S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/02/2016 - 07:02

కర్నూలు, ఆగస్టు 1 : కృష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లాలో శ్రీశైలం, సంగమేశ్వరంతో పాటు నదీ జలాలు ప్రవహించే పరివాహక గ్రామాల్లో చేపట్టిన పుష్కర పనులు ఇంకా పూర్తి కాలేదు. కర్నూలులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జూలై 31వ తేదీ నాటికి పుష్కర పనులు పూర్తి కావాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఆ రోజుకు అన్ని శాఖల తరఫున సగటున 61శాతం పనులు పూర్తయినట్లు అధికారులు సిఎంకు వివరించారు.

08/02/2016 - 06:58

భద్రాచలం, ఆగస్టు 1: ఆంధ్రా,తెలంగాణ, ఒడిషా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాల జైత్రయాత్ర కొనసాగుతోంది. గత నెల 28న ప్రారంభమైన మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను అడుగడుగునా అడ్డుకుంటున్న భద్రతాబలగాలు సోమవారం సైతం వర్షాలను లెక్కచేయకుండా వాగులను దాటుకుంటూ మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలకు వెళ్లి మరీ స్మారక స్తూపాలను కూల్చివేశారు.

08/02/2016 - 06:52

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి నేడు మాట మార్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరని ఆంధ్రప్రదేశ్ ప్ర త్యేకహోదా సాధన సమితి రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

08/02/2016 - 06:51

రాజమహేంద్రవరం, ఆగస్టు 1: గోదావరి తీరంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇపుడు అందరి చూపు గోదావరి అంత్య పుష్కరాల వైపే వుంది. చారిత్రక రాజమహేంద్రవరం అంత్య పుష్కరాల నేపధ్యంలో మరో సారి ఘన ఏర్పాట్లతో భక్త జనానికి స్వాగతం పలుకుతోంది. అఖండ గోదావరి నది ఒడ్డున తూర్పు గోదావరి జిల్లాలో ఎటు చూసినా అంత్య పుష్కర జనమే కన్పిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి సోమవారం భక్తజనం తరలి వచ్చారు.

08/02/2016 - 06:45

చిత్తూరు, ఆగస్టు 1:ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటే షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్‌కుమార్ సూచించారు. సోమవారం స్థానిక నాగయ్య కళాక్షేత్రంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ పథకాలపై యువ స్పూర్తి సమ్యేళనం అవగాహన సదస్సు నిర్వహించారు.

08/02/2016 - 06:41

కడప,ఆగస్టు 1: జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, పలు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఏసిబి అధికారులకు, ప్రభుత్వానికి ఫిర్యాదులు అందిన దరిమిలా సోమవారం నుంచి ఏసిబి అధికారులు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై నిఘా వుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

08/02/2016 - 06:38

అనంతపురం సిటీ, ఆగస్టు 1:ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను, సమయానుగుణంగా నడిపించి పాఠశాలల అభివృద్ధిని కాంక్షించి ప్రభత్వుం ప్రతిష్టాత్మకంగా విద్యా కమిటీ ఎన్నికలను నిర్వహిస్తోంది. సోమవారం జరిగిన పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా పార్టీలు చోక్యంతో పోటాపోటీగా జరిగాయి.

08/02/2016 - 06:37

బుక్కరాయసముద్రం, ఆగస్టు 1: ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి, తానూ ఆత్మహత్య చేసుకుందన్న వార్తతో బుక్కరాయసముద్రం పంచాయతీ పరిధిలోని కొట్టాలపల్లి గ్రామం ఉలిక్కిపడింది. సోమవారం తెలతెలవారుతుండగానే ఈ వార్త దావనలంలా వ్యాపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.

08/02/2016 - 06:34

విజయనగరం, జూలై 30: ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి వెంటవెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జ్, సమాచార, ఐటి శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం వివిధ అంశాలకు ఇచ్చే ప్రాధాన్యతల ఆధారంగా ఆయా కార్యక్రమాల అమలుకు అధికారులు పనిచేయాలని తెలిపారు.

08/02/2016 - 06:31

విజయనగరం, జూలై 30: విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపి ఉన్నతి సాధించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సూచించారు. విద్యారంగంపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు భారీగా నిధులు వెచ్చించి వివిధ పథకాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. విజయనగరం పట్టణంలో 2.30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని కేంద్రమంత్రి అశోక్ శనివారం ప్రారంభించారు.

Pages