S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2016 - 04:19

హైదరాబాద్, నవంబర్ 20: నగరంలో రోజురోజుకి రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతూ, చలి ప్రభావం పెరుగుతోంది. వాతావరణం చల్లబడుతున్న కొద్దీ స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రబలుతుందేమోనన్న భయం నెలకొంది.

11/21/2016 - 04:19

హైదరాబాద్, నవంబర్ 20: ఉద్యోగం ఏదైనా, ఏ స్థాయిదైనా..చేసే పని ఏదైనా..మామూలు కార్మికుడైనా, పెద్ద అధికారి అయినా.. అందరూ ఎదురుచూసేది నెల జీతం కోసమే. గతంలో జీతం వచ్చిందంటే చాలు ఆ రోజు పండగే. కానీ ప్రస్తుతం కేంద్రం పెద్ద నోట్లపై విధించిన రద్దు కారణంగా జమ, విత్‌డ్రాలకు ఎదుర్కొంటున్న కష్టాలు..చిల్లర తిప్పలు ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరు తర్వాత వచ్చే జీతాలకు జనాలు భయపడాల్సిన పరిస్థితి తలెత్తనుంది.

11/21/2016 - 04:18

గచ్చిబౌలి, నవంబర్ 20: హైటెక్ సిటీ పరిసరాలలో నిబంధనలకు విరుద్ధంగా రాత్రి సమయంలో నడుపుతున్న టిప్పర్లు, లారీలపై దృష్టి సారించారు. పెద్దపెద్ద బండరాళ్ల తరలించే సమయంలో లారీలకు సంబంధించిన వెనుక డొరు వేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు చాలా జరగడంతో అనేక ఫిర్యాదులు రావడంతో పాటు ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు. శనివారం రాత్రి మాదాపూర్ ట్రాఫిక్ సబ్ డివిజన్ పోలీసులు ప్రత్యేక దాడులు చేశారు.

11/21/2016 - 04:17

హైదరాబాద్, నవంబర్ 20: జనవాసాల మధ్య నెలకొల్పిన భోలక్‌పూర్ తోళ్ల పరిశ్రమల వల్ల తాగునీరు కలుషితమై గతంలో పధ్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగిన పదేళ్లు గడుస్తున్నా, ఇంకా ఆ పరిశ్రమలను అక్కడి నుంచి తరలించలేదు. ప్రజలకు మెరుగైన వౌలిక వసతుల కల్పన, ప్రజారోగ్య పరిరక్షణకు పాలకులు చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని చెప్పవచ్చు.

11/21/2016 - 04:17

హైదరాబాద్, నవంబర్ 20: మూడు తరాలకు విద్యను అందించిన విద్యావేత్త చుక్కా రామయ్య తెలంగాణ ఉద్యమంలో ముందుండి అందరిని నడిపించారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అన్యాయాన్ని, అధర్మాన్ని సహించని వ్యక్తిగా చుక్కా రామయ్యను ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా పాదాలకు నమస్కరించే వారని ఆయన అన్నారు.

11/21/2016 - 04:16

కాచిగూడ, నవంబర్ 20: దీపం వెలిగించడం వల్ల అజ్ఞానం తొలిగి జీవితంలో వెలుగును నింపుతుందని దత్తపీఠం పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి అన్నారు. భక్తిటివి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దిపోత్సవ కార్యక్రమానికి ఆదివారం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తూ అన్ని యుగాల నుంచి దీపోత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

11/21/2016 - 04:15

హైదరాబాద్, నవంబర్ 20: ప్రపంచానికి అందిన ఒక బహుమతి నాన్న అని, నాన్న ఎప్పుడూ ఓ మధుర జ్ఞాపకమేనని డా.బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ సీతారామారావు అన్నారు. ఆదివారం ఆయన సికింద్రాబాద్‌లోని పిజి కళాశాల అంబేద్కర్ అధ్యయన కేంద్రం ఎం.ఏ తెలుగు విద్యార్థులు రచించి రూపొందించిన ‘నాన్న కోసం’ కవితల సంపుటిని ఆవిష్కరించారు.

11/21/2016 - 04:15

జీడిమెట్ల, నవంబర్ 20: రహదారుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం గండిమైసమ్మ నుండి బాచుపల్లి వరకు సుమారు రూ.15కోట్ల నిధులతో రోడ్డు పనులను జిల్లా మంత్రి పి.మహెందర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు సిహెచ్ మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్, ఎమ్మెల్సీ రాజుతో కలిసి తుమ్మల ప్రారంభించారు.

11/21/2016 - 04:14

హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్ర మాల సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శిగా దార్ల అవినాష్‌కాంత్ నియమితులయ్యారు. ఆదివారం సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ ఆయనకు నియామక ఉత్తర్వులను అందజేశారు. బత్తుల రాంప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగ ఆర్పాటు చేసిన 31 జిల్లాల్లో సంఘం నూతన కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు.

11/21/2016 - 04:14

ముషీరాబాద్, నవంబర్ 20: కరెన్సీ రద్దుతో ప్రజల ప్రాణాలు కోల్పోవటానికి కారణమైన ప్రధాని నరేంద్ర మోదీ, దేశ ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లి, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, రిజర్వు బ్యాంక్ గవర్నర్, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిలను ప్రాసిక్యూట్ చేయాలని దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో లీగల్ నోటీసులు జారీ చేస్తున్నామని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు చేపూరి రాజు, వ

Pages