S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

02/12/2017 - 21:44

ఆధునికాంధ్ర కవిత్వంలో భావ కవితా యుగంలోనూ అంతకుపూర్వం సంఘ సంస్కరణ కవిత్వం, దేశభక్తి కవిత్వం ఆవిర్భవించిన సమయాల్లో రవీంద్రుని ప్రభావం బలంగా ఉంది.

02/12/2017 - 21:42

‘‘అవధాన ప్రతిభాసముద్రుడవు అన్నా! మాచిరాజాన్వయా!
శివరామాభిధ! రాజగౌరవనిభా! శ్రేష్ఠావధానీ! కవీ!
భవదీయాద్భుత సాహితీవిభవ సంభ్రాంతోరు గాధావళుల్
సవన ప్రజ్వలితాగ్ని కీలలయి ఆశాంతంబు పర్వెన్ జుమీ!’’

02/05/2017 - 22:15

నల్లదుప్పటి ముసుగు తీసి
ఎరుపు చూపుల కన్ను తెరచి
పరుచుకున్న పచ్చనేలపై
వేడి వెలుగులు విస్తరిస్తూ
పచ్చి పువ్వుల విచ్చదీస్తూ
నిదుర మొద్దుకు చురక పెడుతూ
అవని మీద అందాలను
ఒక్కటొక్కటిగా పలకరిస్తూ
జడ జీవులకు చైతన్యమిస్తూ
సాగిపోయే సొగసులయ్య
ఎవరిమెప్పునూ ఆశించడు
తన దిన చర్య తప్పడు
ఆ సూరీడు బాటలో నడుద్దాం

02/05/2017 - 22:15

అదో పెద్ద చెరువు
పట్నానికి తాగునీరందించే నీటి వనరు
చుట్టూ చెట్టూచేమా
సీజనల్‌గా ఎన్నారై పక్షులూనూ
పట్నం సిటీగా మారింది
గుడారంలో తల ఉంచిన ఒంటె, ముందు తన కాళ్ళనూ
నెమ్మదిగా శరీరాన్నీ, తదుపరి గుడారం
మొత్తాన్నీ ఆక్రమించి బేహారుని బయటికి నెట్టింది
చెరువు అంచుల చుట్టూ
కబ్జా ప్రహరీలూ, ఇళ్ళూనూ,
చెరువు ‘తమ’ని కబ్జాచెయ్యకుండా!!

02/05/2017 - 22:12

తెలియని ఆత్మ సంగతి ఎవరికి తెలుసు
తెలిసే శ్వాసకంటే
దగ్గరేముంటుంది శరీరానికి

ఆత్మన్నది ఉంటే
శరీరాల్ని ఆత్మ వెతుక్కుంటుందా
ఆత్మని శరీరమా
ఎవరికీ కనిపించకుండా
ఆత్మ శరీరంలోనే ఎందుకు దాక్కోవాలి
రహస్యంగా వచ్చి
తీరాలు అలలూ లేని
ఏ నిశ్శబ్ద సముద్రంలో
ఈ ఆత్మల నదులన్నీ కలుస్తాయో

02/05/2017 - 22:11

‘‘కుంభమేళా’’, ‘‘అస్తిత్వానికి అటూ ఇటూ....’’అనే రెండు కథా సంపుటాల ద్వారా పాఠకుల, విమర్శకుల ప్రశంసలనందుకున్న మధురాంతకం నరేంద్రను ఇవ్వాళ కొత్తగా మంచి రచయితగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు కొత్త కథాకథనాలతో వస్తుపరంగా, శిల్పపరంగా వైవిధ్యభరితమైన కథలు రాయడం ఆయన ప్రత్యేకత. వీరి కథలు ఎక్కువగా అస్తిత్వవాద ధోరణిలో తాత్త్విక ధోరణిని సంతరించుకుని వుంటాయి.

02/05/2017 - 22:10

ఇది యవన రాజ్యం
వనల రాజ్యం
ఎవ్వరైనా ఇక్కడ యవ్వనులే
ఇక్కడి వినోదాలపై బ్రతుకుతోంది ప్రపంచమో సగం
ఇక్కడి వినోదంకోసం తన్నుకుఛస్తోంది ఇంకో సగం
ఇక్కడ చావుకూ వినోదానికి పెద్ద తేడా లేదు
ఆడుకోటానికి వాల్‌మార్టుల్లో
దొరుకుతాయ్ స్టెన్ గన్నులు
తెలుపు నలుపు కుర్రకారుకు
అవే అంతులేని ఫన్నులు
అసహనం, అహంకృతి కలిసి ఆడుకొంటుంటాయి

02/05/2017 - 22:08

హేవళంబి నామ ఉగాది సందర్భంగా గుంటూరుకు చెందిన సాహితీ సమాఖ్య 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు పద్య, గేయ రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి ఆర్. రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఉగాది సందర్భంగా నిర్వహించే సాహితీ వసంతోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. సమకాలీన అంశాలలో ఒకదానిపై స్వేచ్ఛా ఛందస్సులో ఐదు పద్యాలు వ్రాసి పంపాలి.

02/05/2017 - 22:16

జనం కన్నీళ్లకు సిద్ధాంతముందా?’ అని 23-1-2017 సోమవారం ఆంధ్రభూమి ‘సాహితి’లో సిహెచ్ మధుగారు ప్రశ్నించారు. ఇంతవరకు ఏ సిద్ధాంతమూ జనం కన్నీళ్లను తుడవడానికి పనికి రాలేదన్నారు. సిద్ధాంతాల వెంట పరుగులు తీసి తీసి అక్షరం అలసిపోయి ఓడిపోయిందన్నారు. ఏ సిద్ధాంతమూ ప్రపంచాన్ని మార్చలేదన్నారు. ప్రజల ఆకల్ని తీర్చలేదన్నారు. మార్క్సిజం వాస్తవిక సిద్దాంతమైనా, ఆచరణాత్మక సిద్ధాంతం కాలేకపోయిందన్నారు.

01/30/2017 - 00:45

అరమరికల లోతులు తట్టే
అరుదైన నైపుణ్యం
ఇంటి చూరైనా- చెట్టు రెమ్మల సంగమమైనా
స్థల సేకరణలో చాకచక్యము
పరక పోగులు, కట్టె పుల్లలు
అంపశయ్య మీద అనువైన అమరికలు
రెండు పక్కలు
స్వయం చోదక విమానం రెక్కలు
ముక్కుకు చిక్కిన గడ్డిపరక
ఒక్కొక్కటే చేరవేత
గుత్తేదారు పత్తా- మేస్ర్తి ఆధిపత్యం
పనికిరావని పాడుతుంది స్వయంకృషి

Pages