S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/07/2020 - 01:00

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ ప్రక్రియ హైకోర్టు ఆదేశాల మేరకు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) అధికారి ఒకరు తెలిపారు. సోమవారం సాయంత్రం ఈ అధికారి ‘ఆంధ్రభూమి’ ప్రతినిధితో మాట్లాడుతూ, కోర్టులో జరిగిన విచారణకు తమ కమిషన్ తరఫున అడ్వకేట్ హాజరయ్యారని తెలిపారు. కోర్టు ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటిస్తామని

01/07/2020 - 00:57

హైదరాబాద్/ఘట్‌కేసర్, జనవరి 6: ఐటీ అంటే ఇన్ఫ్‌ర్మేషన్ టెక్నాలజీ కాదని, ఇకనుంచి ఐటీ అంటే ఇంటెలిజెన్స్ టెక్నాలజీగా పునర్నిర్వచించాల్సిన సమయం ఆసన్నమైందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఇరవై సంవత్సరాలుగా ఐటీని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా పరిగణిస్తున్నారని, కానీ ఇప్పుడా పరిస్థితి మారిందని, ఐటీ అంటే ఇంటెలిజెన్స్ టెక్నాలజీగా పరిగణించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు.

01/06/2020 - 05:13

హైదరాబాద్, జనవరి 5: తమ పార్టీ యువ నేత కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యమంత్రి అయితే తామంతా స్వాగతిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడని కితాబునిచ్చారు. యువ నాయకత్వం రాష్ట్రానికి అవసరమని కూడా మంత్రి అభిప్రాయపడ్డారు. కేటీఆర్‌ను ఈ టర్మ్‌లో సీఎం చేసినా, వచ్చే ఎన్నికల తర్వాత చేసినా ఎప్పుడు చేసినా స్వాగతిస్తామన్నారు.

01/06/2020 - 05:10

హైదరాబాద్, జనవరి 5: దేశంలో రోజురోజుకు మతోన్మాద శక్తుల ఆగడాలు పెరిగిపోతున్నాయని, వీటిని అణచివేయడానికి కేంద్రం ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని అఖిల భారత శాంతి సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. మూడురోజుల పాటు చత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో జరుగుతున్న అఖిల భారత శాంతి సంఘం జాతీయ మహాసభలు జరిగాయి.

01/06/2020 - 05:10

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణ మున్సిపాల్టీల్లో తమకు బలం ఉన్న ప్రాంతాల్లో సీపీఐ అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపుతామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ధ్యేయంగా పని చేయాల్సిందిగా పార్టీ కేడర్‌కు ఆయన పిలుపు ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ ముఖ్దూమ్ భవన్‌లో మేడ్చల్ జిల్లా సీపీఐ సర్వసభ్య సమావేశం జరిగింది.

01/06/2020 - 05:09

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణ టీడీపీ మహిళా విభాగం పటిష్టతకు కృషి చేస్తానని ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న ప్రకటించారు. పార్టీ తనను తెలుగుదేశం టీడీపీ మహిళా విభాగానికి నియమించినందుకు అధ్యక్షుడు చంద్రబాబుకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తామన్నారు.

01/06/2020 - 05:07

హైదరాబాద్, జనవరి 5: రాష్ట్రంలో ఒకవైపు విపరీతమైన చలి వీస్తుండగా మరోవైపు, మున్సిపల్ ఎన్నికల సెగతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఆరు నెలలుగా వాయిదా పడుతూ, పడుతూ ఎట్టకేలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

01/06/2020 - 05:06

హైదరాబాద్, జనవరి 5: టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం పరామర్శించారు. ఇటీవల అస్వస్థతకు గురైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. బొజ్జలకు మంచి మిత్రుడైన సీఎం కేసీఆర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

01/06/2020 - 05:04

సికిందరాబాద్, జనవరి 5: ఇస్లాం రాజ్యాల నుంచి ఏళ్లక్రితం భారతదేశానికి వచ్చిన శరణార్థులైన క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, హిందువులకు కనీస హక్కులు కల్పించడం కోసమే పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సికిందరాబాద్ పద్మారావునగర్‌లో ఘర్ ఘర్ సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి కిషన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు.

01/06/2020 - 01:13

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల ముందస్తు చర్యలను ప్రభుత్వం పూర్తి చేసింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా సిద్ధం చేయడం, మున్సిపల్ చైర్‌పర్సన్లు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, వార్డు కౌన్సిలర్లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్ ప్రక్రియలు పూర్తయ్యాయి. ఈ నెల 7న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. 8న రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటీస్‌లు జారీ చేస్తారు.

Pages