S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/15/2016 - 07:07

హైదరాబాద్, సెప్టెంబర్ 14: గ్యాంగ్‌స్టర్ నరుూం అక్రమ వ్యవహారాలపై ప్రత్యేక సిట్ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు నరుూం కుటుంబీకులు, అనుచరులు మాత్రమే అరెస్టయ్యారు. నామమాత్రంగా ఒకరిద్దరు రాజకీయ నాయకులు రిమాండ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటుండగా పోలీసు ఉన్నతాధికారుల పాత్రపై ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో ఒక సిఐ స్థాయి అధికారి మాత్రం స్థానచలనానికే పరిమితమయ్యారు.

09/15/2016 - 05:35

హైదరాబాద్, సెప్టెంబర్ 14: జిల్లాల పునర్విభజనపై తుది నోటిఫికేషన్‌తో పాటు కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కలెక్టర్లు, ఎస్పీల ఎంపికపై సిఎం కె చంద్రశేఖర్‌రావు కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. జిల్లాల పునర్విభజనపై విడుదల చేసిన ముసాయిదాకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించడానికి విధించిన గడువు ఈనెల 20తో పూర్తవుతుంది.

09/15/2016 - 05:34

హైదరాబాద్, సెప్టెంబర్ 14: హైదరాబాద్ నగరంలో బుధవారం రాత్రి కుండపోత కురిసింది. కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్ధాయి వర్షపాతం నమోదైంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

09/15/2016 - 05:37

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ఈ ఖరీఫ్ సీజన్‌లో 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నిర్దేశించుకున్న లక్ష్యం నిరుడు సేకరించిన ధాన్యంకంటే రెట్టింపని మంత్రి వివరించారు.

09/15/2016 - 05:30

హైదరాబాద్, సెప్టెంబర్ 13: ‘మాది రైతు సంక్షేమ ప్రభుత్వం. 2015 ఖరీఫ్ పంటకు సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు త్వరలో ఇస్తాం’ అంటూ తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గత ఆరునెలల నుంచీ పదే పదే చెబుతున్నా, రైతులకు మాత్రం నిధులు అందడం లేదు. 2015 ఖరీఫ్‌లో ఏర్పడిన వర్షాభావ పరిస్థితివల్ల తెలంగాణలోని 464 మండలాలకుగాను 231 మండలాలను కరవుపీడిత ప్రాంతాలుగా రాష్ట్రం ప్రకటించింది.

09/15/2016 - 05:29

హైదరాబాద్, సెప్టెంబర్ 14: గణేశ మండపాల్లో కొలువుదీరిన గణనాథుల నిమజ్జనోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరుగనుంది. నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 30వేల మంది పోలీసులను మోహరిస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇదిలావుంటే, జిహెచ్‌ఎంసి నిమజ్జనోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

09/14/2016 - 18:03

నల్గొండ : నల్గొండ జిల్లా భువనగిరి సబ్‌జైలర్‌ శ్రీనివాసరావు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. భువనగిరి సబ్‌ జైలర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావును అదిలాబాద్‌ జిల్లా లక్సెట్టిపేటకు డిప్యుటేషన్‌పై పంపారు. మంగళవారం సాయంత్రం భువనగిరిలోని తన ఇంటి నుంచి లక్సెట్టిపేటకు బయలుదేరిన ఆయన అదృశ్యమయ్యారు. తననుఅకారణంగా బదిలీ చేశారని, ఉన్నతాధికారులు వేధిస్తున్నారని..

09/14/2016 - 16:59

హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని.. అందువల్ల ఆ ఒప్పందాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ నరసింహన్‌ను తెలంగాణ తెదేపా కోరింది. టీ. తెదేపా నేతలు ఎల్‌.రమణ, రేవంత్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి రాజ్‌భవన్‌లో బుధవారం గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

09/14/2016 - 16:19

హైదరాబాద్‌: తెలంగాణలో మల్లన్నసాగర్‌ రైతుల ఇబ్బందులు, రైతుల ఆత్మహత్యలు, పోలీసుల లాఠీఛార్జి, మహిళలపై బలప్రయోగం వంటి విషయాలను కేంద్రం దృష్టికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ ఎందుకు తీసుకెళ్లలేదని కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు బుధవారం ప్రశ్నించారు.

09/14/2016 - 15:38

హైదరాబాద్ : గురువారం గణేశ్నిమజ్జనం త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి వివరించారు. జోన్ల వారీగా సీసీ కెమెరాల ద్వారా నిమజ్జన ఊరేగింపును పరిశీలిస్తామన్నారు. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాతబస్తీలో ఐసిస్ కదలికల నేపథ్యంలో పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Pages