S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/02/2020 - 04:54

హైదరాబాద్, జనవరి 1: వర్కింగ్ జర్నలిస్టులు తమ డైరీలోని ప్రతిపేజీలో సమాజ శ్రేయస్సు కోసం మంచి పనులు, విజయాలు నమోదయ్యేలా కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కోరారు. బుధవారం రాజ్‌భవన్‌లో తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో మీడియా డైరీని గవర్నర్ ఆవిష్కరించారు. డైరీలో ప్రచురించిన సమాచారాన్ని ఆమె పరిశీలించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు అధ్యక్షుడు కే.

01/02/2020 - 04:51

హైదరాబాద్, జనవరి 1: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు (సెట్) మెంబర్ సెక్రటరీగా ప్రొఫెసర్ ఎన్ కిషన్ నియమితులయ్యారు. ఉస్మానియా యూనివర్శిటీ గణితశాస్త్ర సీనియర్ ఆచార్యుడిగా వ్యవహరిస్తున్న కిషన్ గత ఏడాది టీఎస్ సీపీజెట్ కన్వీనర్‌గా వ్యవహరించారు. తెలంగాణలోని అన్ని యూనివర్శిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే సీపీజెట్‌ను వివాదాలకు అతీతంగా విజయవంతంగా నిర్వహించి మంచి పేరుతెచ్చుకున్నారు.

01/02/2020 - 01:14

'చిత్రం...ఆంగ్ల సంవత్సరం ప్రారంభం సందర్భంగా బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్

01/02/2020 - 01:11

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుండి ప్రారంభమవుతున్న పల్లె ప్రగతి-2 కార్యక్రమం సందర్భంగా 18 సంవత్సరాలు పైబడి వయసు ఉండి చదవడం, రాయడం రాని నిరక్షరాస్యుల జాబితాను

01/02/2020 - 01:07

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం రెండో దశ గురువారం నుండి ప్రారంభమవుతోంది. దీనిని పల్లె ప్రగతి-2 గా పిలుస్తున్నారు. తొలి దశ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని 2019 సెప్టెంబర్ 6 నుండి నెల రోజుల పాటు నిర్వహించారు. మూడు నెలల తర్వాత రెండోదశ కార్యక్రమం చేపడుతున్నారు. గురువారం ప్రారంభమయ్యే రెండోదశ పల్లె ప్రగతి 11 రోజుల పాటు కొనసాగుతుంది.

01/02/2020 - 01:06

హైదరాబాద్, జనవరి 1: ‘ఈ దశాబ్దం టీఆర్‌ఎస్‌దే. మరో పదేళ్లపాటు సీఎంగా కేసీఆరే. ఈ 2020 కూడా టీఆర్‌ఎస్ నామ సంవత్సరం కాబోతోంది. 2019లో జరిగిన ఎన్నికల్లో అన్ని విజయాలను సొంతం చేసుకున్నట్టే ఈ ఏడాది ఆరంభంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధించి శుభారంభాన్ని మొదలు పెట్టబోతున్నాం’ అని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

01/01/2020 - 05:40

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 31: ప్రాజెక్టుల నిర్మాణంపై కనీస పరిజ్ఞానం లేకుండా విమర్శలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని, ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంపై పూర్తి అవగాహనతోనే తప్పొప్పులను ప్రశ్నిస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.

01/01/2020 - 05:37

నల్లగొండ, డిసెంబర్ 31: ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 18 మున్సిపాల్టీల్లో గులాబీ విజయ పతాకం ఎగరడం ఖాయమని, సీఎం కేసీఆర్ పథకాల పట్ల ప్రజల్లో నెలకొన్న ఆదరణ పార్టీకి ఘన విజయం అందించనుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు.

01/01/2020 - 05:32

హైదరాబాద్, డిసెంబర్ 31: ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తెలంగాణ పోలీసుల లక్ష్యమని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. డీజీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన పోలీసు ఉన్నాతాధికారులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో డీజీపీ పాల్గొని ప్రసంగించారు. కొత్త సంవత్సరంలో సరికొత్త ఆధునిక ఆలోచనలు, పరిజ్ఞానంతో పౌరుల రక్షణకు పోలీస్ శాఖ పలు చర్యలను చేపడుతోందని అన్నారు.

01/01/2020 - 05:51

వరంగల్, డిసెంబర్ 31: పౌరసత్వ చట్ట సవరణపై ఎవరికి ఆందోళన అవసరం లేదని, భారతదేశంలోని 134 కోట్ల మంది ప్రజలకు ఇది ఎమాత్రం వర్తించదని బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ టీ. రాజేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం కాజీపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Pages