S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/02/2016 - 06:17

పోలవరం, జూలై 30: గత సంవత్సరం జరిగిన ఆది పుష్కరాల్లో విధులు నిర్వర్తించినట్లే అంత్య పుష్కరాల్లో కూడా అదే విధంగా విధులు నిర్వర్తించి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని ఆర్డీవో ఎస్ లవన్న అన్నారు. ఆదివారం నుండి నిర్వహించబోయే అంత్య పుష్కరాల సందర్భంగా శనివారం సాయంత్రం మండలంలో ఉన్న ఘాట్లను డిఎస్పీ జె వెంకట్రావు, డిఎల్పీవో కె అమ్మాజీతో కలిసి ఆర్డీవో పరిశీలించారు.

08/02/2016 - 06:16

భద్రాచలం, ఆగస్టు 1: అంత్య పుష్కరాల సందర్భం గా ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీ సీతారామ దివ్యక్షేత్రంలోని గోదావరి తీరం సోమవారం భక్తులతో పోటెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు జీవనది గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. ప్రత్యేక పూ జలు నిర్వహించారు.

08/02/2016 - 06:15

కాకినాడ, జూలై 30: కాకినాడ జెఎన్‌టియు రిజిస్ట్రార్‌గా ఆచార్య సిహెచ్ సాయిబాబు నియమితులయ్యారు. వర్సిటీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఎస్‌సిడి)గా విధులు నిర్వహిస్తున్న సాయిబాబుకు రిజిస్ట్రార్‌గా నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించిన ఆచార్య జివిఆర్ ప్రసాదరాజును ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఒఎస్‌డి)గా నియమించారు.

08/02/2016 - 06:14

మహబూబ్‌నగర్, ఆగస్టు 1: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల పాలిట కంటకప్రాయుడుగా తయారయ్యారని, కేవలం ఆయన కాంట్రాక్టర్లకు మాత్రం ప్రియుడయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మహబూ బ్‌నగర్ జిలాల్లో నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టాలని మహబూబ్‌నగర్‌లో సోమవారం నిర్వహించిన జలసాధన దీక్షకు ఆయన హాజరయ్యారు.

08/02/2016 - 06:10

నల్లగొండ, ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మంగా విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టిందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

08/02/2016 - 06:08

నవాబుపేట/జడ్చర్ల, ఆగస్టు 1: ఎన్నికలకు ముందు సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు అనుభవ లేమితో పరిపాలించి అప్పుల పాలు చేశారని టిడిపి రాష్ట్ర అద్యక్షుడు ఎల్. రమణ ధ్వజమెత్తారు. సోమవారం మహ బూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

08/02/2016 - 06:08

ఏలూరు, జూలై 30: జిల్లాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం కేంద్రంగా మిత్రపక్షాలుగా ఉన్న టిడిపి, బిజెపిల మధ్య రగులుకున్న జ్వాల ఇంకా ఆరలేదనే చెప్పాలి. కొద్దికాలం క్రితం టిడిపి నేతల వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పదవి కూడా వదులుకునేందుకు సిద్ధమని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొనడం, చివరకు ముఖ్యమంత్రి సమక్షంలో వ్యవహారం సద్దుమణగడం తెల్సిందే.

08/02/2016 - 06:04

తొగుట, ఆగస్టు 1: మల్లన్నసాగర్ భూనిర్వాసిత గ్రామం వేములఘాట్‌లో లాఠీచార్జీ బాధితులను పరామర్శించేందుకు హైకోర్టు అనుమతితో మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి సునితారెడ్డి ఆధ్వర్యంలో నాయకుల బృందం సోమవారం సందర్శించింది.

08/02/2016 - 06:04

భీమవరం, జూలై 30: స్థానిక ప్రకాశం చౌక్‌లో శనివారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకెం సీతారాం ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు.

08/02/2016 - 06:01

ఆదిలాబాద్, ఆగస్టు 1: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మావోయిస్టు పార్టీ దళసభ్యుడు టేకం రవి ఆలియాస్ రవీందర్‌ను సోమవారం తాండూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన టేకం రవిని సోమవారం జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మీడియా సమావేశంలో ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు.

Pages