S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/25/2016 - 12:44

హైదరాబాద్: నగరంలోని చిక్కడపల్లి ఆంధ్రాబ్యాంకు శాఖలో చోరీకి గురువారం అర్ధరాత్రి దుండగులు విఫల యత్నం చేశారు. బ్యాంకు గోడకు రంధ్రం వేసేందుకు ప్రయత్నిస్తుండగా వాచ్‌మెన్ అక్కడికి రావడంతో దుండగులు పరారయ్యారు.

03/25/2016 - 05:38

హైదరాబాద్, మార్చి 24: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వర్శిటీల్లో కీలకమైన ఆరు సమస్యలపై ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చుకోవాలని వర్శిటీ బోధన సిబ్బంది నిర్ణయించారు.

03/25/2016 - 04:14

వరంగల్, మార్చి 24: వరంగల్ జిల్లాకు భారీ టెక్స్‌టైల్ పార్క్ రాబోతోందని, అందుకు తగినట్లుగా వౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. గురువారం వరంగల్‌లో ఎంపి అజ్మీరా సీతారాంనాయక్ కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన ముఖ్యమంత్రి... మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

03/25/2016 - 04:13

హైదరాబాద్, మార్చి 24:దాదాపు పుష్కర కాలం నుంచి తెలంగాణలో భారీ నీటిపారుదల ప్రాజెక్టులపై ఆశలు రేకెత్తిస్తున్నారు. గడువు తీరుతోంది. ఎన్నికలు వస్తున్నాయి పాలకులు మారుతున్నారు. పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. అయితే తెలంగాణ ఆవిర్భవించిన తరువాత భారీనీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజల్లో మరోసారి ఆశలు చిగురించాయి. అయితే అదే సమయంలో పలు అనుమానాలూ తలెత్తాయి.

03/25/2016 - 04:11

వలిగొండ, మార్చి 24:క్రికెట్ బెట్టింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలోని గోకారం గ్రామానికి చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి పాలకూర్ల భానుప్రసాద్ గురువారం ఉదయం ఇంట్లో ఏవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోకారం గ్రామానికి చెందిన భానుప్రసాద్ అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద గల అర్జున్ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు.

03/25/2016 - 04:11

హైదరాబాద్, మార్చి 24: పెట్టుబడులకు అవకాశం ఉన్న ప్రాంతంగా తెలంగాణను, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానాలు, ప్రణాళికలు, కార్యాచరణ అందుకు అనుగుణంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

03/25/2016 - 02:39

కొత్తకోట, మార్చి 24: టెన్త్ హిందీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలను లీక్‌చేయడంతో ఆయా ప్రశ్నలకు జవాబుపత్రాలు గైడ్‌ల నుండి చించి ఒకపేపర్‌పై అంటించి జిరాక్స్‌లు తీస్తుండగా కొందరు పట్టుకుని జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా డిఇఓ విజయలక్ష్మిబాయి ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అందుకు సంబంధిత వివరాలు వెల్లడించారు.

03/25/2016 - 04:46

వరంగల్, మార్చి 24: మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు సీతారాంనాయక్ కుమారుడి వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. గురువారం ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుండి వరంగల్‌కు మధ్యాహ్నం 12:42 గంటలకు చెరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి వెంట ఉన్నారు.

03/25/2016 - 02:38

మహబూబ్‌నగర్, మార్చి 24: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో రైతులు రోడ్డెక్కారు. హైదరాబాద్ - రాయిచూర్ వెళ్లే ప్రధాన రహదారిపై గంటల తరబడి మండుటెండల్లో రాస్తారోకోకు దిగి రహదారిని దిగ్బంధించారు. తమ పంటలను కాపాడాలంటూ వారు నినదించారు. రైతులు గత వారం రోజులుగా రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించి అనుకున్నంత పనిచేశారు.

03/25/2016 - 02:37

వరంగల్, మార్చి 24: ఏప్రిల్ నెల మొదటి రెండు వారాల్లో రెండోదశ కింద ప్రజాప్రతినిధులందరూ చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొంటారని రాష్ట్ర సాగునీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. గురువారం వరంగల్‌లో మిషన్ కాకతీయ రెండోదశ కింద రూ.90లక్షల 82వేల వ్యయంతో చేపట్టిన పద్మాక్షి గుండం చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

Pages