S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/17/2018 - 23:55

హైదరాబాద్, మే 17: తెలంగాణలోని ఉన్నత విద్యాసంస్థలు, యూనివర్శిటీలు రానున్న రోజుల్లో వరల్డ్ ర్యాంకింగ్స్‌కు పోటీపడటం ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గడించేలా చర్యలు చేపట్టేందుకు ఉన్నత విద్యామండలి సన్నాహాలు ప్రారంభించింది.

05/17/2018 - 23:54

గోదావరిఖని, మే 17: ‘దళిత, గిరిజన బతుకులతో ఆటలాడుకుందామని చూస్తే ఊరుకునే సమస్యే లేదు... మా హక్కును ఎన్ని పోరాటాలు చేసైనా పరిరక్షించుకుంటాం’ అంబేద్కర్ ప్రసాదించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నిర్వీర్యం చేసేందుకు న్యాయ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద క్రిష్ణ మాదిగ ధ్వజమెత్తారు.

05/17/2018 - 00:06

హైదరాబాద్, మే 16: తెలంగాణలో మస్తుగా చేపల అభివృద్ధికి అవసరమైన నిధులు పుష్కలంగా ఉన్నాయని నేషనల్ ఫిషరీష్ డెవలప్‌మెంట్ బోర్డు సిఈఓ రాణికుముదినిదేవి తెలిపారు. బుధవారం సచివాలయంలో మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో కలసి చేపల అభివృద్ధిపై చర్చించారు. చేపల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఎన్‌ఎఫ్‌డిబి పూర్తి సహకారం అందిస్తుందని ఆమె భరోసా వ్యక్తం చేశారు.

05/17/2018 - 00:05

హైదరాబాద్, మే 16: యావత్ సింగరేణిలో పని చేస్తున్న కార్మికులకు ఆధునిక వైద్యం అందించడానికి సూపర్ స్పెషాలిటీ అసుపత్రుల సంఖ్యను 72కు పెంచుతూ సంస్థ సిఎండి శ్రీ్ధర్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం నాడు హైదరాబాద్ సింగరేణి భవనంలో గుర్తింపు పొందిన సింగరేణి కార్మికుల సంఘాల నేతలతో సంస్థ సిఎండి సమావేశం నిర్వహించారు. 35వ సంయుక్తసంప్రదింపుల కమిటీ సమావేశంలో ఉద్యోగుల రక్షణ, సంక్షేమం వంటి అంశాలపై చర్చంచారు.

05/17/2018 - 00:04

హైదరాబాద్, మే 16: ప్రైవేటు పాఠశాలల బస్సులు ఊళ్లోకి వస్తే వాటి గాలి తీసేయాలని తాను పేర్కొనడం తప్పేనని, ఆ ప్రకటనలో ఎలాంటి దురుద్దేశం లేదని, కేవలం ప్రభుత్వ పాఠశాలలను ఆదరించాలన్న ఉద్దేశంతో మాత్రమే తాను అలా చెప్పానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలపై తనకెలాంటి వ్యతిరేక భావం లేదని అన్నారు. ప్రజలు ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్య చేశానని చెప్పారు.

05/17/2018 - 00:02

హైదరాబాద్, మే 16: దేశంలో ప్రతి ఏటా ఇంజనీరింగ్ కాలేజీలు పెరగడం, ఏదో రకంగా ఇంజనీరింగ్‌లో చేరి పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు లేక, వృత్తిపరమైన సామర్ధ్యాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోవడంతో చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉభయ రాష్ట్రాల్లో ప్రతి ఏటా లక్షన్నర మంది ఇంజనీరింగ్ యుజి, పిజి విద్యార్ధులు తమ చదువులు పూర్తి చేస్తున్నారు.

05/17/2018 - 00:01

హైదరాబాద్, మే 16: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జూన్ 8న చేపమందు పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి చేప మందుకోసం వస్తున్న ప్రజల సౌకర్యం కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు.

05/16/2018 - 23:58

హైదరాబాద్, మే 16: కర్నాటకలో అధికారం కోసం కాంగ్రెస్, జెడిఎస్‌లను చీల్చబోమని భరతమాత మీద ఒట్టు పెట్టి చెప్పగలరా? అని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను ప్రశ్నించారు. నీతులు చెప్పే బీజేపీ నాయకులు ఇప్పుడు కర్నాటకలో జెడిఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపించి ఆ పార్టీలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి బుధవారం విలేఖరుల సమావేశంలో అన్నారు.

05/16/2018 - 23:57

హైదరాబాద్, మే 16: రైళ్లు, రైల్వే స్టేషన్లలో అధిక ధరలకు ఆహార పదార్ధాలను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ హెచ్చరించారు. క్యాటరింగ్ విభాగం పనితీరుతో పాటు భోజనం, అల్పాహారం, స్నాక్స్ ఇలా అన్నింటా నాణ్యత పాటించడంతో పాటు నిర్ణయించిన ధరలకు మాత్రమే విక్రయించాలి తప్ప అదనంగా విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

05/16/2018 - 23:55

హైదరాబాద్, మే 16: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగళూరు ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ స్లైడింగ్ విధానంలో కౌనె్సలింగ్ ప్రారంభమైంది. సీట్ల కేటాయింపు ప్రక్రియ 19వ తేదీ వరకూ జరుగుతుందని అదనపు ఉప కులపతి ఎన్ శివప్రసాద్ చెప్పారు.

Pages