S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/20/2018 - 00:09

హైదరాబాద్, ఏప్రిల్ 19: తర్ఫీదు ఇవ్వడం వల్ల విద్యార్థులను తీర్చిదిద్దినట్టవుతుందని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ పేర్కొన్నారు. మహబూబియా ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో విద్యార్ధులకు నీట్, జెఇఇ, ఎమ్సెట్ ప్రవేశపరీక్షలకు శిక్షణ ఇచ్చారు. గురువారం నాడు శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి కార్యదర్శి అశోక్ హాజరయ్యా రు.

04/18/2018 - 04:28

హైదరాబాద్, ఏప్రిల్ 17: నగరం ఎర్రభారింది..., ఎటుచూసినా ఎర్ర తోరణాలు, జెం డాలు రెపరెపలాడుతున్నాయి. సీపీఎం 22వ అఖిల భారత మహాసభలు బుధవా రం నుం చి ప్రారంభం కానున్నాయి. సామాజిక న్యా యం, మతోన్మాద శక్తులను గద్దె దించడం వంటి ప్రధాన అజెండాలతో ఈ కీలక సమావేశాలు జరగనున్నాయి. 21వరకు ఆర్టీసీ కల్యాణ మండపంలో మహాసభలు కొనసాగుతాయి. 22న సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ తో సమావేశాలు ముగుస్తాయి.

04/18/2018 - 02:56

హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అమోఘమని కేరళ రాష్ట్ర మంత్రి మెర్సికుట్టి ప్రశంసించారు. మంగళవారం సచివాలయంలో ఆమె రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్య రంగం అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాల గురించి తలసాని ఆమెకు వివరించారు.

04/18/2018 - 02:54

ధర్మపురి, ఏప్రిల్ 17: బహుముఖ ప్రజ్ఞాశాలి రొట్టె విశ్వనాథ శాస్ర్తీ అశీతి (80) వర్ష పూర్ణాయుష్షు నిండిన, సహస్ర పూర్ణ చంద్రోదయ దర్శనం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

04/18/2018 - 02:52

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చేలా, విభజన హామీలు అమలు చేసే విధంగా చూడాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేసింది.

04/18/2018 - 02:48

హైదరాబాద్, ఏప్రిల్ 17: మతోన్మాదంతో రగలి పోతూ దళిత, బహుజన వర్గాలపై దాడులకు తెగబడుతున్న వారి కోరలు పీకాలని సదస్సులో వక్తలు నిర్ణయించారు. సీపీఐ 23వ జాతీయ మహాసభల సందర్భంగా హైదరాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో నగరంలో ‘ మతోన్మాద రాజకీయాలు-లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల కర్తవ్యం’ అనే అంశంపై సదస్సును నిర్వహించారు.

04/18/2018 - 02:48

హైదరాబాద్, ఏప్రిల్ 17: శ్రమ జీవులు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే మేడే వేడుకలను రాష్ట్ర పండుగలా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను రవీంధ్రభారతిలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ సందర్భంగా శ్రమ శక్తి, బెస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డులు అందించనున్నారు.

04/18/2018 - 02:47

హైదరాబాద్, ఏప్రిల్ 17: రాష్ట్రంలోని 19 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల గడువును ఆరు నెలల పాటు పొడిగిస్తూ, వేర్వేరుగా జీఓలు జారీ అయ్యాయి. వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి మంగళవారం ఈ జీఓలు జారీ చేశారు.

04/18/2018 - 02:46

హైదరాబాద్, ఏప్రిల్ 17: ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను రద్దును హైకోర్టు తీర్పుపై పలువురు నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సీఎల్‌పీ జానారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసన సభ్యత్వాలను రద్దును హైకోర్టు కొట్టి వేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టు వంటిదని. ప్రభుత్వ అహంకారంతో, అప్రజాస్వామికంగా వ్యవహారించింది.

04/18/2018 - 02:43

హైదరాబాద్, ఏప్రిల్ 17: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ్యత్వాల రద్దును హైకోర్టు కొట్టి వేయడంతో మంగళవారం గాంధీ భవన్‌లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలు గాంధీ భవన్ ఆవరణలో బాణాసంచా కాల్చారు. మిఠాయిలు పంచి పెట్టుకున్నారు. డప్పువాయిద్యాలతో సంతోషంగా నృత్యం చేశారు.

Pages