ఆర్టీసీ ఆస్పత్రిలో చైర్మన్ తనిఖీలు
Published Wednesday, 3 August 2016హైదరాబాద్: నగరంలోని తార్నాకలో ఆర్టీసీ ఆస్పత్రిని ఆ సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ బుధవారం తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. వైద్యసేవలు, సౌకర్యాల తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రోగులకు మెరుగైన సేవలందించాలని వైద్యులకు సూచించారు.