S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/26/2020 - 03:58

హైదరాబాద్, ఫిబ్రవరి 25: త్వరలో తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు పటిష్టమైన కార్యాచరణను రూపొందించినట్లు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ఆధ్వర్యంలో ఒక సమగ్ర నివేదికను రూపొందించి పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు సమర్పించనున్నట్లు చెప్పారు. పార్టీ అనుబంధ సంఘాలను ముందుగా బలోపేతం చేస్తామన్నారు.

02/26/2020 - 03:57

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని మళ్లీ ఏఐసీసీ అధ్యక్ష పదవిలో నియమించాలని తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన నేతలు పార్టీ హైకమాండ్‌ను కోరారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, ఎస్ చంద్రశేఖర్, ఎం కోదండరెడ్డి, డాక్టర్ పీ వినయ్ కుమార్, జీ నిరంజన్, ఏ శ్యాంమోహన్, బీ కమాలకరరావు, ఎస్ చంద్రశేఖర్ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు.

02/26/2020 - 03:54

వికారాబాద్, ఫిబ్రవరి 25: వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే బీ సంజీవ రావు మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఈయనకు సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా మంగళవారం ఉదయం మృతి చెందారు. రంగారెడ్డి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే బీ.సంజీవ రావు రాజకీయాల్లో రాక ముందు కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగిగా పని చేశారు. వ్యవసాయ అధికారిగా, ఎంపీడీఓగా పని చేశారు.

02/26/2020 - 03:47

భువనగిరి, ఫిబ్రవరి 25: గ్యాంగ్‌స్టర్ నరుూమొద్దీన్ ఎన్‌కౌంటర్లో మరణించినా ఆయన అక్రమాలు, అక్రమార్జనపై ప్రభుత్వ శాఖలు కొరడా ఝుళిపిస్తూనే ఉన్నాయి.

02/26/2020 - 01:20

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ఢిల్లీలో హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్న వారి వెనుక ఎవరున్నా అందుకు బాధ్యులపై చర్యలు తప్పవని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన ఇక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఢిల్లీ ఘటన ప్రభుత్వ వైఫల్యం కాదని, ఢిల్లీ పూర్తిగా పోలీసుల అదుపులోనే ఉందని చెప్పారు.

02/26/2020 - 01:17

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 25: రాష్ట్ర ప్రభు త్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్ట ణ ప్రగతి కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకొవద్దని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టణాల స్వరూపాలను మార్చేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ముందుకు తీసుకువచ్చారని ఆయ న అన్నారు.

02/26/2020 - 01:14

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మండలి సీఈఓగా పనిచేసిన ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను

02/26/2020 - 01:10

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి ఖాళీ అయ్యే రెండు రాజ్యసభ స్థానాలకు అవకాశం ఎవరికి దక్కుతుందనేది తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో ఆసక్తి నెలకొంది. రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహన్‌రావు పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన ముగియనుంది.

02/25/2020 - 05:43

హైదరాబాద్, ఫిబ్రవరి 24: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్రమ వలసదారుల వివరాలను సేకరించాలని, అందుకు సర్వే నిర్వహించాలని బీజేపీ ప్రతినిధి బృందం డీజీపీ ఎం మహేందర్‌రెడ్డిని కోరింది. సోమవారం నాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు, పార్టీ నేతలు టీ రాజశేఖరరెడ్డి, డాక్టర్ ఎన్ గౌతం రావు, అట్లూరి రామకృష్ణ తదితరులతో కలిసి డీజీపీని కలిసి ఒక వినతి పత్రాన్ని అందజేశారు.

02/25/2020 - 05:41

హైదరాబాద్, ఫిబ్రవరి 24: పాత తరం జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి అప్పుడప్పుడు ఆనాటి వాహనాలను ప్రజల ముందుకు తీసుకువస్తుంటారు. ఇందులో భాగంగా 1914లో (హెచ్‌ఇహెచ్) నిజాం స్టేట్ రైల్వేలో జాన్ మోరిస్ ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉండేది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో జాన్ మోరిస్ ఫైర్ ఇంజన్ అందరినీ ఆకట్టుకుంది.

Pages