S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/03/2020 - 01:15

హైదరాబాద్: సాంకేతికత సా మాన్యుడికి మేలు చేసేలా ఉండాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సాంకేతిక ఫలాలు ప్రజలకు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాంకేతికతలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఈ 2020 సంవత్సరాన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్‌గా కేటీఆర్ ప్రకటించారు.

01/03/2020 - 01:12

హైదరాబాద్, జనవరి 2: ‘మంచిని కాపాడటం కోసం కఠినంగా వ్యవహరించడం తప్పుకాదు. కర్తవ్య నిర్వహణలో అది అవసరం కూడా... ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుంది. ప్రజల మనోభావాలను గుర్తించి, గౌరవించి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అదేమి తప్పు కాదు. సమాజానికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు కొన్ని పనులు కఠినంగా చేయక తప్పదు’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు.

01/03/2020 - 01:09

హైదరాబాద్, జనవరి 2: మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలకు దిశా నిర్దేశం చేయడానికి టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

01/02/2020 - 05:43

హైదరాబాద్, జనవరి 1: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గవర్నర్ రంగరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను ప్రజా ప్రతినిధులు అధికారులు బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ కమిషన్లు, కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు పార్టీ సీనియర్ నేతలు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

01/02/2020 - 05:39

హైదరాబాద్, జనవరి 1: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర కమిటీ, సీనియర్ పార్టీ నేతలతో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బుధవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. గత వారంలో జరిగిన సమావేశంలో చర్చించిన పలు అంశాలకు సంబంధించిన వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.

01/02/2020 - 05:14

హైదరాబాద్, జనవరి 1: రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ తరఫున స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులందరికీ ఒకే కామన్ సింబల్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. పార్టీ గుర్తులు కలిగి ఉన్న ప్రాంతీయ, జాతీయ రాజకీయ పార్టీలకు వారి వారి పార్టీ గుర్తులే ఉంటాయి. వీటితో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద తమ పార్టీ పేర్లను రిజిస్టర్ చేసుకున్నాయి.

01/02/2020 - 05:07

హైదరాబాద్, జనవరి 1: అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ఫ్లొరేషన్ అండ్ రీసెర్చ్ (ఏఏమ్‌డీ) డైరెక్టర్‌గా డాక్టర్ డీకే సిన్హా బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సిన్హా ఈ పదవి చేట్టకముందు ఇదే డైరెక్టరేట్‌లో అదనపు డైరెక్టర్‌గా పనిచేశారు. దేశంలో తూర్పు, పశ్చిమ, మధ్య భాగాల్లో భిన్నమైన భౌగోళిక డొమైన్‌లలో విస్తరించిన ఖనిజాల అనే్వషణ్‌లో సిన్హాకు 35 సంవత్సరాల అనుభవం ఉంది.

01/02/2020 - 05:04

హైదరాబాద్, జనవరి 1: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలనపై ఉద్యమాలు అనివార్యమవుతున్నాయని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. బుధవారం నాడు ఆయన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 2020 నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యంత కీలకమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని చెప్పారు.

01/02/2020 - 05:44

హైదరాబాద్: గతంలో కాంగ్రెస్‌లో ఉండి వేరే పార్టీలోకి వెళ్లిన నేతలు తిరిగి సొంత గూటికి చేరుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో బుధవారం పలువురు పార్టీ మాజీ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో తిరిగి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్సేనన్నారు.

01/02/2020 - 05:06

హైదరాబాద్: కుటీర, చిన్నతరహా పరిశ్రమలు మొదలుకుని జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ఉత్పత్తులను మహానగరవాసులకు సంవత్సరానికి ఓసారి అందుబాటులోకి తెచ్చే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్-2020) బుధవారం ప్రారంభమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్‌ను ప్రారంభించారు.

Pages