S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/30/2020 - 01:11

హైదరాబాద్: వచ్చే నెల మూడవ వారంలో పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఆర్థిక మాంద్యం, రెవెన్యూ వసూళ్ల తీరుతెన్నులు ఆశాజనకంగా లేకపోవడం తదితర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వాస్తవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది.

01/30/2020 - 01:11

హైదరాబాద్, జనవరి 29: స్థానిక సంస్థలు మొదలుకొని పురపాలికల వరకు అన్నింటికీ ఎన్నికలు ముగియడంతో మిగిలిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూడు, నాలుగు రోజుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులను బుధవారం ఆదేశించారు.

01/29/2020 - 06:41

హైదరాబాద్, జనవరి 28: హైదరాబాద్‌లో ఓటర్‌ను, మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడినైనా తాను తెలంగాణలో ఓటు వేయడం తప్పేలా అవుతుందని టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తెలంగాణలో ఓటు వినియోగించుకోవడం పట్ల ప్రతిపక్షాలు తప్పు పట్టిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మంగళవారం కలిసి కేకే వివరణ ఇచ్చారు.

01/29/2020 - 06:40

హైదరాబాద్, జనవరి 28: కారు కూతల కేటీఆర్ నోటికి ఎంత వస్తే అంత అడ్డగోలుగా అబద్దాలు మాట్లాడుతున్నారని, మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించడానికి ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు.అక్రమాలు చేయడం, ఆదర్శాలు వల్లించడం తండ్రీ కొడుకులు ఇద్దరికే చెల్లిందని అన్నారు. సుదీర్ఘ ప్రెస్‌మీట్‌లో సీఎం నీతులు చెబుతున్నారని, నేతి బీరకాయలోని నేతి మాదిరి కేసీఆర్ నీతి అంతే ఉంటుందని అన్నారు.

01/29/2020 - 06:39

హైదరాబాద్, జనవరి 28: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ తీరు తెలంగాణ సమాజాన్ని అవమానించే విధంగా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు సిగ్గుపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎన్నికలు నిర్వహించారన్నారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ కూటమికి 8, టీఆర్‌ఎస్‌కు 7 సీట్లు వచ్చాయన్నారు.

01/29/2020 - 06:29

హైదరాబాద్, జనవరి 28: జాతికి గర్వకారణమైన ఎయిర్ ఇండియా విమాన సంస్థలను అమ్మివేయడం విచారకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు. విమాన సర్వీసులను కేవలం లాభసాటిగానే కాకుండా సామాజిక బాధ్యతగా చూడాలని, యుద్ధ రంగంలో, ప్రకృతి వైపరీత్యాలలో వెనుకబడిన ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వ రంగ సంస్థలు సేవలు చేయగలుగుతాయని అన్నారు.

01/29/2020 - 06:29

హైదరాబాద్, జనవరి 28: ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థులకు మంగళవారం నాడు నిర్వహించిన ఎథిక్స్ పేపర్‌కు 14,811 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 4,90,462 మంది రిజిస్టర్ చేసుకోగా, వారిలో 4,75,651 మంది హాజరయ్యారు. 3.02 శాతం మంది గైర్హాజరయ్యారని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
మార్చి 1న ఆర్‌జేసీ సెట్

01/29/2020 - 06:28

హైదరాబాద్, జనవరి 28: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు నేరుగా పేదవాడికి చేరుకునేలా చూడాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ క్యాలెండర్, డైరీ, సావనీర్ ఆవిష్కరణ కార్యక్రమం నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగింది.

01/29/2020 - 06:22

హైదరాబాద్, జనవరి 28: పటన్‌చెరు, బొల్లారం ప్రాంతాల్లో కాలుష్య నివారణ కోసం ఏర్పాటు చేసిన ‘ఎన్విరాన్‌మెంట్ రిలీఫ్ ఫండ్’ వినియోగానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పేరుతో మంగళవారం జీఓ జారీ అయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు తొమ్మిది మంది ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు.

01/29/2020 - 06:52

హైదరాబాద్: నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికకు అదనంగా మరో ఎక్స్‌అఫీషియో సభ్యుడి ఓటును అనుమతించి ఎన్నికల సంఘం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఏఐసీసీ ప్రతినిధి నిరంజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ విషయమై జోక్యం చేసుకుని తప్పును సరిదిద్దుతూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది ఎన్నికల అక్రమాలకు పరాకాష్ట అన్నారు.

Pages