S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భక్తజన గోదారి

రాజమహేంద్రవరం, ఆగస్టు 1: గోదావరి తీరంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇపుడు అందరి చూపు గోదావరి అంత్య పుష్కరాల వైపే వుంది. చారిత్రక రాజమహేంద్రవరం అంత్య పుష్కరాల నేపధ్యంలో మరో సారి ఘన ఏర్పాట్లతో భక్త జనానికి స్వాగతం పలుకుతోంది. అఖండ గోదావరి నది ఒడ్డున తూర్పు గోదావరి జిల్లాలో ఎటు చూసినా అంత్య పుష్కర జనమే కన్పిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి సోమవారం భక్తజనం తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్త జనం వేకువ జామునే జిల్లాలోని వివిధ స్నాన ఘట్టాలకు చేరుకుని నదీ స్నానం చేసి పునీతులయ్యారు. రాజమహేంద్రవరం నగరం గోదావరి గట్టున వున్న ప్రసిద్ధ క్షేత్రాలైన కోటిలింగేశ్వర, మార్కండేయ, విశే్వశ్వర స్వామి, ధవళేశ్వరం అగస్తేశ్వర, జనార్ధన స్వామి క్షేత్రాలను దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు. సోమవారం కావడంతో ఈ క్షేత్రాల్లో అభిషేకాలతో భక్తులు బారులుతీరారు. అంత్య పుష్కరాలకు రోజు రోజుకూ రద్దీ పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెరుగుతున్నారు. రానున్న రోజుల్లో మరింతగా భక్తుల రద్దీ పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. సోమవారం కేరళ, చెన్నై, ఒడిస్సాకు చెందిన యాత్రికులు అధికంగా వచ్చినట్టు కన్పించారు. పుష్కర ఘాట్‌లో వేకువ జాము నుంచి భక్తులు పోటెత్తారు. విఐపి సరస్వతి ఘాట్, గౌతమీ ఘాట్‌లలో కూడా భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. సోమవారం జిల్లా వ్యాప్తంగా భక్తులు లక్షలాదిగా పుణ్య స్నానాలు ఆచరించారు. మొదటి రోజు వచ్చిన భక్తుల సంఖ్య సోమవారం ఉదయానికే అధిగమించింది. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరంగా భక్తుల రాక ప్రవాహంలా కొనసాగింది. స్నాన ఘట్టాలతో పాటు, పుణ్య క్షేత్రాలు కూడా అంత్య పుష్కర భక్తులతో రద్దీగా మారాయి. వివిధ శాఖల అధికారులు జోన్ల వారీగా ఘాట్లలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడే వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. వివిధ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి, స్కౌట్ విద్యార్థినీ, విద్యార్థులు భక్తులకు విశేషరీతిలో సేవలు అందిస్తున్నారు. వృద్ధులు స్నానమాచరించేందుకు ఘాట్లలో సేవలు అందిస్తూ మానవీయతను చాటుకుంటున్నారు. ఆంధ్రకేసరి యువజన సమితి, కల్కి, సత్యసాయి, లయన్స్, అలయన్స్ వంటి క్లబ్‌ల సభ్యులు వారికి కేటాయించిన ఘాట్లలో సేవలు అందిస్తున్నారు. భక్తులు పుష్కర ఘాట్‌లోని గోదావరిమాత విగ్రహాన్ని విశేషంగా దర్శించుకుని పూజలు నిర్వహిస్తూ నది పట్ల భక్తి భావాన్ని ప్రదర్శిస్తున్నారు. పుష్కర ఘాట్‌లో పుష్కరుడు విగ్రహాన్ని దర్శించుకున్నారు. గోదావరి తీరమంతా ఓంకార నాధం ప్రతిధ్వనిస్తోంది. ఇపుడు చారిత్రక రాజమహేంద్రవరంలో ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే కనిపిస్తోంది. స్నాన ఘట్టాల్లో జంగం దేవరలతో పితృ దేవతలను స్మరించుకోవడం, వాయినాలు, పొత్తర్లతో ఘాట్‌లు రద్దీగా మారాయి. టెక్నాలజీకి తోడు ఆధ్యాత్మిక భావజాలం కూడా విస్తృతమైన నేపధ్యంలో నదిపై వున్న మమకారాన్ని పుష్కరాల సందర్భంగా మరొక్క సారి మన సంస్కృతి, సంప్రదాయాలను మననం చేసుకున్నట్టుగా అశేష భక్తజనం ఇపుడు గోదావరినది వైపు అడుగులు వేస్తూనే వుంది. అఖండ గోదావరి నది అఖండ హారతి ఇవ్వడం విశేషత సంతరించుకున్న నేపధ్యంలో ఉదయం ఎపుడో పుణ్య స్నానాలకు వచ్చిన భక్తులు దైవ దర్శనం అనంతరం గోదావరి హారతి సమయం వరకు పుష్కర ఘాట్ వద్దే వేచి ఉండటం కన్పిస్తోంది. అఖండ హారతి కార్యక్రమంతో అశేష భక్త జనం పుష్కర ఘాట్‌లో పొటెత్తుతున్నారు. ఒక వైపు ఆధ్యాత్మిక సోయగంతో, మరో వైపు సాంస్కృతిక కార్యక్రమాలతో రాజమహేంద్రవరం అంత్య పుష్కర శోభితమైంది.

గోదావరి తీరంలో
సాంస్కృతిక సౌరభం
రాజమహేంద్రవరం, ఆగస్టు 1:అంత్య పుష్కరాలకు పురస్కరించుకుని చారిత్రక రాజమహేంద్రవరం నగరంలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పదకొండోతేదీ వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఆనం కళా కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం పలువురి ప్రముఖ నాట్యాచార్యుల పర్యవేక్షణలో చిన్నారుల బృందాలు తమ నాట్య కౌశల్యంతో అలరించారు. వెంకట్రాయ నాట్య బృందం ఆధ్వర్యంలో ప్రముఖ నాట్యాచార్యులు సప్పా యశోధ కృష్ణ శిష్య బృందంతో కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. గాయత్రి నృత్య కళానికేతన్ ఆధ్వర్యంలో ప్రముఖ నాట్యాచారిణి గాయత్రి పట్నాయక్ శిష్య బృందంతో భరత నాట్య ప్రదర్శన నిర్వహించారు. కళాప్రియా నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో ప్రముఖ నాట్యాచార్యులు ఆచంట చంద్రశేఖర్ శిష్యబృందంతో ఆంధ్ర నాట్యం, పేరిణీ నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. అంత్య పుష్కరాలను పురస్కరించుకుని యాత్రీకుల కోసం ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినందుకు శాస్ర్తియ నాట్య గురువుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ అడ్డాల నాగేశ్వరరావు అంత్య పుష్కర నోడల్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ విజయ రామరాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రత్యేక హోదా కోసం నేడు బంద్
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఆగస్టు 1: రాష్ట్భ్రావృద్ధికి ప్రత్యేక హోదా ప్రకటించాలన్న నినాదంతో మంగళవారం జిల్లాను స్తంభింపజేసేందుకు విపక్షాలు సన్నద్ధమయ్యాయి. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బంద్ విజయవంతానికి పిలుపునిచ్చాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి. ఎన్నికలకు ముందు ‘ప్రశ్నించడం కోసం’ అన్న నినాదంతో ఆవిర్భవించిన జనసేన పార్టీ నుండి సానుకూల ప్రకటన ఇంతవరకు రాలేదని బంద్‌కు పిలుపునిచ్చిన రాజకీయ పార్టీల నేతలు వ్యాఖ్యానించారు. మరోవైపు లోక్‌సత్తా పార్టీ నేతలు రాష్ట్ర బంద్ విజయవంతానికి తమవంతు సహకారాన్ని అందించాలని నిర్ణయించారు. మిత్రపక్షాలైన టిడిపి-బిజెపిలు మాత్రం ప్రతిపక్షాలు చేస్తున్న బంద్ ప్రయత్నాలపై విరుచుకుపడ్డాయి. జిల్లా బిజెపి అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పాపాన్ని కాంగ్రెస్ మూట గట్టుకున్నదన్నారు. తెలుగుదేశం నాయకుడు, కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రం ఇప్పుడిపుడే అభివృద్ధి సాధిస్తున్న సమయంలో బంద్‌లు చేపట్టడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర విభజనకు వైకాపాయే కారణమని విమర్శించారు. దీనిపై వైకాపా జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతకానితనం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందన్నారు. బిజెపి, టిడిపిలు ప్రత్యేక హోదాపై నాటకాలాడుతున్నాయని విమర్శించారు. ఉద్యోగ, కార్మిక, వర్తక, ఆర్టీసీ యూనియన్లు బంద్‌కు సహకరించాలని కోరారు. బంద్‌లో అత్యవసర సేవలు ప్రజలకందేలా సహకరిస్తామని కన్నబాబు చెప్పారు. ప్రత్యేక హోదాకై జరిగే ఆందోళనకు సహకరిస్తామని ఎన్‌జిఒలు ప్రకటించారు. బంద్ నేపథ్యంలో ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు మంగళవారం సెలవు ప్రకటించాయి.
మండపంలో విద్యా కమిటీ ఎన్నికలు రక్తసిక్తం
*నలుగుగురికి తీవ్రగాయాలు*20మందికి స్వల్ప గాయాలు*ఎన్నికలు వాయిదా, గ్రామంలో పోలీస్ పికెట్
శంఖవరం, ఆగస్టు 1: పాఠశాలలో వౌలిక సౌకర్యాల, మెరుగైన విద్యా భోధనే ధ్యేయంగా ఏర్పాటు చేసిందే విద్యా కమిటీ. అటువంటి విద్యా కమిటీ ఎన్నికలకు రాజకీయాల రంగు పులుముకోవడంతో సాధారణ ఎన్నికల లాగే ఘర్షణలు ఏర్పడి రక్తమోడుతున్నాయి. వివరాల ప్రకారం... శంఖవరం మండలంలోని మండపం గ్రామం ఒక సమస్యాత్మక గ్రామంగా ముద్రపడింది. గత కొనే్నళ్లుగా సాధారణ ఎన్నికల నుండి విద్యా కమిటీ ఎన్నికల వరకు ఘర్షణ జరగని ఎన్నిక లేదంటే అతిశయోక్తి కాదు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా కమిటీ ఎన్నికలు మండపం గ్రామంలో మరోసారి రణరంగానికి వేదికగా నిలిచింది. సమస్యాత్మక గ్రామంగా గుర్తింపు పొందినప్పటికీ మండపం గ్రామంలోని ఎన్నికలకు కేవలం నామమాత్రంగా పోలీసులను బందోబస్తుగా నియమించారు. దీనితో మండపం గ్రామంలో టిడిపి, వైసిపి వర్గాలు ఎన్నికలు ఆరంభంలోనే బాహాబాహీకు దిగాయి. ఎన్నికల్లో పాల్గోనేందుకు వచ్చే విధ్యార్థుల తల్లితండ్రుల కంటే బయటి వ్యక్తుల ప్రమేయం అధికంగా ఉండడమే ఘర్షణకు కారణంగా పలువురు గ్రామస్థులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనితో టిడిపి, వైసిపి కార్యకర్తలు మాటల యుద్ధంతో ఆరంభమై రాళ్లు, కర్రలు చేతబూనుకుని పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో సుమారు 30మంది గాయపడగా, వారిలో నలుగురు పోలం విష్ణుమూర్తి, పోలం అర్జునుడు, తాటికొండ సుబ్బారావు, నక్కా మాణిక్యంలకు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను తుని ఏరియా ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఘర్షణల్లో ఒక ఆటో తగలబడగా, ఒక బైక్ ధ్వంసమయ్యింది. అల్లు సూరిబాబు అనే వ్యక్తికి చెందిన గృహం ధ్వంసమైంది. దీనితో గ్రామమంతా పాత రాజకీయ కక్షలు పురివిప్పి నివురుగప్పిన నిప్పులా మారింది. అన్నవరం ఎస్‌ఐ పార్ధసారధి నేతృత్వంలో పోలీసులు అల్లరిమూకలను చెదరగొట్టి ప్రశాంత వాతావరణం నెలకొల్పారు. గ్రామంలో ఉద్రిక్తతలు తగ్గేవరకు పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఘర్షణ అనంతరం మండపం స్కూలును సందర్శించిన పిఠాపురం డివైఇఓ నాగేశ్వరరావు పర్యటించి ఉపాధ్యాయులను ఎన్నికల వివరాలను అడిగి తెలుసుకుని, ప్రశాంత వాతావరణం నెలకొన్న అనంతరం ఎన్నికల తేదీ ప్రకటిస్తామని, ప్రస్తుతం ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వైసిపి కార్యకర్తలను ప్రత్తిపాడు వైసిపి నాయకుడు పర్వత ప్రసాద్ పరామర్శించారు.
హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో...
ముగ్గురు కోరుమిల్లి వాసులు మృతి
కపిలేశ్వరపురం, ఆగస్టు 1: హైదరాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వీరంతా మొక్కల విక్రయం కోసం హైదరాబాద్ వెళ్లారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు గ్రామానికి చెందిన చీకట్ల కృష్ణమూర్తి (54), అతని కుమారుడు చీకట్ల వాసు (30), అతని సమీప బంధువు బెజవాడ ఆదినారాయణ (30) ఈ ఘటనలో మృతి చెందారు. కృష్ణమూర్తి మరో కుమారుడు సురేష్ తీవ్ర గాయాలపాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరంతా హైదరాబాద్‌లోని మియాపూర్ వద్ద అద్దెకు తీసుకున్న స్థలంలో తాత్కాలికంగా షెడ్డు వేసుకుని మొక్కలు విక్రయించుకుంటూ అక్కడే ఉంటున్నారు. సోమవారం తెల్లవారుజామున ఒక లారీ అదుపుతప్పి నిద్రిస్తున్న వీరిపై నుండి దూసుకెళ్లడంతో వారు, ఆదినారాయణ అక్కడికక్కడే మృతి చెందగా కృష్ణమూర్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వాసుకి భార్య, కుమారుడు, కుమార్తె ఉండగా, ఆదినారాయణకు భార్య, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో కోరుమిల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన తెలుసుకున్న సర్పంచ్ సలాది వీరబాబు, ఎంపిటిసి పంచకట్ల సోమేశ్వరరావు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వేగుళ్ల గాంధీ ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి మృతదేహాలకు త్వరితంగా పోస్టుమార్టం నిర్వహించి గ్రామానికి పంపేలా చర్యలు తీసుకున్నారు.
ప్రత్యేక హోదా కోసం నేడు బంద్
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఆగస్టు 1: రాష్ట్భ్రావృద్ధికి ప్రత్యేక హోదా ప్రకటించాలన్న నినాదంతో మంగళవారం జిల్లాను స్తంభింపజేసేందుకు విపక్షాలు సన్నద్ధమయ్యాయి. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బంద్ విజయవంతానికి పిలుపునిచ్చాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి. ఎన్నికలకు ముందు ‘ప్రశ్నించడం కోసం’ అన్న నినాదంతో ఆవిర్భవించిన జనసేన పార్టీ నుండి సానుకూల ప్రకటన ఇంతవరకు రాలేదని బంద్‌కు పిలుపునిచ్చిన రాజకీయ పార్టీల నేతలు వ్యాఖ్యానించారు. మరోవైపు లోక్‌సత్తా పార్టీ నేతలు రాష్ట్ర బంద్ విజయవంతానికి తమవంతు సహకారాన్ని అందించాలని నిర్ణయించారు. మిత్రపక్షాలైన టిడిపి-బిజెపిలు మాత్రం ప్రతిపక్షాలు చేస్తున్న బంద్ ప్రయత్నాలపై విరుచుకుపడ్డాయి. జిల్లా బిజెపి అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పాపాన్ని కాంగ్రెస్ మూట గట్టుకున్నదన్నారు. తెలుగుదేశం నాయకుడు, కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రం ఇప్పుడిపుడే అభివృద్ధి సాధిస్తున్న సమయంలో బంద్‌లు చేపట్టడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర విభజనకు వైకాపాయే కారణమని విమర్శించారు. దీనిపై వైకాపా జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతకానితనం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందన్నారు. బిజెపి, టిడిపిలు ప్రత్యేక హోదాపై నాటకాలాడుతున్నాయని విమర్శించారు. ఉద్యోగ, కార్మిక, వర్తక, ఆర్టీసీ యూనియన్లు బంద్‌కు సహకరించాలని కోరారు. బంద్‌లో అత్యవసర సేవలు ప్రజలకందేలా సహకరిస్తామని కన్నబాబు చెప్పారు. ప్రత్యేక హోదాకై జరిగే ఆందోళనకు సహకరిస్తామని ఎన్‌జిఒలు ప్రకటించారు. బంద్ నేపథ్యంలో ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు మంగళవారం సెలవు ప్రకటించాయి.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
కలెక్టర్
అరుణ్‌కుమార్

ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఆగస్టు 1: జిల్లాలో సీజనల్ వ్యాధులపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ అప్రమత్తం చేశారు. అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. మురుగునీటిలో చెత్త తొలగింపు, రహదారుల్లో పెంట కుప్పల తొలగింపు, మంచినీటి ట్యాంకుల క్లీనింగ్ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడా మురుగునీటి సమస్యల్లేకుండా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. బహిరంగ మల విసర్జన లేని గ్రామాల రూపకల్పనలో ప్రగతి సాధించాల్సి ఉందని పేర్కొన్నారు. జిల్లాలో 5వేల వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించినట్టు చెప్పారు. ఎన్టీఆర్ జలసిరి పథకం పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో అసంపూర్తిగా మిగిలిన అంగన్వాడీ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లను ప్రోత్సహించాలని, ఇందుకు ప్రత్యేక విత్తనాల కిట్స్‌ను పాఠశాలకు పంపిణీ చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్-2 జె రాధాకృష్ణమూర్తి, సిపిఒ మోహన్‌రావు, జడ్పీ సిఇఒ కె పద్మ, డ్వామా పిడి నాగేశ్వరరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రాజేశ్వరరావు, పంచాయతీ రాజ్ ఎస్‌ఇ వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి కె చంద్రయ్య, బిసి కార్పొరేషన్ ఇడి ఎం జ్యోతి, ఐసిడిఎస్‌పిడి ప్రవీణ, వ్యవసాయ శాఖ జెడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అన్యాయంగా హతమార్చారు
*మారయ్య కుటుంబ సభ్యుల ఆవేదన
చింతూరు, ఆగస్టు 1: అభం, శుభం తెలియని పాస్టరు మారయ్యను పోలీసు ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు అన్యాయంగా, అతి కిరాతకంగా హతమార్చారని మారయ్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం చట్టి గ్రామంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో వారు విలేకర్లతో మాట్లాడారు. మారయ్య భార్య మంగమ్మ, సోదరుడు కన్నయ్య మాట్లాడుతూ మారయ్య పాస్టరుగా గిరిజనులను సన్మార్గంలో నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడన్నారు. మారయ్య ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని, పోలీసు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించలేదన్నారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి మావోయిస్టులు మారయ్యను హతమార్చడం సరికాదన్నారు. మారయ్య మృతి చెందడంతో తాము అనాధలమయ్యామని భార్య మంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. పాస్టరుగా పనిచేస్తూ అనాధలకు, రోగులకు అండగా ఉంటున్నామని, ఆపదలో ఉంటున్న ప్రజలను ఆదుకుంటున్నామని లక్ష్మీపురం చర్చి పాస్టరు, మారయ్య సోదరుడు కన్నయ్య అన్నారు. ఈ పనులు మావోయిస్టులకు తప్పుగా కన్పిస్తున్నాయా అని ప్రశ్నించారు. ఆరోపణలు వస్తే విచారణ చేసి చర్యలు తీసుకోవాలే తప్ప అన్యాయంగా బలితీసుకోవడం భావ్యం కాదన్నారు.
కాకినాడ ఆర్డీవోగా అంబేద్కర్ తిరిగి బాధ్యతల స్వీకరణ
కాకినాడ, ఆగస్టు 1: కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)గా తిరిగి బిఆర్ అంబేద్కర్ సోమవారం విధుల్లోకి చేరారు. వ్యక్తి గత కారణాలుగా సుమారు 5 నెలలు శెలవులో ఉన్న అంబేద్కర్ ఇప్పటి వరకు ఆర్డీఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారి వి డేవిడ్‌రాజ్ నుండి ఛార్జ్ తీసుకున్నారు. ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన అంబేద్కర్‌ను పలువురు మర్యాద పూర్వకంగా కలిశారు.
ప్రత్యేక హోదా తీసుకురావడంలో టిడిపి విఫలం
వైసిపి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
కాకినాడ రూరల్, ఆగస్టు 1: ప్రత్యేక హోదా తీసుకురావడంలో టిడిపి ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కరసాల కన్నబాబు మంగళవారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో బంద్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రమణయ్యపేటలోని స్వగృహంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఎన్నికల్లో గెలవటం కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెప్పిస్తానని మాయమాటలు చెప్పి ఇప్పుడు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనీయ అని చెప్తున్నారన్నారు. ఈ నిర్లక్ష్యానికి రేపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసిస్తూ రేపుబంద్ నిర్వహిస్తోందని, ఈ బంద్‌లో అందరు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతంచేయాలని కన్నబాబు పిలుపునిచ్చారు. ఈ రోజు కార్యాచరణ ముందుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా రమణయ్యపేట నుండి మొదలయ్యి సర్పవరం జంక్షన్ మీదుగా భానుగుడి, మసీద్, మెయిన్‌రోడ్డు, జగన్నాధపురం బ్రడ్జి, కల్పనా జంక్షన్, వైఎస్‌ఆర్ బ్రిడ్జి, గుడారిగుంట జంక్షన్, ఆర్‌డిఓ ఆఫీసు మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో నాయకులు అత్తిలి సీతారామస్వామి, రావూరి వెంకటేశ్వరరావు, గోపిశెట్టి బాబ్జి, లింగం రవి, కడియాల చిన్నబాబు, అనిశెట్టి రామకృష్ణ, పుల్ల కోటేశ్వరరావు, ఎపిటిసి జవ్వాది సతీష్, కోమలి సత్యనారాయణ, కర్రి చక్రధర్, పెంకే రాధామనోహర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రచారానికే పరిమితమైన వనం-మనం
డి.గన్నవరం, ఆగష్టు 1: ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచార ఆర్భాటాలకే పరిమితమవుతున్నాయని అనడానికి వనం-మనం కార్యక్రమం సాక్షిగా నిలుస్తోంది. మిషన్ హరితాంధ్రప్రదేశ్‌లో భాగంగా ఒక్కరోజు కోటి మొక్కలు నాటి భావితరాలకు బంగారు భవితనిద్దాం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వనం-మనం కార్యక్రమం పి.గన్నవరం మండలంలో నిష్పలం అయ్యింది. మండలంలో 40వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక తయారు చేసి పి.గన్నవరం, కె.ముంజవరం గ్రామాల మధ్యనున్న గోదావరి నది ఏటిగట్టు 10 కిలో మీటర్ల పొడవునా 4,600 మొక్కలు నాటుతాం అంటూ ప్రకటించి ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తిచే మొక్కను నాటించి మిగిలిన మొక్కలు ఏటిగట్టు పొడవునా గుట్టలు గుట్టలుగా పోసిఉంచారు. కేవలం ప్రారంభానికే పరిమితమైన ఉండటంతోపాటు కార్యక్రమం పట్ల అధికారులు నిరాశక్తితో ఉండటంతో నాటకుండానే మొక్కలు కుళ్లిపోతున్నాయి. ఇది చాలదన్నట్లు మొక్కలను పశువులు గ్రాసంగా ఆరగించేస్తున్నాయి. కేవలం మట్టి కవర్లే మిగులుతున్నాయి. రాష్ట్రంలో జిల్లా ప్రధమస్థానం సాధించాలన్న జిల్లా అధికారుల ఆజ్ఞలను పాటించామన్న నేపధ్యంలో మొక్కలను మండల కేంద్రానికి రప్పించి పక్కగ్రామాల్లో గుట్టలు పోసేసి తూతూ మంత్రంగా కార్యక్రమాన్ని స్థానిక అధికారులు కానిచ్చేసారు. జిల్లా అధికారులు 15లక్షల లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు కాగితాల్లో లెక్కలు చూపి రాష్ట్రంలో జల్లా రెండోస్థానం అంటూ ప్రకటనలిచ్చారు. మండలానికి 40వేల మొక్కలు వచ్చాయి. కానీ వీటిలో అధికారులు నాటించినవి మాత్రం అరకొర మాత్రమే. మండలంలో ఎక్కడ చేసిన గ్రామాల్లో మొక్కలు గుట్టలే దర్శనిమిస్తున్నాయి. మొక్కలు దింపి నాలుగురోజులు కావడంతో వాటి ఆలనాపాలనా లేకుండా వుండటంతో కుళ్లిపోతున్నాయి. రాష్ట్భ్రావృద్ధికి నిధులు కొరత అంటూ ప్రకటనలిస్తున్న రాష్ట్ధ్రానేతలకు నిష్పలం అవుతున్న పథకాలను ప్రవేశపెట్టడంతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయని నాటకుండా వున్న మొక్కల గుట్టలను చూసిన ప్రజలు పెదవి విరుస్తున్నారు.
స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలి:కలెక్టర్
కాకినాడ, ఆగస్టు 1: ఈనెల 15వ తేదీన జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేసి, తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ కోర్టు హాలులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. కలెక్టర్ ఈసందర్భంగా మాట్లాడుతూ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కేటాయించాలని, బందోబస్తు, ట్రాఫిక్ పర్యవేక్షణ చేపట్టాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను కోరారు. 15వ తేదీన ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 1గంటవరకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా ఆర్‌డిఓలు తహశీల్దార్ల సమన్వయంతో చేపట్టాలని ట్రాన్స్‌కో డిఇని ఆదేశించారు. ఆర్డీఓలు, తహశీల్దార్లు అతిముఖ్యులకు, అధికారులకు సీటింగ్ ఏర్పాట్లు, ప్రెస్, విఐపిలు, ఎంపి, ఎమ్మెల్యేలు, స్వాతంత్య్ర సమరయోధులు, అవార్డీలు, నాన్ అఫీషియల్వ్ ప్రత్యేకంగా కంపార్ట్‌మెంట్లు, తదితర చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ ప్రాంగణంలో అంబులెన్స్, ఫిజీషియన్, సంబంధిత సిబ్బందితో అత్యవసర పరిస్థితులలో సిద్ధంగా ఉంచాలని జిజిహెచ్ సూపరిండెంట్‌ను ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్‌ను శానిటేషన్, త్రాగునీరు, మున్సిపల్ స్కూల్ విద్యార్ధులను పెరేడ్ గ్రౌండ్‌కు తీసుకువచ్చేందుకు సంబంధిత హెచ్‌ఎంలకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. అగ్నిమాపక శకటంతో సంబంధిత సిబ్బందిని గ్రౌండ్‌లో ముందస్తు చర్యల్లో భాగంగా ఏర్పాటు చేయాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిని ఆదేశించారు. పాఠశాల విద్యార్ధులను గ్రౌండ్‌కు తీసుకురావడం, విద్యార్ధులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. స్కూల్ విద్యార్ధులను బస్సుల్లో గ్రౌండ్‌కు చేర్చేందుకు బస్సులను ఏర్పాటు చేయాలని డిటిసిని ఆదేశించారు. మంత్రి చదివే ప్రసంగం సిద్ధం చేయాలని, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాను ఆహ్వానించాలని జిల్లా పౌరసంబందాధికారిని ఆదేశించారు. డిఎఫ్‌ఓ, ఐసిడిఎస్, సివిల్ సప్లయస్, వ్యవసాయశాఖ, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఉద్యానవన శాఖ, మత్స్యశాఖ స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, బిసి కార్పొరేషన్, సాంఘిక సంక్షేమశాఖ, డిఆర్‌డిఏ, వ్యవసాయశాఖ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ స్టాల్స్‌తో పాటు, ఎస్సట్స్ పంపిణీకి ఏర్పాటు చేపట్టాలన్నారు. అన్ని శాఖల ఏర్పాటు చేసే శకటాలను హౌసింగ్ శాఖ పిడి పర్యవేక్షించాలని, ఎస్సెట్స్ పంపిణీ ఏర్పాట్లను డిఆర్‌డిఏ పిడి, ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాట్లను డ్వామా పిడి పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
భూతగాదాలతో కొండరెడ్డి హత్య
కూనవరం, ఆగస్టు 1: భూతగాదాల నేపధ్యంలో ఒక కొండరెడ్డిని హత్య చేసిన ఘటన కూనవరం మండలం పైడిగూడెం గ్రామంలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. కూనవరం ఎస్‌ఐ రాజేష్‌కుమార్ కథనం ప్రకారం పులుసు మామిడిగొంది గ్రామానికి చెందిన కోండ్ల గంగిరెడ్డి (45) ఓ ఇంట్లో శవమై ఉన్నట్టు అతని భార్య సోములమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ శుభకార్యానికి పులుసు మామిడిగొంది, కిందిపాకల, కోపురమెట్ట గ్రామాల నుండి గంగిరెడ్డితోపాటు కదల చందిరెడ్డి, కన్నపురెడ్డి, లచ్చిరెడ్డి మరికొంత మంది పైడిగూడెం వచ్చారు. గతంలో వీరి మధ్య భూతగాదాలు ఉన్నాయి. ఈనేపధ్యంలోనే గంగిరెడ్డిని ఈ ముగ్గురూ కలిసి హత్యచేసి ఉంటారని సోములమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. సంఘటనా స్థలానికి సిఐ వీరయ్య గౌడ్ సిబ్బందితో చేరుకుని విచారించారు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్‌ఐ రాజేష్‌కుమార్ వివరించారు.
కళాకారులు ధర్నా
రాజమహేంద్రవరం, ఆగస్టు 1: కళాకారులు, పౌరాణిక, జానపద నాటకరంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో సోమవారం కళాకారులు సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా కళాకారులు ఆలపించిన గీతాలు అలరించారు. కళాకారుల పెన్షన్‌ను రూ. 1500 నుంచి 3వేలకు పెంచాలని, ప్రతీ కళాకారుడికి పెన్షన్ మంజూరు చేయాలని, తెలుగు సాంస్కృతిక రంగ అభివృద్ధికి సమగ్ర విధానాన్ని ప్రకటించాలని, ఇందుకోసం రూ. 100కోట్లు కేటాయించాలని, జిల్లా సాంస్కృతిక మండళ్లను పునరుద్ధరించాలని, పేద కళాకారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ఆర్టీసీ బస్సుల్లో 50శాతం రాయితీ కల్పించాలని, ప్రతీ కళాకారుడికి గుర్తింపుకార్డు జారీ చేయాలని, పట్టణాలు, నగరాల్లో కళాక్షేత్రాలను నిర్మించాలని తదితర డిమాండ్లతో కూడిన మెమొరాండంను సబ్‌కలెక్టర్‌కు సమర్పించారు.