S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/01/2020 - 05:29

హుజూరాబాద్ రూరల్, డిసెంబర్ 31: గ్రామాల్లో జరిగే పనుల్లో ప్రజాప్రతినిధులు ప్రజలను భాగస్వాములను చేయాలని, గ్రామాల్లో వౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకుని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో మంగళవారం పల్లె ప్రగతి కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందితో సబ్ డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

01/01/2020 - 05:26

హైదరాబాద్, డిసెంబర్ 31: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఉద్ధేశ్యపూర్వకంగానే ప్రభుత్వం జాప్యం చేస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితో పొత్తులు లేకుండా స్వతంత్రంగానే పోటీచేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల పర్యవేక్షణకు రాష్టస్థ్రాయిలో ఒక కమిటీని నియమించనున్నట్టు ఆయన చెప్పరు.

01/01/2020 - 05:05

హైదరాబాద్, డిసెంబర్ 31: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్‌టీఆర్ సమగ్ర జీవిత కథపై సంక్షిప్తంగా పాఠకులకు తెలియజేయడానికి తెలుగులో పుస్తకాన్ని తీసుకువచ్చామని రచయితలు చంద్రహాస్, లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

01/01/2020 - 05:50

హుజూర్‌నగర్: త్వరలో పీసీసీ అధ్యక్ష పదవి నుండి తాను తప్పుకుంటానని, పూర్తిస్థాయి అధ్యక్షుడు వస్తారని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడని ఎవ్వరూ భయపడవద్దని, తాను ఇక్కడే సొంత ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటానని వెల్లడించారు.

01/01/2020 - 01:43

మహబూబ్‌నగర్, డిసెంబర్ 31: ఆసియా ఖండంలోనే ఆటోమేటిక్ సైఫాన్ ప్రాజెక్టుగా పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు పొందిన సరళాసాగర్ ప్రాజెక్టు ఆనకట్టకు మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో గండిపడింది. మొదటగా ఆనకట్ట కింది భాగంలో కొద్దిగా గండిపడి నీరు పోతూ ఏకంగా అరగంట వ్యవధిలోనే ప్రాజెక్టు ఆనకట్ట కోతకు గురవుతూ ఒక్కసారిగా తెగిపోయింది. ప్రాజెక్టు మధ్యలోని

01/01/2020 - 01:40

హైదరాబాద్, డిసెంబర్ 31: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గాడి తప్పిందని, ప్రతిపక్ష పార్టీ ల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ప్ర దేశ్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం మంగళవారం గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేసింది. ఆర్‌ఎస్‌ఎస్, ఎంఐఎం సభలకు అనుమతి ఇచ్చి కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీని అడ్డుకున్నట్టు వారు వివరించారు.

01/01/2020 - 01:36

హైదరాబాద్, డిసెంబర్ 31: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, ఆశయాలకు అనుగుణంగా, ఒక టీం వర్క్‌లాగా పనిచేస్తానని కొత్త సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. బీఆర్‌కే భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ, ప్రభుత్వం నిర్ణయించుకున్న లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు కృషి చేస్తానని అన్నారు. పద వీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్‌కు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు.

01/01/2020 - 01:34

హైదరాబాద్: ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నలుగురు సీఎస్‌లుగా బాధ్యతలు నిర్వర్తించగా, సోమేష్ కుమార్ ఐదో అధికారి. గత రెండేళ్లుగా సీఎస్ బాధ్యతలను నిర్వర్తించిన ఎస్.కే. జోషి మంగళవారంనాడే పదవీ విరమణ చేశారు. జోషి నుండి సోమేష్‌కుమార్ బాధ్యతలను తీసుకున్నారు.

01/01/2020 - 01:27

హైదరాబాద్, డిసెంబర్ 31: రాష్ట్ర సచివాలయాన్ని బీఆర్కే భవన్‌కు మార్చిన తర్వాత పాలన మరింత కుంటుపడిందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం నాడు ఆయన పార్టీ రాష్టక్రార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. బీఆర్కే భవన్‌లో సచివాలయ కార్యాయాలు ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియని గందరగోళం నెలకొందని పేర్కొన్నారు.

01/01/2020 - 01:25

హైదరాబాద్, డిసెంబర్ 31: తెలంగాణ రాష్ట్రంలో సఖి కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయని వివిధ స్వచ్ఛంద సంస్థలు చెప్పడం ఎంతో అభినందించదగ్గ విషయమని రాష్ట్ర గరిజన సంక్షేమ, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

Pages