S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2016 - 00:42

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ఎయిర్ టెల్ సర్వీసస్ సంస్ధ 4జి డాటా ప్యాక్‌ను ప్రకటించింది. 90 రోజుల పాటు ఉచితంగా డాటా సేవలను అందిస్తామని ఎయిర్ టెల్ ఇండియా డైరెక్టర్ అజయ్ పూరి తెలిపారు. ఇప్పటికే ఉన్న కస్టమర్లు రూ.1495 చెల్లించిన వారికి మూడు నెలల పాటు ఈ సదుపాయం ఉంటుందన్నారు. కొత్త వినియోగదారులు మొదటి రీచార్జికి రూ.1494 చెల్లించాలన్నారు. 4జి హ్యాండ్‌సెట్లు ఉన్న వారికే ఈ సదుపాయం ఉంటుందన్నారు.

09/26/2016 - 00:41

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: ఎగుమతుల నాణ్యత విషయంలో భారత్, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ రెగ్యులేటర్ అథారిటీ (యుఎస్ ఎఫ్‌డిఎ) మధ్య సమన్వయం, ప్రతిభావంతమైన సహకారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని యుఎస్ ఎఫ్‌డిఎ డైరెక్టర్ మాథ్యూ టి థామస్ అన్నారు. విశాఖలో జరుగుతున్న ఇండియా, ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో ముగింపు సందర్భంగా ఆదివారం జరిగిన టెక్నికల్ సెషన్‌లో ఆయన మాట్లాడారు.

09/26/2016 - 00:40

హైదరాబాద్, సెప్టెంబర్ 25: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం యూనిట్-1లో నిర్వహించిన సిఒడిరన్ విజయవంతమైంది. ఆదివారం సింగరేణి అధికారులతోపాటు విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న తెలంగాణ స్టేట్ సదరన్ డిస్కం, తెలంగాణ స్టేట్ నార్త్ డిస్కం అధికారుల సమక్షంలో సిఒడి రన్ జరిగింది.

09/26/2016 - 00:39

పాల్వంచ, సెప్టెంబర్ 25: ఖమ్మం జిల్లా పాల్వంచలో రూ 5,290 కోట్ల వ్యయంతో నెలకొల్పుతున్న కెటిపిఎస్ 7వ దశ కర్మాగారం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణం చేస్తున్న ఈ కర్మాగారం పనులను 1-1-2015న ప్రారంభించారు. 2017 డిసెంబర్ లోపు కర్మాగారం పనులు పూర్తయ్యే విధంగా కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు శ్రమిస్తున్నారు.

09/26/2016 - 00:33

79 రోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న కాశ్మీర్‌లో మెల్లగా శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయ. వేర్పాటువాదులు నిర్వహిస్తున్న బంద్‌కు ఆదివారం మధ్యాహ్నం
2 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు విరామం ప్రకటించడంతో శ్రీనగర్‌లో కళకళలాడుతున్న రోడ్లు, మార్కెట్లు.

09/26/2016 - 00:25

న్యూయార్క్, సెప్టెంబర్ 25: భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆదివారం న్యూయార్క్ చేరుకున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 71వ సమావేశంలో ప్రసంగించడానికి ఆమె ఇక్కడికి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం సుష్మాస్వరాజ్ ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తారు. భారత్ అంతర్గత అంశమైన కాశ్మీర్‌పై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు ఆమె తన ప్రసంగంలో గట్టి సమాధానం ఇస్తారని భావిస్తున్నారు.

09/26/2016 - 00:24

కోజికోడ్, సెప్టెంబర్ 25: పాకిస్తాన్.. భారత్‌ను బలవంతంగా దీర్ఘకాలిక యుద్ధంలోకి దింపిందని, ఈ యుద్ధంలో ఇటీవల ఉరీ సెక్టార్‌లో మన సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడి ఒక భాగం మాత్రమేనని, అదే చివరి అంకం కాదని, ఈ యుద్ధంలో అంతిమ విజయం మనదేనని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.

09/26/2016 - 00:22

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ఉరీ ఉగ్రదాడి పట్ల దేశ ప్రజల్లో వ్యక్తమయిన ఆగ్రహం 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధ సమయంలో భారతీయుల్లో పెల్లుబుకిన ఆగ్రహాన్ని గుర్తు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఉగ్రదాడికి కారకులైన వారిని శిక్షించి తీరుతామని స్పష్టం చేశారు. అంతేకాదు సైన్యం మాటలు మాట్లాడదని, పరాక్రమాన్ని మాత్రమే ప్రదర్శిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు.

09/26/2016 - 00:18

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: వివాదాస్పద ఇషత్ జహాన్ ‘బూటకపు ఎన్‌కౌంటర్’ కేసుకు సంబంధించిన పత్రాలు అదృశ్యం కావడంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే బిజెపి, కాంగ్రెస్‌ల మధ్య ఈ అంశంపై చోటు చేసుకుంటున్న పరస్పర విమర్శలు తాజా చర్యతో మరింత పెరగనున్నాయి.

09/26/2016 - 00:16

కె.కోటపాడు, సెప్టెంబర్ 25: ‘నేరం నాదికాదు ఆకలిది’ అని ఓ సినిమాలో విన్నాం. కె.కోటపాడులో కూడా నేరం ఆకలిది అన్నట్టు ఓ పంది తన జాతిపిల్లలనే తినేస్తోంది. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. విశాఖపట్నం జిల్లా, కె.కోటపాడులోని విద్యుత్‌శాఖ కార్యాలయం వద్ద పందుల గుంపు సంచరిస్తుంటాయి. సమీప ఇళ్ళల్లోని మహిళలు వేసిన ఆహారాన్ని తిని జీవిస్తుంటాయి. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఈ పందులకు ఆహారం దొరకడం లేదు.

Pages