S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2016 - 04:13

వనస్థలిపురం, నవంబర్ 20: ఏబిసిడి వర్గీకరణకు తన సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు ప్రజా గాయకుడు గద్దర్ ప్రకటించారు. ఆదివారం డప్పుకు చెప్పుకు రూ.2000 పింఛన్ ఇవ్వాలని, వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఎల్బీనగర్‌లోని ఎస్కేడీ ఫంక్షన్ హాల్‌లో ఎంఆర్‌పిఎస్ తెలంగాణ రాష్ట్ర సర్వ సభ్య సమావేశం నిర్విహించారు.

11/21/2016 - 04:13

ధారూర్, నవంబర్ 20: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా, నలుగురు గాయాలపాలైన సంఘటన మర్పల్లి మండలం బల్‌కల్ గ్రామం వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మర్పల్లి మండలం పట్లూర్ గ్రామానికి చెందిన నెల్లి సుధాకర్(28), మరో ఇద్దరు మెదక్ జిల్లా తంగడపల్లి వెళ్ళేందుకు ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై బయలుదేరారు.

11/21/2016 - 04:12

మేడ్చల్, నవంబర్ 20: మేడ్చల్ పారిశ్రామికవాడలోని రాక్‌వెల్ అనే ఫ్రిజ్‌లు తయారు చేసే పరిశ్రమలో ఆదివారం గుర్తుతెలియని కారణంతో అగ్నిప్రమాదం సంభవించింది. కాగా నిర్వాహకులు కంపెనీ ప్రతినిధులు స్థానిక పోలీసులకు గాని అగ్నిమాపకశాఖ వారికి సమాచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒక్కసారిగా మంటలు చేలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి.

11/21/2016 - 04:01

పనాజీ, నవంబర్ 20: ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యానికి 2016 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక శతాబ్దపు అవార్డు లభించింది. 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ప్రారంభం సందర్భంగా ఆదివారం ఈ సమున్నత పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. తనకు లభించిన ఈ అవార్డును తన తల్లికి, దేశ ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన సైనికులకు అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా ఎస్పీ ప్రకటించారు.

11/21/2016 - 03:58

మదనపల్లె, నవంబర్ 20: గ్రామాధికారుల పాలన రద్దు చేయడంతో బ్రాహ్మణులు వెనుకబాటుతనంలో నిలిచిపోయారని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. బ్రాహ్మణోత్తముల సహకారంతో ఏర్పాటైన రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ద్వారా కల్పిస్తున్న బ్రాహ్మణ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు ఆదివారం చిత్తూరుజిల్లా మదనపల్లె పట్టణంలో నిర్వహించారు.

11/21/2016 - 03:58

విజయనగరం, నవంబర్ 20: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సిపిఎస్) రద్దుకు ఉద్యమం తప్పదని ఎపి ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు హెచ్చరించారు. ఇక్కడ ఆదివారం జరిగిన ఎపిఎన్జీవో సంఘం కౌన్సిల్ సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, మాట్లాడారు.

11/21/2016 - 03:57

విశాఖపట్నం, నవంబర్ 20: అంతరిక్షంలో ప్రైవేట్ సంస్థలను అనుమతించడం, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో అంతరిక్ష కార్యకలాపాలు చేపట్టే సందర్భంలో వాటిని చట్టపరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ న్యాయ కోవిదుడు, ఎపి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.్భవానీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

11/21/2016 - 03:57

హైదరాబాద్, నవంబర్ 20: కేంద్రం రద్దుచేసిన పెద్ద నోట్ల వల్ల ఆంధ్రలో రైతులు దెబ్బతిన్నారని, చిల్లర వ్యాపారం ధ్వంసమైందని, దీనికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనలు అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఉన్నాయని పిఏసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.

11/21/2016 - 03:55

విజయవాడ, నవంబర్ 20 : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న సంక్షోభం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడమే బ్యాంకర్లు, అధికారుల ముందున్న తక్షణ కర్తవ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నోట్ల మార్పిడిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆదివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

11/21/2016 - 03:52

హైదరాబాద్, నవంబర్ 20: కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్ల ప్రభావం మెడికల్ టూరిజంపై పడింది. హైదరాబాద్‌కు పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల నుంచి పెద్ద ఎత్తున రోగులు ఇక్కడ ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు వస్తుంటారు. భాషాపరమైన సమస్య లేకపోవడం, తక్కువ ఖర్చులో వైద్యం, వసతి సదుపాయాలు, వైద్య నిపుణులు ఉండడం తదితరకారణాల వల్ల ఇక్కడకు విదేశాల నుంచి ఎక్కువ మంది రోగులు వస్తుంటారు.

Pages