S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/24/2019 - 02:22

హైదరాబాద్, డిసెంబర్ 23: తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ సి.వి. రామలు, ఉప లోకాయుక్తగా వి. నిరంజన్‌రావు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో సోమవారం సాయంత్రం వీరిద్దరి చేత గవర్నర్ తమిళిసై

12/24/2019 - 02:17

హైదరాబాద్: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో ఓటర్ల జాబితాలకు సంబంధించి షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) సోమవారం జారీ చేసింది. ఎస్‌ఈసీ కమిషనర్ వి. నాగిరెడ్డి పేరుతో సోమవారం జారీ అయిన ఓటర్ల జాబితా షెడ్యూల్ ఇలా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని వార్డుల వారీగా ఫొటో గుర్తింపుతో ఓటర్ల జాబితాలను 2019 డిసెంబర్ 30న జారీ చేస్తారు.

12/24/2019 - 02:17

హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ‘నగారా’ మోగింది. దాదాపు ఏడాది కాలంగా నగరాలు, పట్టణాల్లోని రాజకీయ నాయకులు, ప్రజలు ఎదురుచూస్తున్న ఈ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం షెడ్యూల్ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి పేరుతో నోటిఫికేషన్ జారీ అయింది.

12/24/2019 - 01:59

హైదరాబాద్, డిసెంబర్ 23: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సంకల్ప శిబిరాన్ని ఈ నెల 24 నుండి 26 వరకూ భారత్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్నట్టు ప్రాంత సంఘ్‌చాలక్ బి దక్షిణామూర్తి, ప్రాంత కార్యవాహ కంచం రమేష్‌లు తెలిపారు. సోమవారం నాడు వారు కేశవనిలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో శాఖ ముఖ్య శిక్షకులు ఆ పైస్థాయి బాధ్యులు 8వేల మంది పాల్గొంటారని అన్నారు.

12/23/2019 - 04:48

హైదరాబాద్, డిసెంబర్ 22: దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడానికే బీజేపీ కొత్తచట్టాలను అమలు చేస్తోందని, దీనికి ప్రజల మద్దతు లేకపోవడంతో దేశంలో అల్లర్లు చెలరేగుతున్నాయని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా బీజేపీ ఇష్టానుసారంగా వ్యవహరించడం దుర్మార్గం అన్నారు.

12/23/2019 - 04:55

హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనేది ఆందోళనలు నిర్వహిస్తేనో, ఆస్తులు దహనం చేస్తేనో ఆగేది కాదని.. అది పార్లమెంట్‌లో చట్టం చేసిందని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సురేందర్ జైన్ అన్నారు. ఆదివారం రాత్రి కాచిగూడలోని జాగృతి భవన్‌లో పౌరసత్వ బిల్లుపై వీహెచ్‌పీ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై సురేందర్ ప్రసంగించారు.

12/23/2019 - 04:45

హైదరాబాద్, డిసెంబర్ 22: పౌరసత్వ సవరణ చట్టంతో ఎవరికి ఎలాంటి నష్టం లేదని, అసలు ఎవరు కూడా దీని వల్ల ఇబ్బంది పడరని, అపోహలను విడనాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు.

12/23/2019 - 04:43

ఖైరతాబాద్, డిసెంబర్ 22: ఇతర దేశాల్లో మైనారిటీలుగా ఉంటూ తీవ్ర వివక్షకు గురై శరణార్థులుగా భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వాన్ని కల్పించేదే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేషనల్ ఆఫీషియల్ స్పోక్స్‌పర్సన్ జీవీఎల్ నర్సింహారావు పేర్నొన్నారు. ఆదివారం సోమాజిగూడ కత్రీయా హోటల్‌లో పౌరసత్వ సవరణ చట్టం-2019పై మేధావుల సమావేశాన్ని నిర్వహించారు.

12/23/2019 - 04:41

హైదరాబాద్, డిసెంబర్ 22: పర్యావరణ పరిరక్షణ వల్లనే వాతావరణ కాలుష్యం బారి నుంచి మానవాళిని కాపాడుతామని, ఈ యజ్ఞంలో ప్రజలందరూ పాల్గొనాలని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ ఆయన ఎస్‌బీఐ అమరావతి, హైదరాబాద్ సర్కిళ్ల అధికారులు పీపుల్స్ ప్లాజాలో ఎస్‌బీఐ గ్రీన్ పరుగును నిర్వహించారు.

12/23/2019 - 04:39

హైదరాబాద్, డిసెంబర్ 22: హైదరాబాద్ రహేజా మైండ్‌స్పేస్‌లో గణనీయంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీ పెగా సిస్టమ్స్ ‘ఉమెన్ ఎట్ పెగా’ చొరవలో భాగంగా కంపెనీకి చెందిన మహిళా ఉద్యోగులకు ‘అవగాహన, అప్రమత్తత-్భద్రత’ పేరుతో సమావేశం నిర్వహించారు.

Pages