకు తీశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. విద్యార్థులు మహ్మద్‌నగర్‌ గ్రామానికి చెందిన వారు.

09/15/2016 - 14:46

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య భారీవర్షం కురిసింది. గంట వ్యవధిలో 9.25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. కుండపోతగా కురుస్తూనే ఉంది. నగరంలో వినాయక నిమజ్జనం సాగుతున్న సమయంలో వరుణుడు ప్రతాపం చూపించడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.

09/15/2016 - 14:43

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. వికారాబాద్‌ మండలం రాళ్లచిట్టెంపల్లి-పిల్లారం మధ్య వాగు పొంగడంతో రెండు బైక్‌, కారు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, ఏడుగురు గల్లంతయ్యారు. కాగ్నా నదిపై వంతెన తెగడంతో తాండూరు-మహబూబ్‌నగర్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

09/15/2016 - 14:06

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌-3లో తొలి పది ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలిలు:

09/15/2016 - 13:56

హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 1:50 గంటలకు పూర్తి అయ్యింది. మహాగణపతి ఈ ఉదయం శోభాయాత్రగా బయలుదేరి ట్యాంక్‌బండ్‌ క్రేన్ నెంబర్ 5 వద్ద నిమజ్జనం అయ్యాడు. చివరి పూజ అనంతరం ఆద్యాత్మిక వాతావరణంలో మహాగణపయ్య గంగఒడికి చేరుకున్నాడు.వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహాగణపతి నిమజ్జనానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

09/15/2016 - 13:48

హైదరాబాద్: భక్తుల కోలాహలం నడుమ గణపయ్య ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నాడు. తక్కువ సమయంలో ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం ఇదే తొలిసారి. ట్యాంక్‌బండ్‌పై క్రేన్‌నెంబర్ 4వద్ద ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం జరుగనుంది. సాయంత్రంలోగా మహాగణపతి నిమజ్జనం పూర్తి అయ్యే అవకాశం ఉంది.

09/15/2016 - 13:21

హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు తెలంగాణ సర్కారు నిర్వహించిన ఎంసెట్-3 పరీక్షలో ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడకు చెందిన మానస టాప్ ర్యాంకర్‌గా నిలిచింది. గుడివాడకు చెందిన రాగళ్ల మానస 152 మార్కులతో మొదటి ర్యాంకు కైవసం చేసుకుంది.

Pages