S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/02/2016 - 05:32

విజయనగరం, ఆగస్టు 1: అడ్డగోలు విభజనతో కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేస్తే, తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని హామీ ఇచ్చిన బిజెపి ఇప్పటి వరకు రాష్ట్రానికి చేసిందేమి లేదని గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖల మంత్రి డాక్టర్ మృణాళిని ఆరోపించారు. ప్రత్యేక నిధుల పేరుతో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏ సహాయం అందడంలేదన్నారు.

08/02/2016 - 05:31

బుక్కరాయసముద్రం, ఆగస్టు 1: ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన ఓ తల్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయవిదారకర సంఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం పంచాయితీ పరిధి కొట్టాలపల్లిలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన భారతి(25) తన ఇద్దరు పిల్లలు మహాలక్ష్మి(6), కుమారుడు(6 నెలలు)కు విషమిచ్చి అనంతరం తానూ ఉరేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

08/02/2016 - 05:30

విశాఖపట్నం, ఆగస్టు 1: ఉత్తర బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం కూడా కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో ఇది మరింత బలపడనుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉండటంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

08/02/2016 - 05:29

కడప, ఆగస్టు 1: కడపలో ఎపిడ్రిన్ ముఠాను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్సీ(డిఆర్‌ఐ) అధికారులు అరెస్టుచేసినట్ల సమాచారం. ఈ ముఠానుంచి రూ.4.5 కోట్ల విలువచేసే ఎపిడ్రిన్(మత్తు పదార్థం) స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

08/02/2016 - 05:29

పుత్తూరు, ఆగస్టు 1: చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం ఎగువ కృష్ణాపురం మామిడితోటలో ఓ గుర్తు తెలియని యువతి దారుణ హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎగువ కృష్ణాపురం వద్ద ఉన్న మామిడితోటలో 18 ఏళ్ల వయసు కలిగిన ఓ యువతిని హత్య చేసిన అగంతుకులు ఆమె శరీరాన్ని తగలబెట్టారు. ఈ సంఘటనలో ఆమె శరీరం మోకాళ్ల వరకు పూర్తిగా కాలిపోయింది. సోమవారం స్థానికులు గుర్తించి ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

08/02/2016 - 05:18

దేశీయ అతిపెద్ద మార్ట్‌గేజ్ లెండర్ హెచ్‌డిఎఫ్‌సి..సోమవారం లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో మసాలా లేదా రూపాయ బాండ్ల ద్వారా 30 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. భారత్‌లో కాకుండా విదేశాల్లో మసాలా బాండ్లు జారీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఎక్స్‌చేంజ్ వద్ద హెచ్‌డిఎఫ్‌సి ప్రతినిధుల ఆనందోత్సాహం

08/02/2016 - 05:15

న్యూఢిల్లీ, ఆగస్టు 1: రుణ రికవరీ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు) ప్రశ్నార్థకం చేస్తున్న నేపథ్యంలో ఈ బిల్లు అమల్లోకి వస్తే రుణాల వసూళ్లు తేలిక కానుందని నిపుణులు చెబుతున్నారు. అయితే విద్యా రుణాల విషయంలో వెసులుబాటు ఉంటుందన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ..

08/02/2016 - 05:08

హైదరాబాద్, ఆగస్టు 1: మహిళలు చైతన్యవంతులైతే సమాజం ప్రగతి పథంలో నడుస్తుందని అయితే మతం మహిళల ఎదుగుదలకు ఆటంకం అవుతుందని ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపాధ్యాయుల వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ‘నాయకత్వ కార్యశాల’ రెండోరోజు కార్యక్రమంలో ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే పాల్గొన్నారు. మహిళలు నాయకత్వంలోకి రావాలంటే ఇంట్లో కూడా పోరాటం చేయాలని అన్నారు.

08/02/2016 - 05:07

హైదరాబాద్, ఆగస్టు 1: హైదరాబాద్‌లో ఓ లారీ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం మియాపూర్ వద్ద జాతీయ రహదారిపై సంఘటన చోటుచేసుకుంది. భారీ లోడ్‌తో లారీ జనంపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. కూకట్‌పల్లి నుంచి బిహెచ్‌ఇఎల్ వైపు వెళ్తున్న లారీ మదీనగూడ వద్ద రోడ్డు పక్కనే ఉన్న ఓ నర్సరీలోకి దూసుకెళ్లింది.

08/02/2016 - 05:07

హైదరాబాద్, ఆగస్టు 1:అక్రమ మైనింగ్‌ను నివారించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అకస్మిక తనిఖీలు జరపనున్నట్టు ఐటి, మైనింగ్ శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. రెవెన్యూ, గనులు, విజిలెన్స్, పోలీసు అధికారులతో ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కరీంనగర్ పర్యటనలో ఉన్న కెటిఆర్ జిల్లా యంత్రాంగానికి, స్థానిక గనుల శాఖ యంత్రాంగానికి ఎలాంటి సమాచారం లేకుండా కొత్తపల్లి ఇసుక రీచ్‌ను సందర్శించారు.

Pages