S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/30/2020 - 05:30

హైదరాబాద్, జనవరి 29: ప్రాధమిక పాఠశాలల అభివృద్ధి, ఉపాధ్యాయుల పదోన్నతులు , అంతర్ జిల్లా బదిలీలు, కేజీబీవీ మోడల్‌స్కూళ్ల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం వెంటనే ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ నేతలు విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు.

01/30/2020 - 05:28

హైదరాబాద్, జనవరి 29: ఇంటర్మీడియట్ విద్యలో కొత్తగా మరిన్ని ఉపాధి ఆధారిత వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ చెప్పారు. ఈ కొత్త కోర్సులను విజయవంతం చేసేందుకు జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు సహకరించాలని ఆయన సూచించారు.

01/30/2020 - 05:27

హైదరాబాద్, జనవరి 29: ఎన్నికల చట్టాలపై కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం అవగాహన లేదని తెలంగాణ రాష్ట్ర సమితి దుయ్యబట్టింది. ఎక్స్ ఆఫీషియో ఓట్లపై రాద్ధాంతం చేస్తోన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అసలు ఎన్నికల చట్టాలపై అవగాహన ఉందా? అని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గాదరి బాలమల్లు ధ్వజమెత్తారు.

01/30/2020 - 05:23

హైదరాబాద్: సొంత వాహనదారులు తమకు కావాల్సిన ఫ్యాన్సీ నెంబర్లను ఇక నుంచి ఈ-బిడ్డింగ్ ద్వారా దక్కించుకోవచ్చునని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సొంత వాహనదారులు గతంలో ఫ్యాన్సీ నెంబర్ల కోసం మంత్రులు, అధికారులపై వత్తిడి తెచ్చి ఫ్యాన్సీ నెంబర్లను దక్కించుకునేవారని ఆయన గుర్తు చేశారు.

01/30/2020 - 05:20

హైదరాబాద్, జనవరి 29: తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై బుధవారం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ రెండు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించింది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ అవసరాలు, వినియోగంపై రాష్ట్ర విద్యుత్ అధికారులతో కమిషన్ భేటీ అయ్యింది. అవసరమైన విద్యుత్ ఉత్పత్తి,కొనుగోలుకు చేస్తున్న ఒప్పందాలపై కమిషన్ చర్చింది.

01/30/2020 - 05:20

హైదరాబాద్, జనవరి 29: రాష్ట్రంలో విద్యుత్ వాడకం గణనీయంగా పెరుగుతోందని, అందుకు పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం హైదరాబాద్ మింట్‌కాంపౌండ్ ఎస్‌పీడీఎస్‌ఎల్‌లో జరిగిన విద్యుత్ అధికారుల సమీక్షలో మంత్రి పాల్గొన్నారు.

,
01/30/2020 - 05:19

హైదరాబాద్, జనవరి 29: మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. మంత్రి సత్యవతితో పాటు ఈ శాఖ కార్యదర్శి బెనహర్ మహేష్‌దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తుకూడా గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. గవర్నర్‌కు మంత్రి సంప్రదాయ వెండి కుంకుమ భరిణ ఇచ్చి, మేడారం జాతర -2020 ఆహ్వానపత్రికను అందించారు.

01/30/2020 - 05:15

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన అధికార తెలంగాణ రాష్ట్ర సమితి సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, వైస్ చైర్మన్ పదవులకు కల్పించిన రిజర్వేషనే్ల కాకుండా చాలా చోట్ల జనరల్ సీట్లలో బహుజనులకు పదవులు కట్టబెట్టి తన ఉదారతను చాటుకుంది.

01/30/2020 - 05:14

హైదరాబాద్, జనవరి 29: రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో ప్రసాదాల తయారీకి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రభుత్వ రెవెన్యూ (దేవాదాయ) శాఖ కార్యదర్శి, ఎండోమెంట్స్ కమిషనర్ వి. అనిల్ కుమార్ నేతృత్వంలో ఇక్కడి ధార్మిక భవన్‌లో బుధవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావుతో పాటు ప్రధాన దేవాలయాల నుండి అధికారులు వచ్చారు.

01/30/2020 - 01:13

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కరోనా వైరస్ రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం ఆయన వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఫీవర్ దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తదితరులతో ఇక్కడ సమావేశం నిర్వహించారు. సమావేశం తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

Pages