S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/25/2016 - 23:37

రియో ఒలింపిక్స్ అధికారులపై స్విమ్మర్లు మండిపడ్డారు. తెల్లవారు జామునే వచ్చి డోపింగ్ పరీక్షలంటూ గది తలుపులు బాదుతూ హడావుడి చేయడమే వారి కోపానికి కారణం. డోప్ పరీక్షల కోసం అథ్లెట్ల మూత్ర నమూనాలను అధికారులు సేకరించాలి. అయితే, పోటీల్లో పాల్గొని లేదా విరామం లేకుండా ప్రాక్టీస్ చేయడంతో అలసిపోయి గాఢ నిద్ర పోతున్న తమను తెల్లవారు జామునే లేపేస్తున్నారవి స్విమ్మర్లు వాపోయారు.

09/25/2016 - 23:35

భారత క్రీడా మంత్రి విజయ్ గోయల్‌కు అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాటించాల్సిన నిబంధనలు కూడా తెలియవా? ఉద్దేశపూర్వకంగానే వాటిని చెల్లుచీటీ ఇచ్చాడా? కనీస అవగాహన కూడా లేకుండానే ఆయన రియో ఒలింపిక్స్‌కు వెళ్లాడా? అందుకే, అక్కడ పొరపాట్లు చేసి, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) అధికారుల ఆగ్రహానికి గురయ్యాడా? ఇవన్నీ నిజాలే. రియోలో గోయల్ హల్‌చల్ చేసిన విధానమే ఇందుకు ఉదాహరణ.

09/25/2016 - 23:34

భారత సైక్లిస్టు డెబోరా హెరాల్డ్ మృత్యుంజయురాలిగా చాలా మందికి తెలుసు. 2004లో ముంచెత్తిన సునామీలో చిక్కుకొని, సుమారు వారం రోజులు ఒక చెట్టును ఆధారంగా చేసుకొని ఆమె బతికిబట్టకట్టింది. కుటుంబ సభ్యులను, సన్నిహితులను పోగొట్టుకొని ఒంటరిగా మిలిగిన ఆమె సైక్లింగ్‌పై దృష్టి కేంద్రీకరించింది. ఒకప్పటి సునామీ బాధితురాలు ఇప్పుడు సైక్లింగ్ చాంపియన్‌గా ఎదిగింది.

09/25/2016 - 23:33

రియో డి జెనీరో: భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) అధికారుల నిర్లక్ష్యమే రియో పారాలింపిక్స్ పురుషుల ఎఫ్-46 జావెలిన్‌త్రో ఈవెంట్‌లో భారత్‌కు మరో పతకం రాకుండా అడ్డుకుందనే విమర్శలు జోరందుకున్నాయి. ఈ పోటీల్లో దేవేంద్ర ఝజారియా 63.97 మీటర్ల దూరానికి జావెలిన్‌ను విసిరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. అయితే, ఇదే విభాగంలో పోటీపడాల్సిన సుందర్ సింగ్ గుజ్రార్ గైర్హాజరయ్యాడు.

09/25/2016 - 22:16

చిన్నారుల నవ్వుల్తో
ఇంద్రధనసు వంతెనల్ని
కడుతున్నాను
స్వేచ్ఛాగీతాల్ని సరిహద్దులు దాటించేందుకు
పావుర సైన్యాన్ని పెంచుతున్నాను
వసంతాల సుమగంధాలను శ్వాసిస్తూ
ఎడారిలో మోడుల్ని
పల్లవింపచేస్తున్నాను
గుండె వంతెనలో
జలధారల్ని ఒడిసిపడుతూ
కాల్వల్లోకి తోడేస్తున్నాను
పరవళ్లు తొక్కే నదినై
బీళ్లకు పచ్చదనాన్ని అతికిస్తున్నాను

09/25/2016 - 22:14

సంధ్యనుపాసిస్తున్న
నన్ను
‘‘మసక నిశ్శబ్దం’’ చుట్టేసుకొంది
సూర్యుడావలించి అటు వెళ్తూ వెళ్తూ
ఎంత విషాద మోహనంగా చూశాడని
కలల పరిమళాన్ని మేలుకొలిపే
మంత్రనగరి పొలిమేర వైపు...

09/25/2016 - 22:12

వాఙ్మయ చరిత్రకారుడికి కులతత్వం వుండకూడదు. భావజాల సంకుచితత్వం వుండకూడదు. సమకాలీన ద్వేషం ఉండకూడదు. ప్రత్యర్థి భావజాలాన్ని కూడా స్వీకరించగలిగిన ధైర్యం కావాలి. విమర్శను సహించగలిగిన ఓర్పు, సమ్యక్ దర్శనం కావాలి. ప్రత్యర్థిని అర్థం చేసుకోవడం వల్లే తన వ్యక్తిత్వాన్ని పెంచుకోగలగాలి (పుట-240). కొందరు ఎక్కువ చదువుతారు. రాయలేరు. కొందరు ఎక్కువ రాస్తారు. దానివెంట అధ్యయనం ఉండదు (పుట.446).

09/25/2016 - 22:09

కులమతాలు గీచుకున్న గీతలుజొచ్చి
పంజరాన కట్టువరను నేను
నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు
తరుగులేదు విశ్వనరుడ నేను
(జాషువ: నేను)

09/25/2016 - 22:04

భారతదేశం ఒక సంయుక్త దేశంగా తీసుకుంటే, మనకు మంచి కథకులు వున్నారు. భాషలు ఎక్కువ, ప్రాంతీయతలు ఎక్కువ కనుక మనకు భాషా రచయితల, ప్రాంతీయ రచయితల పరిమాణం ఎక్కువ. ఒక భాష రచయితే ఆ భాష చదివే అన్ని రాష్ట్రాలలోను గణనకు రాడు; గమనానికి రాడు. విభేదాలు, వితరణలలో వున్న వ్యత్యాసాలవల్ల రుూ విపర్యయం జరుగుతుంది. ఒక భాష రచయిత యితర భాషల లోనికి తేలికగా అనువాదం కాడు. మాండలికం అడ్డం వస్తుంది.

09/25/2016 - 21:57

ఆదిదంపతులైన శివపార్వతుల కుమారుడు కుమారస్వామి. ఇతని పుట్టుక గురించి రామాయణంలో విశేషమైన కథ ఉంది. పూర్వం మానవులు, దేవతలు, సిద్దులు, సాధ్యులు కలసి మహాదేవుని ప్రార్థించి తమకు ఆటంకాలు కలిగించేవాడు, హింసించేవాడు అయన తారకా సురుని సంహరించడానికి శివకుమారుడిని ప్రసాదించమని వేడుకున్నారు. ఆ మహాదేవుని ప్రసాదం వలన శివకుమారుడు జన్మించాడు.

Pages