S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/02/2016 - 11:51

గుంటూరు : పొన్నూరు తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. దీక్షకు మద్దతు తెలిపేందుకు తెదేపా శ్రేణులు భారీగా తరలివచ్చారు. పొన్నూరులోని ఆచార్య ఎన్జీరంగా విగ్రహం వద్ద సాయంత్రం 5గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని నరేంద్రడిమాండ్‌ చేశారు.

08/02/2016 - 11:48

గుంటూరు : మంగళగిరి నియోజకవర్గంలో బంద్‌ను పర్యవేక్షిస్తున్న వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో పలువురు నేతలను పోలీసలు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉదయం 5 గంటలకే బస్టాండు వద్దకు చేరుకున్న వైకాపా కార్యకర్తలు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రాస్తారోకో చేపట్టారు. గుంటూరు-విజయవాడతో పాటు రాజధాని సచివాలయం వెలగపూడికి వెళ్లె బస్సులన్నీ నిలిచిపోయాయి.

08/02/2016 - 11:45

బ్రెజిల్‌: బ్రెజిల్‌లో విమానం కూలి మంటలు చెలరేగి అందులోని 8 మంది అక్కడికక్కడే మృతిచెందారు. పైపర్‌ నవాజో జెట్‌ విమానం పరానా రాష్ట్రంలోని క్యాంబే ప్రాంతంలో రవాణా శాఖ భవనంపై కూలిపోయింది. జెట్‌ విమానం లోని ప్రయాణికులంతాఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తున్నారని, కొద్దిసేపట్లో గమ్యం చేరుకుంటారనగా ప్రమాదం జరిగిపోయిందని అధికారులు వెల్లడించారు.

08/02/2016 - 07:46

గజ్వేల్, ఆగస్టు 1 : పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా టిఅర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ పథకాలు ఆదర్శంగా నిలుస్తుండగా, ప్రధాని నరేంద్రమోదీ సైతం మెచ్చుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

08/02/2016 - 07:46

గజ్వేల్, ఆగస్టు 1 : డిసిసిబి ద్వారా తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకుంటే చట్ట పరమైన చర్యలు తప్పవని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు చిట్టి దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ సహకార బ్యాంక్‌ను ఆకస్మిక తనిఖీ చేసి రికార్డును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.

08/02/2016 - 07:45

సంగారెడ్డి, ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, ప్రణాళిక బద్దంగా చేపట్టిన మిషన్ భగీరత శాశ్వత తాగునీటి పథకాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడి చేతుల మీదుగా ప్రయోగాత్మకంగా ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంతో పాటు సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు మొదటి విడతలో మిషన్ భగీరత పథకం ద్వారా తాగునీటిని అందించనున్నారు.

08/02/2016 - 07:41

పరకాల, అగస్టు 1: కెటిఆర్‌కు చెందిన కెమికల్ ఫ్యాక్టరీ నీటి అవసరాల కోసమే మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ కుట్ర జరుగుతోందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. సోమవారం పరకాలలో నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

08/02/2016 - 07:40

వరంగల్, ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు గడిచినా రైల్వే పరిధిలో ఉన్న తెలంగాణ ఉద్యమ కేసులు టిఆర్‌ఎస్ మంత్రులను, ఎమ్మెల్యేలను, ముఖ్య నాయకులను వెంటాడుతూనే ఉన్నాయి.

08/02/2016 - 07:39

రఘునాథపల్లి, ఆగస్టు 1: బహుజనులు రాజ్యాధికారం చేపట్టడానికి అందరూ ఏకం కావాల్సిన అవశ్యకత ఉందని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు.

08/02/2016 - 07:39

వరంగల్, ఆగస్టు 1: ప్రతి కార్మికుని జీవిత భద్రత ప్రభుత్వానిదేనని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా ప్రమాదవశాత్తు చనిపోయిన ఏ కార్మికుడికైనా జీవితబీమా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్టమ్రేనని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రపంచ ఆటో డ్రైవర్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం వరంగల్ నగరంలోని హన్మకొండ పట్టణంలో జరిగిన బహిరంగసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

Pages