S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆకతాయిల ఆగడాలకు షీ టీలంతో చెక్

ఆదిలాబాద్ రూరల్,నవంబర్ 20:ఆకతాయిల ఆగడాలను నియంత్రించి, యువతను సన్మార్గంలో నడిపించేందుకు షీటీంలను విస్తృతపర్చి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మిట్ట శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసిన 15 యాక్టీవా ద్విచక్రవాహనాలకు ఆదివారం స్థానిక సాయుధ పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో వేద పండితుల సమక్షంలో పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన జిల్లాలు అవిర్భవించిన అనంతరం ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా మారిందన్నారు. ముఖ్యంగా మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో షీటీంలను బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా మూడు టీంలను ఏర్పాటు చేయుటకు కసరత్తు చేస్తున్నామని అన్నారు. ఈ నూతన యాక్డీవా వాహనాలను షీటీం బృందాలకు అందిస్తే పట్టణంలో నిరంతరంగా నిఘా ఉండేందుకు దోహపడుతుందన్నారు. పట్టణంలోని అన్ని ప్రధా కూడళ్ళలో 85 సిసిటీవీలు అమర్చడం జరిగిందని, వీటిపై పోలీసు కంట్రోల్ రూంలో నిరంతరంగా పరిశీలన ఉంటుందన్నారు. వాహనాలు, ఆటోలు, ద్విచక్రవాహనాలు నిర్దేశించిన పార్కింగ్ స్థలంలో పెట్టకుండా నిర్లక్ష్యం వహించిన వారిపై సిసి టీవీల ద్వారా ఫోటో క్యాప్చర్ చేసి వాహన నెంబర్‌ను తెలుసుకొని జరిమాన విధిస్తామన్నారు. బస్‌స్టాండ్, రైల్వేస్టేషన్, కాళశాలలు, పార్కులు, సినిమా హాల్స్ తదితర ప్రదేశాల్లో షీటీం బృందాలు మాటువేసి ఉంటారని తెలిపారు. అల్లరి చేసిన పోకిరిలపై మూండంచల నిఘా ఉంటుందన్నారు. జిల్లా ప్రజలకు మరింత భద్రత కల్పించే దానిలో భాగంగా పోలీసులు నిరంతర కృషితో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. త్వరలో షీటీం బృందాలకు నూతన వాహనాలు అందించి, మహిళల రక్షణ చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తామని అన్నారు. పోలీసు వాట్స్‌ఆఫ్ నెంబర్ 8333986898ను ప్రతి ఒక్కరి దగ్గర నమోదు చేసి ఉంటే అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళలు అభద్రతభావంగా ఉనామని భావిస్తే ఫోన్‌చేసి షీటీంల రక్షణ తీసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్సీ టి.పనసారెడ్డి, డిఎస్పీ ఏ.లక్ష్మీనారాయణ, ఆర్ డిఎస్పీ యండి బుర్హాన్ అలి, ఆర్‌ఐ జెమ్స్, తదితరులు పాల్గొన్నారు.