S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/25/2020 - 05:39

హైదరాబాద్, ఫిబ్రవరి 24: అమెరికా దేశాధినేత ట్రంప్ భారత పర్యటన కేవలం అమెరికా ప్రయోజనాల కోసమేనని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మరో పక్క 24వ తేదీన దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలని ప్రజాసంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం నాడు బేగంపేట అమెరికన్ కాన్సలేట్ ఎదుట నిరసన ప్రదర్శనలు జరిగాయి.

02/25/2020 - 05:13

హైదరాబాద్, ఫిబ్రవరి 24: నాలుగు లక్షల రూపాయలు ఒక గ్రామ పంచాయితీకి విరాళంగా అందచేసిన కుటుంబానికి చెందిన వ్యక్తి పేరును ఆ గ్రామ పంచాయితీ భవనానికి పెట్టారు. ఈ మేరకు సోమవారం ఒక జీఓ జారీ అయింది. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్ గ్రామ పంచాయితీకి ‘రాజిరెడ్డి భవన్’ అని పేరు పెట్టారు.

02/25/2020 - 05:12

హైదరాబాద్, ఫిబ్రవరి 24: ఆర్టీసీని లాభాల వైపు నడిపించడానికి సంస్థ ఉన్నతాధికారులు పర్యటనలు చేపట్టారు. నేరుగా ఉన్నతాధికారులే డిపోల సందర్శనలు చేపట్టడంతో సంబంధిత డిపో మేనేజర్లు అలర్ట్ అయ్యారు. తమ పరిధిలో ఉద్యోగ, కార్మికులకు సంబంధించిన సమస్యలు ఎక్కడ పై అధికారుల దృష్టికి తీసుకుపోతారోనని డిపో మేనేజర్లు ఆందోళన చెందుతున్నారు.

02/25/2020 - 05:11

హైదరాబాద్, ఫిబ్రవరి 24: పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియామకానికి నిర్వహించిన టీఆర్‌టీ రిక్రూట్‌మెంట్ నియామకాలను వెంటనే చేపట్టాలని దివ్యాంగుల కోటాలో ఎంపికైన అభ్యర్థులు నిమ్స్ ఆస్పత్రి ముందు సోమవారం నాడు ధర్నా చేశారు.

02/25/2020 - 05:09

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం సోమవారం రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలలో ప్రారంభమైంది. 140 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లలో ప్రారంభించిన ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల మేయర్లు, చైర్‌పర్సన్లు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

02/25/2020 - 05:08

హైదరాబాద్, ఫిబ్రవరి 24: హజ్‌కు వెళ్లేందుకు మొదట ఎంపికైన యాత్రికులు తమ వంతు వాటా చెల్లించేందుకు మంగళవారం (్ఫబ్రవరి 25, 2020) చివరి తేదీ అని తెలంగాణ స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ మసియుల్లాఖాన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి. షఫీయుల్లా తెలిపారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. హజ్‌కు వెళ్లేందుకు ఎంపికైన యాత్రీకులు తమ వంతు వాటాగా 81 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

02/25/2020 - 05:07

హైదరాబాద్, ఫిబ్రవరి 24: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ దేశ ఔన్నత్యాన్ని పెంచే రీతిలో వ్యవహరించారని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ వ్యాఖ్యానించింది.

02/25/2020 - 05:07

హైదరాబాద్, ఫిబ్రవరి 24: దేవాదాయ శాఖలో హైదరాబాద్ రీజనల్ జాయింట్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను డిప్యూటీ కమిషనర్ ఎం. రామకృష్ణారావుకు అప్పగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు రెవెన్యూ (దేవాదాయ) శాఖ కార్యదర్శి వి. అనిల్ కుమార్ పేరుతో సోమవారం జీఓ (ఆర్‌టీ నెంబర్ 84) జారీ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ బాధ్యల్లో అడిషనల్ కమిషనర్ ఈ. శ్రీనివాసరావు కొనసాగుతున్నారు.

02/25/2020 - 05:32

హైదరాబాద్, ఫిబ్రవరి 24: తెలంగాణ ప్రభుత్వం అటవీ సంరక్షణ కోసం తీసుకున్న చర్యలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డ్ చైర్మన్ డాక్టర్ బీఎంకే రెడ్డి శ్లాఘించారు. తెలంగాణ అటవీ శాఖ చేపట్టిపన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను పరిశీలించేందుకు సోమవారం హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

02/25/2020 - 04:49

హైదరాబాద్, ఫిబ్రవరి 24: కేంద్రం పరిధిలోని ప్రభుత్వ శాఖల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న తలపెట్టిన ఆలిండియా డిమాండ్స్ డేను విజయవంతం చేయాలని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు సుభాష్ లాంభ పిలుపునిచ్చారు. టీఎన్‌జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశానికి సుభాష్ లాంభ హాజరయ్యారు.

Pages