S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/01/2020 - 01:21

హైదరాబాద్, డిసెంబర్ 31: పౌరసత్వ సవరణ చట్టాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పలేకపోతున్నారని బీజేపీ నేత డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేసి రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తున్న సీఎం కేసీఆర్ ప్రజల దృష్టిని మరల్చేందుకు మానేరు నది సందర్శన చేపట్టారని ఆరోపించారు.

01/01/2020 - 01:19

హైదరాబాద్: ‘ఈచ్ వన్...టీచ్ వన్’ నినాదంతో వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నూతన సంవత్సరంలో ప్రతిన పూనాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ప్రతి చదువుకున్న వ్యక్తీ నిరక్షరాస్యుడైన మరొకరిని అక్షరాస్యునిగా మార్చాలని అన్నారు. తెలంగాణ సంపూర్ణ అక్షరాస్యత సాధించే సవాల్‌ను స్వీకరించాలని సీఎం పిలుపునిచ్చారు.

12/31/2019 - 05:11

ఖమ్మం, డిసెంబర్ 30: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద 3,500కోట్ల రూపాయలతో బ్యారేజి నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం పినపాక నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించిన ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకు కూడా లబ్ధి జరగనున్నదన్నారు.

12/31/2019 - 04:59

హైదరాబాద్, డిసెంబర్ 30: కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో విద్యుత్ శాఖకు రూ. 700 కోట్ల భారం తగ్గిందని రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. సోమవారం విద్యుత్ సౌధలో విద్యుత్ శాఖలో ఓసీ ఉద్యోగ సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో 2020 డైరీ ఆవిష్కరించారు.

12/31/2019 - 04:57

హైదరాబాద్, డిసెంబర్ 30: ప్రధాని నరేంద్రమోదీ దూకుడు తట్టుకోలేక పౌరసత్వ సవరణ చట్టంపై పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంటు ఆమోదం పొందడంతో పలు రాజకీయ పార్టీలకు వేరే అంశాలు లేక అనవసర రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు.

12/31/2019 - 04:50

హైదరాబాద్, డిసెంబర్ 30: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్- గౌహతి- రాక్స్‌ల్ మధ్య 52 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. ఈ రైళ్లు జనవరి, మార్చి మధ్య రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్- గౌహతి (02513 - 02514), సికింద్రాబాద్- రాక్స్‌ల్ ( 07091- 07092) రైళ్లు నడుస్తాయి.

12/31/2019 - 04:49

హైదరాబాద్, డిసెంబర్ 30: ఏపీలో మూడు రాజధానుల ప్రకటనపై ఇంకా రగడ కొనసాగుతునే ఉందని, ఏపీలో పరిస్థితులకు ఇద్దరు నేతలూ కారణమేనని పేర్కొంటూ సీఎం జగన్మోహన్‌రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు ఇద్దరూ ఒకే తానుముక్కలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ పేర్కొన్నారు.

12/31/2019 - 04:46

హైదరాబాద్, డిసెంబర్ 30: విద్యుత్ శాఖలో రెండు లక్షలు వేతనం తీసుకుంటున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయ అధికారులే లంచాలకు పాల్పడడం సిగ్గుచేటని తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పై అధికారులే లంచాలకు పాల్పడితే దిగువస్థాయి అధికారులు అవినీతికి పాల్పడితే ఎలా మందలిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

12/31/2019 - 04:45

హైదరాబాద్, డిసెంబర్ 30: ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల నిర్వహణకు బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. వచ్చే ఫిబ్రవరి 1 నుండి ప్రాక్టికల్ పరీక్షలకు, మార్చి 4వ తేదీ నుండి థియిరీ పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్టు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. పరీక్షలకు 9.65 లక్షల మంది ఫీజులు చెల్లించారని, ఈ సంఖ్య మొత్తం విద్యార్ధులతో పోల్చుకుంటే 97.93 శాతం ఉందని ఆయన చెప్పారు.

12/31/2019 - 04:44

హైదరాబాద్, డిసెంబర్ 30: వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. హాకాభవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో మాట్లాడుతూ, వ్యవసాయంతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రానికి లేఖ రాశానని చెప్పారు. రైతులకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు.

Pages