S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/05/2020 - 04:24

హైదరాబాద్, జనవరి 4: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావును శనివారం తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు మమత, ఎంబీ.కృష్ణయాదవ్ ఇతర నాయకులతో కూడిన ప్రతినిధుల బృందం కేటీఆర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

01/05/2020 - 01:33

హైదరాబాద్: కుల వృత్తులకు చేయూత ఇచ్చింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గీత కార్మికులకు చెట్ల పన్ను రద్దు, యాదవులకు గొర్రెల పెంపకం, మత్స్యకారులకు చేపల పెంపకం వంటి కుల వృత్తులను ప్రోత్సహించడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు.

01/05/2020 - 01:26

హైదరాబాద్, జనవరి 4: ‘మున్సిపల్ ఎన్నికల్లో మనదే విజయం. 100 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లు పక్కాగా మనవే. సర్వేలన్నీ మనకే అనుకూలంగా వచ్చాయి. పరిస్థితి బాగున్నప్పటికీ ఎక్కడైనా తేడా వచ్చిందో ఉన్న పదవులు ఊడుతాయి తస్మాత్ జాగ్రత్త’ అని పార్టీ నేతలను తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు.

01/04/2020 - 17:05

హైదరాబాద్: రాష్ట్రంలోని 120 మున్సిపాల్టీలు, 10 కార్పోరేషన్లలో విజయం మనదేనని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన టీఆర్‌ఎస్ పార్టీ విస్తత్ర స్థాయి సమావేశంలో మాట్లాడుతూ సర్వేలన్నీ తమకు అనుకూలంగా వచ్చాయని, గెలుపు బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. పార్టీ అభ్యర్థిని నిర్ణయించిన తరువాత గెలుపు బాధ్యత తీసుకోవాలని అన్నారు.

01/03/2020 - 13:38

హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారిణి నాగరత్నం తెలిపారు. మరో రెండు రోజుల పాటు ఈ వర్షాలు కురుస్తాయని చెప్పారు. నిన్న కొన్ని ప్రాంతాలలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడ్డాయన్నారు. చలిగాలుల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఈ నెల 5 నుంచి చలి గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నాగరత్నం వెల్లడించారు.

01/03/2020 - 13:31

హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో భారీ చోరీ జరిగింది. కోట్ల రూపాయలు విలువ చేసే సిగరెట్ ప్యాకెట్లను దొంగిలించారు. అమీన్ రహదారిలో కృష్ణవేణి స్కూల్‌పైన ఉన్న ఐటీసీ ఆశీర్వాద్ డిస్ట్రీబ్యూటర్ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు సిగరేట్ బాక్సులు, ఇతర ఉత్పత్తులను దోచుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

01/03/2020 - 05:53

హైదరాబాద్, జనవరి 2: తెలంగాణ రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయాన్ని సావిత్రిబాయ్ పేరిట ఏర్పాటు చేయాలని సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ గురువారం నాడు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు. రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన చైర్మన్ నాగటి నారాయణ మాట్లాడుతూ సావిత్రిబాయి జీవిత విశేషాలను గుర్తుచేశారు. రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయం ఆవశ్యకతను వివరించారు.

01/03/2020 - 05:51

హైదరాబాద్, జనవరి 2: అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల అమలు చేయడంలో అధికారులు కీలకపాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచించారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం 2020 డైరీ, క్యాలెండర్‌ను గురువారం ప్రగతివన్‌లో సీఎం ఆవిష్కరించారు.

01/03/2020 - 05:48

హైదరాబాద్, జనవరి 2: తెలంగాణలో దీటైన విపక్షంగా బీజేపీ నిలిచిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన కల్పిస్తామని అన్నారు. టీఆర్‌ఎస్ ముసుగులో మజ్లిస్ నేతలు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసేలా కనిపిస్తోందని ఆరోపించారు.

01/03/2020 - 05:48

ఖమ్మం, జనవరి 2: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పనులు చేయకపోతే సర్పంచ్‌లు ఇంటికి వెళ్ళాల్సిందేనని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హెచ్చరించారు. రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని వేపకుంట్ల గ్రామంలో గురువారం ప్రారంభించిన ఆయన గ్రామంలో మొక్కలు నాటారు.

Pages