S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2016 - 04:31

బోధన్, నవంబర్ 20:బోధన్ నిజాంచక్కెర కర్మాగారాన్ని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం నాడిక్కడ విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఈ ఫ్యాక్టరీ స్వాధీనం విషయమై ముఖ్యమంత్రి కెసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

11/21/2016 - 04:31

నాగిరెడ్డిపేట్, నవంబర్ 20: పోచారం ప్రాజెక్టును కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆదివారం సందర్శించారు. పోచారం ప్రాజెక్టులో గతంలో బోట్(పడవ) కోసం ఏర్పాటు చేసిన షెడ్డూను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోచారం ప్రాజెక్టు కామారెడ్డి జిల్లాలోనే ఉందని, దీని అభివృద్ధి కోసం సంబంధిత అధికారులు ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలిపారు.

11/21/2016 - 04:29

ఆదిలాబాద్,నవంబర్ 20: ఖైదీలకు విజ్ఞానాన్ని పెంపొందించడానికి అవసరమైన పుస్తకాలను అందజేసేందుకు కృషి చేస్తామని జిల్లా కేంద్ర గ్రంథాలయ పర్సన్ ఇంచార్జి, సంయుక్త కలెక్టర్ కృష్ణారెడ్డి అన్నారు. 49వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం సంయుక్త కలెక్టర్, జిల్లా కేంద్ర గ్రంథాలయ పర్సన్ ఇంచార్జి జిల్లాలోని జైలును సందర్శించారు.

11/21/2016 - 04:27

ఆదిలాబాద్ రూరల్,నవంబర్ 20:ఆకతాయిల ఆగడాలను నియంత్రించి, యువతను సన్మార్గంలో నడిపించేందుకు షీటీంలను విస్తృతపర్చి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మిట్ట శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసిన 15 యాక్టీవా ద్విచక్రవాహనాలకు ఆదివారం స్థానిక సాయుధ పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో వేద పండితుల సమక్షంలో పూజలు నిర్వహించి ప్రారంభించారు.

11/21/2016 - 04:27

సిర్పూర్(టి), నవంబర్ 20: మొక్కల సంరక్షణ, వాటి పెంపకం పరిరక్షణకు అందరూ సహకరించినపుడే మొక్కలు ఎదిగి తెలంగాణ రాష్ట్రాన్ని హరితమయం చేయాలనే లక్ష్యాన్ని సాదించవచ్చని ఆసిఫాబాద్ కుంరంభీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ అన్నారు. సిర్పూర్ మండలం పెద్దబండలోని నర్సరీ ప్లాంటేషన్‌ను ఆయన ఆదివారం మద్యాహ్నం సందర్శించి నర్సరీలో పెంపకం చేపట్టిన మొక్కలను పరిశీలించారు.

11/21/2016 - 04:26

నిర్మల్,నవంబర్ 20: ప్రపంచమంతా డిజిటల్ మయమైందని, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మరింత అభివృద్ది చెందే అవకాశం ఉందని, డిజిటల్ పాఠాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరమని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

11/21/2016 - 04:24

ఆదిలాబాద్,నవంబర్ 20: చరిత్ర, సంస్కృతి మూలధారమైన గ్రంథాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, తెలంగాణ ప్రభుత్వం పాఠకుల అభిరుచి మేరకు గ్రంథాలయాలను ఆధునీకరించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు.

11/21/2016 - 04:23

ఖైరతాబాద్, నవంబర్ 20: ఉపాధ్యాయ నియామకం కోసం జరిగిన పరీక్షలో అర్హత సాధించిన 1998 బ్యాచ్ డిఎస్‌సి అభ్యర్ధులు ఆదివారం పెద్దమ్మతల్లి దేవాలయంలో ముఖ్యమంత్రి పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1998 డిఎస్‌సి సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11:45 ప్రాంతంలో ర్యాలీగా జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయానికి చేరుకున్న అభ్యర్ధులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేరన అర్చన, అభిషేకాన్ని నిర్వహించారు.

11/21/2016 - 04:23

ధారూర్, నవంబర్ 20: సృష్టిలో జ్ఞానం అనంతమైనదని, ఎంత చదివినా పొందాల్సిన జ్ఞానం మిగిలే ఉంటుందని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పి.సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రపంచాన్ని జయించాలంటే పుస్తకాలు చదవాలని సూచించారు.

11/21/2016 - 04:22

ఉప్పల్, నవంబర్ 20: ఉప్పల్, నవంబర్ 20: భారతీయ జనతా పార్టీ ఉప్పల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జాతికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపి గులాం నబీ ఆజాద్ దిష్టిబొమ్మను ఆదివారం ఉప్పల్ ప్రధాన రహదారిలోని విటి కమాన్ చౌరస్తాలో దగ్ధం చేశారు.

Pages