S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మావోయిస్టు నేత విమల్ నేడు విడుదల?

విశాఖపట్నం (క్రైం), సెప్టెంబర్ 25: ఎంతోకాలంగా స్థానిక కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు వారణాసి సుబ్రహ్మణ్యం అలియాస్ విమల్‌పై పోలీసులు పెట్టిన కేసులు కోర్టులో వీగిపోవడంతో ఆయనను ఇక్కడి కోర్టు విడుదల చేయనున్నట్టు ఆదివారం రాత్రి విశ్వసనీయంగా తెలిసింది. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన సుబ్రహ్మణ్యం లా చదవడానికి విశాఖకు చేరుకుని ఎంఎల్ చదువుతూ ప్రగతిశీల ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యాడు. ఆ తర్వాత అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరారు. మొదట సింగరేణి కార్మిక సంఘం నాయకుడిగా, తర్వాత రాడికల్ యువజన సంఘం అధ్యక్షుడిగా పనిచేసి, తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనంతరం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుని స్థాయికి ఎదిగారు. ఢిల్లీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. ఈయన తలకు రూ. పది లక్షల రివార్డును అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ తరుణంలో ఢిల్లీలో పోలీసులు పట్టుకున్నారు. అప్పటి నుండి రిమాండ్ ఖైదీగా ఉన్న విమల్‌ను ఏడాదిన్నరి కిందట విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. విమల్ కుటుంబం న్యాయవాదుల కుటుంబం. తండ్రి, సోదరుడు న్యాయవాదులు. ఇతనిపై ఇక్కడి పోలీసులు పెట్టిన కేసులు కోర్టులో వీగిపోవడంతో జిల్లా కోర్టు ఇతనిని విడుదల చేయనున్నట్టు అతని న్యాయవాది తెలిపారు. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో విమల్‌ను పోలీసులు స్థానిక జిల్లా కోర్టుకు తీసుకునివెళ్ళనున్నారు. విమల్‌ను చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజా సంఘాల నేతలు, అతని స్నేహితులు కోర్టుకు హాజరు కానున్నారు. అయితే, ఇక్కడి కోర్టు అతనిని విడుదల చేసినట్టయితే, కరీంనగర్‌లో పెండింగ్‌లో ఉన్న ఓ కుట్ర కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు వెంటనే అతనిని పట్టుకుపోయే అవకాశముంది.