S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/23/2019 - 04:36

హైదరాబాద్, డిసెంబర్ 22: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు రాష్ట్రప్రభుత్వం త్వరలో భూమి విలువలను పెంచే అవకాశం ఉంది. ఈ దిశగా ఒక నివేదికను ఉన్నతాధికారులు రూపొందించారు. ఆర్థిక మాంద్యంలో భాగంగా ఖజనాకు రాబడి తగ్గుతున్నట్లు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందులోభాగంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రెవెన్యూ పెంచేందుకు ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది.

12/23/2019 - 02:09

హైదరాబాద్, డిసెంబర్ 22: పౌరసత్వ సవరణ చట్టం ద్వారా దేశాన్ని మతప్రాతిపదికన విభజించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం ప్రయత్నిస్తోందని, ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఇక్కడ ట్యాంక్‌బండ్ వద్ద పీసీసీ ఆధ్వర్యంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.

12/23/2019 - 02:07

హైదరాబాద్, డిసెంబర్ 5: పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్ష పార్టీలు ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నాయని, దేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నాయని కేంద్ర హోం శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశాన్ని మత ప్రాతిపదికన విభజనకు పాల్పడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని అన్నా రు.

12/23/2019 - 02:04

హైదరాబాద్, డిసెంబర్ 22: పల్లె ప్రజల జీవితాల్లో నూతన అధ్యాయం ఆవిష్కరించేందుకు, గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగేందుకు ఉద్దేశించిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని 2020 జనవరిలో పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తెలిపారు. పల్లె ప్రగతిపై ఆదివారం ఆయన ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు.

12/23/2019 - 01:15

హైదరాబాద్, డిసెంబర్ 22: జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఆ రోజున మహిళా టీచర్స్ డేగా గుర్తించాలని తెలంగాణ ప్రజా సాంస్కృతిక విభాగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సంబంధిత విభాగానికి చెందిన భూపతి వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచించారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పూలే జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

12/22/2019 - 05:19

మహబూబ్‌నగర్, డిసెంబర్ 21: కులమతాలకు అతీతంగా తెలంగాణ ఉందని, రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవించే సెక్యులర్ ప్రభుత్వం కొనసాగుతుందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.

12/22/2019 - 00:57

హైదరాబాద్: పేద ముస్లింలే ఓవైసీ పెట్టుబడి అని వీహెచ్‌పీ అంతర్జాతీయ ప్రధా న కార్యదర్శి సుందర్‌జైన్ వ్యాఖ్యానించారు. ము స్లింలకు పెద్దన్నగా చెప్పుకునే ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీనే ముస్లింలకు అతి పెద్ద శత్రువని ఆయన పేర్కొన్నారు. పేద ముస్లింలను, అమాయక ముస్లింలను రెచ్చగొట్టి భారతదేశంపై ద్వేషాన్ని నింపుతున్నారని, దీంతో రాజకీయ పలుకుబడి, ధనం పెంచుకుంటున్నారని ఆరోపించారు.

12/22/2019 - 00:51

హైదరాబాద్: భారతీయ వైద్య విధానంలో ప్రజలకు గొప్ప నమ్మకం ఉందని, ప్రజల నమ్మకానికి అనుగుణంగా ఈ వైద్య విధానాలను తీర్చిదిద్దుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. యోగాధ్యయన పరిషత్ తొమ్మిదో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి అధ్యక్షతన శనివారం జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సంబంధిత రాష్టస్థ్రాయి అధికారులు పాల్గొన్నారు.

12/22/2019 - 00:48

హైదరాబాద్, డిసెంబర్ 21: టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రాజకీయ చతురతకు జాతీయ, ప్రాంతీయ స్థాయి రాజకీయ పార్టీలు నోరెళ్లబెడుతున్నాయి. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు అద్భుతంగా ఉన్నాయని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటూ తన ఇమేజీని కాపాడుకుంటారని రాజకీయ విశే్లషకులు అంచనా వేశారు.

12/20/2019 - 06:20

గోదావరిఖని, డిసెంబర్ 19: తెలంగాణ రాష్ట్రంలో మూసివేత దశలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ), పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల బృందం రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తోంది. రాష్ట్రంలో నాలుగు రోజులపాటు బృందం పర్యటిస్తున్న క్రమంలో...

Pages