S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2016 - 04:39

కరీంనగర్, నవంబర్ 20: పోలీస్‌శాఖలోని వివిధ విభాగాల్లో స్ట్ఫైండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (సివిల్/ఏఆర్/టిఎస్‌ఎస్పీ/ఎస్పీఎఫ్/ ఎస్‌ఏఆర్‌సిపిఎల్/ఎస్‌ఎఫ్‌ఓ) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా రెండు రోజుల పాటు నిర్వహించిన ఎస్‌ఐ రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. ఆదివారం పరీక్షకు మొత్తం 12,305 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 11,879 మంది హాజరై పరీక్ష రాసారు.

11/21/2016 - 04:39

జగిత్యాల, నవంబర్ 20 మల్యాల మండలం నూకపల్లి ఇందిరమ్మ అర్బన్ కాలనీలో ఆక్రమంగా నిర్మించుకున్న ఇళ్లపై రెవెన్యూ అధికారులు ఆదివారం కొరఢా గులిపించారు. ఈ కూల్చివేతల్లో దాదాపు 548 ఇళ్లను రెవెన్యూ అధికారు లు బారీ బందోబస్తు మద్య కూల్చివేసారు.

11/21/2016 - 04:37

కరీంనగర్, నవంబర్ 20: వీకెండ్ వీక్ అయిపోయింది. నాన్‌వేజ్ ప్రియులకు ముక్క తినడం గగనమైంది. ఆదివారం వచ్చిందంటే చాలు వీకెండ్ పార్టీలతో ఏంజాయ్ చేసే జనాలకు ఈ సండే జోష్ నింపలేదు. వీకెండ్‌లో కళకళలాడే మటన్, చికెన్, పిష్ తదితర మార్కె ట్లు జనాలు లేక బోసిపోయాయి. పెద్ద నోట్ల రద్దుతో వీకెండ్ పార్టీ (దవాత్)లు డీలా పడ్డాయి.

11/21/2016 - 04:36

ముకరంపుర (కరీంనగర్), నవంబర్ 20: తెలంగాణ బిల్డింగ్ వర్క ర్స్ యూనియన్ మహాసభ ఈ నెల 25న బద్ధం ఎల్లారెడ్డి భవన్‌లో జరుగుతుందని, దీనిని జయప్రదం చేయాలని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య పిలుపునిచ్చారు. ఆదివారం ఎఐటియుసి కార్యాలయంలో మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించారు.

11/21/2016 - 04:36

ఎలిగేడు, నవంబర్ 20: వైట్‌స్కాలర్ నేరాల పట్ల ప్రజలు అప్రమ్తంగా ఉండాలని జూలపల్లి ఎస్‌ఐ దేవేందర్ అన్నా రు. ఆదివారం మండలంలోని నర్సాపూర్‌లో జనమైత్రి పోలీస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ గుడుంబా అమ్మినా, బెల్టు షాపులు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కన్పించినా స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

11/21/2016 - 04:35

గోదావరిఖని, నవంబర్ 20: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేయబోతున్న కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్‌కు సంబంధించి పంప్ హౌస్ నిర్వాసితులందరికి సంపూర్ణ న్యాయం చేస్తానని పెద్దపల్లి ఆర్డీ ఓ అశోక్ కుమార్ తెలిపారు.

11/21/2016 - 04:34

నిజామాబాద్, నవంబర్ 20: ఆదుకునే వారు లేక దుర్భర స్థితిలో జీవనాలు గడుపుతున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులతో పాటు రెక్కలు ముక్కలు చేసుకుని రేయింబవళ్లు శ్రమించే బీడీ కార్మికులు అనేక మంది అన్ని అర్హతలు కలిగి ఉండి కూడా పెన్షన్లకు నోచుకోవడం లేదు. అధికారులకు అర్జీలు అందజేసి నెలలు గడుస్తున్నా, తమకు మంజూరీలు లభించడం లేదని వాపోతున్నారు.

11/21/2016 - 04:33

కంఠేశ్వర్, నవంబర్ 20: నిజామాబాద్ రీజియన్ పరిధిలో ఆయా జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ప్రతిరోజు ఆర్టీసీ సంస్థ 600పైచిలుకు బస్సు సర్వీసులు నడిపిస్తూ లక్షా 70వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం కొనసాగిస్తున్నారు. అనునిత్యం ఈ జిల్లా నుండి ఇతర రాష్ట్రాలకు, సుదూర ప్రాంతాలకు సుమారు 56వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.

11/21/2016 - 04:32

ఎల్లారెడ్డి, నవంబర్ 20: ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఎస్టీ వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్న పదవ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కామారెడ్డి జిల్లా డిటిడిఓ ( జిల్లా గిరిజన వసతిగృహాల సంక్షేమాధికారి ) జి.గంగాధర్ అన్నారు. శనివారం రాత్రి ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని ఎస్టీబాలుర వసతిగృహానికి రాత్రి బసకోసం వచ్చారు.

11/21/2016 - 04:32

బాన్సువాడ, నవంబర్ 20: యురీలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలను కించపర్చే రీతిలో వ్యాఖ్యానాలు చేశారంటూ బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ దిష్టిబొమ్మకు నిప్పంటించి దగ్ధం చేశారు. గులాంనబీ ఆజాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Pages