S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2016 - 03:51

మాల్దా, నవంబర్ 20: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పటి వరకు అనేక మంది ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్ని సార్లు తిరిగినా బ్యాంకు నుంచి నగదు రాకపోవటం, కుటుంబాన్ని పోషించలేక గోవింద్ సర్కార్ అనే ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెప్తున్నారు.

11/21/2016 - 03:46

హైదరాబాద్, నవంబర్ 20: కొత్తగూడెం ఏడవ థర్మల్ విద్యుత్ యూనిట్ నిర్మాణానికి అవసరమైన పరికరాలను సమకూర్చేందుకు తెలంగాణ జెన్కో విద్యుత్ నిపుణుల బృందం హరిద్వార్ బిహెచ్‌ఇఎల్ యూనిట్‌ను సందర్శించింది. ఈ బృందంలో ప్రాజెక్టుల డైరెక్టర్ సి రాధా కృష్ణ, థర్మల్ విభాగం డైరెక్టర్ ఎం సచిదానందం, హైడల్ విభాగం డైరెక్టర్ సిహెచ్ వెంకటరాజాం, చీఫ్ ఇంజనీర్ బి లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.

11/21/2016 - 03:45

హైదరాబాద్, నవంబర్ 20: తెంలగాణ పోలీసు శాఖ సబ్ ఇన్‌స్పెక్టర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు (ఎస్పీఎఫ్)లో ఎస్సై(మెన్స్), ఆగ్నిమాపక శాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్(ఎస్‌ఎఫ్‌ఓ) పోస్టులతో పాటు ఎస్సై(కమ్యూనికేషన్/ పిటిఓ) పోస్టులకు తుది పరీక్షలు రెండో రోజు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి.

11/21/2016 - 03:43

హైదరాబాద్, నవంబర్ 20: పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర కేంద్ర సహకార బ్యాంకు (టిఎస్‌సిఎబి-టెస్‌కాబ్)లో లావాదేవీలు నిలిచిపోయాయి. వాణిజ్య బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) కల్పించిన వెసులుబాటును సహకార బ్యాంకులకు కల్పించలేదు.

11/21/2016 - 03:41

న్యూఢిల్లీ, నవంబర్ 20: భద్రాచలంలో ప్రతిపాదించిన వెయ్యి మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సబ్ క్రిటికల్ యంత్రాలతో ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు విజప్తి చేశారు.

11/21/2016 - 03:40

హైదరాబాద్, నవంబర్ 20: పాత నోట్లతో ఆస్తి పన్ను వసూలు చేయడంలో దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. పాత నోట్లతో ఆస్తి పన్ను వసూలుతో హైదరాబాద్ దేశంలోని ఇతర నగరాల కన్నా ముందు వరుసలో నిలిచినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సమీక్షలో తేలింది. నవంబర్ నెలలో 188 కోట్ల రూపాయలను వసూలు చేయడం ద్వారా మూడింతల ఆదాయం పొందిందని కేంద్రం ప్రశంసించింది.

11/21/2016 - 03:39

హైదరాబాద్, నవంబర్ 20: దక్షిణ మధ్య రైల్వేకు ‘రైల్ వికాస్ శిబిర్’ అవార్డు దక్కింది. ఈ అవార్డును ఆదివారం న్యూఢిల్లీలోని సూరజ్‌కుండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా అందుకున్నారు.

11/21/2016 - 03:39

పనాజీ, నవంబర్ 20:ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యానికి 2016 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక శతాబ్దపు అవార్డు లభించింది. 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ప్రారంభం సందర్భంగా ఆదివారం ఈ సమున్నత పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు.
తనకు లభించిన ఈ అవార్డును తన తల్లికి, దేశ ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన సైనికులకు అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా ఎస్పీ ప్రకటించారు.

11/21/2016 - 03:36

హైదరాబాద్, నవంబర్ 20: కేంద్రంలో చక్రం తిప్పిన నాయకుడిగా చంద్రబాబుకు పేరు ఉంది. కెసిఆర్ తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నేత. కానీ నోట్ల రద్దు వ్యహారం తరువాత తలెత్తిన సంక్షోభంపై ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ సిఎం కెసిఆర్‌ను పిలిపించుకుని మాట్లాడడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

11/21/2016 - 03:36

ముంబయి, నవంబర్ 20: బాబ్రీ మసీదుకు ముప్పు పొంచి ఉన్న విషయాన్ని అనేక సాక్ష్యాలు వెల్లడించినప్పటికీ ఆ మసీదును కేంద్రం నియంత్రణలోకి తీసుకు రాకపోవడం అప్పటి పివి నరసింహారావు ప్రభుత్వం చేసిన ‘వినాశకరమైన రాజకీయ తప్పిదం’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం అన్నారు.

Pages