S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాలుగు జిల్లాల్లో లోటు వర్షపాతమే

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు సాధారణ సగటు వర్షపాతం 475.2 మి.మీకు 532.2 మి.మీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాలకు నాలుగు జిల్లాలో వర్షం లోటు కొనసాగుతోంది. మిగిలిన తొమ్మిది జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. నెల్లూరు, శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వర్షం లోటు నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాలో 670 మి.మీకు 871.8 మి.మీ, గుంటూరు జిల్లాలో 512.9 మి.మీకు 747.8 మి.మీ, కృష్ణా జిల్లాలో 666.3 మి.మీకు 774.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లాలో 352.5 మి.మీకు 390.4 మి.మీ, విశాఖపట్నంలో 642.5 మి.మీకు 753.2 మి.మీ, విజయనగరం జిల్లాలో 694.6 మి.మీకు 828.9 మి.మీ, పశ్చిమగోదావరి జిల్లాలో 751.8 మి.మీకు 954.2 మి.మీ వర్షపాతం నమోదైంది. రాయలసీమలో కడప జిల్లాలో సాధారణ వర్షపాతం 380.2 మి.మీకు 433.4 మి.మీ, కర్నూనలు జిల్లాలో 434.1 మి.మీకు 490.3 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షం లోటు నెల్లూరు, శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు జిల్లాలో నమోదైంది. నెల్లూరు జిల్లాలో 324.5 మి.మీకు 236.9 మి.మీ, శ్రీకాకుళం జిల్లాలో 714.7 మి.మీకు 684.7 మి.మీ చిత్తూరు జిల్లాలో 389 మి.మీకు 347.5 మి.మీ, అనంతపురం జిల్లాలో 297 మి.మీకు 250.9 మి.మీ వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలో -16, చిత్తూరులో -11, నెల్లూరులో -27, శ్రీకాకుళంలో -4 వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా అదనంగా 46 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 30 శాతం, విజయనగరం జిల్లాలో 19 శాతం, పశ్చిమగోదావరి జిల్లాలో 27 శాతం, విశాఖపట్నం జిల్లాలో 17 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది.