ట్రంప్‌ను దాటేసిన హిల్లరీ
Published Friday, 5 August 2016వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీకి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే 15 శాతం మద్దతు అధికంగా ఉన్నట్లు తెలిపింది. హిల్లరీకి 48 శాతం మంది ఓటర్ల మద్దతు ఉండగా, ట్రంప్‌కు కేవలం 33 శాతం మంది ఓటర్లు మద్దతు ఉన్నట్లు మెక్‌క్లాచీ-మారిస్ట్ పోల్ సర్వే స్పష్టం చేసింది. తాజా సర్వేలో ట్రంప్ మద్దతు మరింతగా పడిపోయింది. వాల్‌స్ట్రీట్ జర్నల్/ఎన్బీసీ నిర్వహించిన మరో ఒపీనియన్ పోల్‌లో హిల్లరీ ట్రంప్ కంటే 9 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. వాల్‌స్ట్రీట్ పోల్ సర్వేలో ట్రంప్ కంటే ఐదు పాయింట్ల ఆధిక్యంలో హిల్లరీ నిలిచారు.