S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నల్లకుబేరుల మొండిబకాయిల రద్దును నిరసిస్తూ

ఖమ్మం(ఖిల్లా), నవంబర్ 18: నల్లకుబేరుల మొండిబకాయిలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో ప్రదర్శన నిర్వహించి స్థానిక బైపాస్‌రోడ్డులో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆపార్టీ రాష్ట్ర సహయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ దేశంలో బడా పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు అక్రమంగా కూడబెట్టిన నల్లడబ్బుపై వేటు వేస్తుందని చెప్పిన నరేంద్రమోడీ వారి మొండి బకాయిలను రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించకుండా బడా కుబేరుల అప్పులను ప్రత్యేకశ్రద్ధతో రద్దు చేయడం పట్ల అంతర్యం ఏమిటన్నారు. 500,1000రూపాయల నోట్లను చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలు, రైతులు, కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటికి ప్రత్యామ్నయం ఏర్పాటు చేయకుండా మొండి బకాయిలను రద్దు చేయడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ నిర్ణయం బడా వ్యాపారులకు మేలుచేసే విధంగా ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నల్లధనం వెలికితీసేందుకు తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని వెలికితీయాలన్నారు. విదేశాలలో దాచిన 80లక్షల కోట్లకు సంబంధించి 648మంది నల్లకుభేరుల జాబితా కేంద్రం దగ్గర ఉందని చెప్పిన మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. పెద్దనోట్ల రద్దు దేశంలో జరిగిన పెద్ద ఆర్థిక కుంభకోణం అని, అది బిజెపి, ప్రతిపక్షాలకు ముందే తెలుసని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలు సామాన్య ప్రజలకు మేలుచేసే విధంగా ఉండాలే కానీ బడా బాబులకు దోచిపెట్టేవిగా ఉండకూడదన్నారు. పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందులకు గురవుతున్న సామాన్యలకు ప్రత్యామ్నయ మార్గాలు చూపాలని డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దుకు ప్రత్యామ్నయంగా కొత్తనోట్లను విడుదల చేయకపోవడంతో సమస్యలు ఝటిలమవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, జి రామయ్య, అశోక్, సివై పుల్లయ్య, సిహెచ్ శిరోమణి, కె శ్రీనివాస్, ఝాన్సీ, మంగతాయి, రామారావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.