S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అవగాహనా రాహిత్యంతోనే పెద్ద నోట్లు రద్దు

అమలాపురం, నవంబర్ 18: ప్రధాని నరేంద్రమోదీ అవగాహనా రాహిత్యంతో, ఆయన పార్టీకి కొమ్ముకాసే వారికోసమే పెద్ట నోట్లు రద్దుచేశారని పిసిసి ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు ఆరోపించారు. శుక్రవారం అమలాపురంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. నల్లధనం పేరుతో పెద్ద నోట్ల రద్దును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో 89 శాతం పెద్ద నోట్లు చలామణిలో ఉన్నాయని, కేవలం 11 శాతం మాత్రమే ఇతర నగదు చలామణిలో ఉందన్నారు. దేశంలో 3.2శాతం మందికి మాత్రమే క్రెడిట్ కార్డులున్నాయని, వారు మాత్రమే నగదు రహిత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించగలరని, 83శాతం మంది నగదుతోనే కార్యకాలాపాలు నిర్వహిస్తున్నారన్నారు. ముందుస్తు ఏర్పాట్లు చేయకుండా రాత్రికిరాత్రే పెద్ద నోట్లు రద్దు చేయడంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రధాని మోదీ నిర్ణయాన్ని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్, ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్, బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం తప్పుపట్టారన్నారు. ఎన్నికల సమయంలో విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని తీసుకువచ్చి దేశంలో ప్రతీ పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామని ప్రకటించిన మోదీ 29 నెలలు గడుస్తున్నా ఎందుకు ఆపని చేయలేదని గిడుగు ప్రశ్నించారు. పెట్టుబడిదారుల కనుసన్నల్లోనే నోట్ల రద్దు జరిగిందని వస్తున్న ఆరోపణలపై ప్రధాని వివరణ ఇవ్వాలన్నారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు రోజు పశ్చిమబెంగాల్‌లో బిజెపి తరఫున కోటి రూపాయలను బ్యాంకులో జమ చేసారని, ఆ సొమ్ము ఎక్కడ నుండి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. దేశంలో కేవలం 22వేల ఎటియంలు మాత్రమే సక్రమంగా పనిచేస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారని, ప్రస్తుత పరిస్థితుల్లో అవి ఏమూలకు సరిపోతాయని గిడుగు ప్రశ్నించారు. తక్షణమే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఎటియంలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజల కష్టాలను తీర్చాలన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు, నక్సలైట్ల నివారణ కోసమే పెద్ద నోట్లు రద్దు చేసామన్న మోదీ ప్రకటనలో వాస్తవం లేదన్నారు. పాకిస్థానీ కరెన్సీని అదుపు చేయడానికి చర్యలు తీసుకోకుండా 130 కోట్ల మంది ప్రజలను ఇబ్బందుల పాల్జేయడం సమంజసం కాదన్నారు. నల్లధనం నివారణకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఉద్యమం చేస్తామని గిడుగు హెచ్చరించారు. ఓటుకు నోటు కేసు నుండి తప్పించుకునేందుకు చంద్రబాబు బిజెపికి వత్తాసు పలుకుతూ మాట్లాతున్నారన్నారన్నారు. సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యాక్షురాలు అయితాబత్తుల సుభాషిణి, కార్యదర్శులు వంటెద్దు బాబి, ఎడివి లక్ష్మీశ్రావణి, విప్పర్తి మాధవస్వామి, కంచిపల్లి అబ్బులు, తిక్కా ప్రసాద్, పండు సత్యనారాయణ, కుడుపూడి శ్రీను, పఠాన్ ఇబ్రహీంఖాన్, నల్లా శ్రీనివాస్, పి బాలకృష్ణ పాల్గొన్నారు.
పోస్టరు ఆవిష్కరణ
మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు శుక్రవారం పిసిసి ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు స్వగృహంలో శత జయంతి ఉత్సవాల పోస్టరును ఆవిష్కరించారు. శనివారం ఉదయం స్థానిక గడియార స్థంభం సెంటర్‌లో ఉత్సవాలను ప్రారంభిస్తామని గిడుగు తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి రాజప్ప
రాజమహేంద్రవరం, నవంబర్ 18: రాజమహేంద్రవరం, రూరల్, రాజానగరం మండలాల్లో శనివారం ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు పర్యటించనున్న ప్రాంతాలను ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృతస్థాయి ఏర్పాట్లు చేసినట్లు ఈసందర్భంగా చెప్పారు. సిఎం పర్యటించనున్న ఆర్ట్స్ కళాశాల, సెంట్రల్‌జైలు, శాటిలైట్‌సిటీ, నగరవనం, ఆదికవి నన్నయ్య యూనివర్శిటీలో ఏర్పాట్లను నిమ్మకాయల పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు డాక్టర్ ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పెందుర్తి వెంకటేష్, జాయింట్‌కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్, జైళ్లశాఖ డిఐజి ఎన్ చంద్రశేఖర్, జైలు సూపరింటెండెంట్ ఎం వరప్రసాద్ తదితరులు ఉన్నారు. కాగా, ఇటీవల ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్న ముఖ్యమంత్రి పర్యటనకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఐజి హరీష్‌గుప్తా, డిఐజి రామకృష్ణ, ఇతర పోలీసు అధికారులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.