S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/02/2016 - 07:35

నిజామాబాద్, ఆగస్టు 1: గడిచిన నాలుగు రోజుల నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు జిల్లాను తడిసిముద్దయ్యేలా చేస్తున్నాయి. వరుసగా మూడు రోజుల నుండి రాత్రి సమయాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎటు చూసినా లోతట్టు కాలనీల్లోని నివాస ప్రాంతాలు, ప్రధాన రహదారులు, పంట పొలాలు, మైదానాలన్నీ జలమయంగా మారి చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి.

08/02/2016 - 07:33

కరీంనగర్, ఆగస్టు 1: పురపాలికల్లోని వీధుల్లో కమీషనర్లు, చైర్మన్లు వేకువజామునే్న పర్యటించి స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి పరిష్కరించాలని, అప్పుడే మున్సిపాలిటీలపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

08/02/2016 - 07:30

ఏలూరు, ఆగస్టు 1 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో రాజీపడేది లేదని పేర్కొంటూ మంగళవారం జిల్లా బంద్‌ను నిర్వహించనున్నారు. ఈ విషయంలో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపిలు ప్రజలను మోసగిస్తున్నాయంటూ వైకాపా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ బంద్‌కు పిలుపునిచ్చింది. మరోవైపు ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి అన్నిపక్షాలు మద్దతు పలుకుతూ వైకాపా బంద్‌కు సంఘీభావం ప్రకటించాయి.

08/02/2016 - 07:29

ఏలూరు, ఆగస్టు 1 : మీ-కోసంలో దరఖాస్తు చేసిన ఫిర్యాదుదారుల సమస్యను పరిష్కరించడానికి అధికారులే నేరుగా ఫిర్యాదుదారుని ఇంటికి వెళ్లి సెల్ఫీ ఫొటో తీసి ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి సోమవారం మధ్యాహ్నం కలెక్టర్ మీ-కోసం ఫిర్యాదుదారులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. ఫిర్యాదు ఇచ్చిన తరువాత అధికారులు మీ వద్దకు వచ్చారా?

08/02/2016 - 07:29

విజయనగరం(టౌన్), ఆగస్టు 1:ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులను అధికారులు స్వీకరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీ-కోసం గ్రీవెన్స్‌కు పలువురు తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చి వినతిపత్రాలు అందజేశారు. వ్యక్తిగత సామాజిక సమస్యలపై వినతులు అందాయి. హాస్టళ్ల మూసివేత కారణంగా సుమారు 40 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోల్పోయిన ఉద్యోగాలను భర్తీచేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

08/02/2016 - 07:28

విజయనగరం(టౌన్), ఆగస్టు 1: హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేస్తున్న మెస్‌ఛార్జీలు ఏమూలకు చాలవని, వెంటనే పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు ఇచ్చిన పిలుపుమేరకు పట్టణంలో పలు విద్యాసంస్ధలు మూత పడ్డాయి. బంద్‌ను విజయవంతం చేయడం కోసం విద్యార్థి నాయకులు సోమవారం ఉదయం పట్టణంలోని కోట కూడలినుండి ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు.

08/02/2016 - 07:25

విశాఖపట్నం, ఆగస్టు 1: ఎపికి ప్రత్యేక హోదా తక్షణమే ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సహా పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేడు బంద్ నిర్వహించనున్నారు. రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రసంగం ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించలేమన్న భావన కల్పించారని అధికార టిడిపితో సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

08/02/2016 - 07:22

శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 1: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెల రెండో తేదీన నిర్వహించతలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతిలు పిలుపునిచ్చారు. సోమవారం ఈ మేరకు స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

08/02/2016 - 07:22

ఒంగోలు,ఆగస్టు 1:రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా బంద్ జరగనుంది. ఈ బంద్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ, కాంగ్రెస్ వామపక్షాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొననున్నాయి. ముందుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు మంగళవారం వేకువజామున నాలుగుగంటలకు స్థానిక ఆర్‌టిసి గ్యారేజి వద్దకు వెళ్ళి బస్సులను నిలుపుదల చేయనున్నారు.

08/02/2016 - 07:18

పొదలకూరు, ఆగస్టు 1: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 11వ తేదీ జరిగిన పివిఆర్ చికెన్ ట్రేడర్స్ నగదు వసూళ్ల ఏజెంట్ చక్రం గోవర్దన్ హత్య కేసుకు సంబంధించి ఓ బాలుడు సహా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆత్మకూరు డిఎస్పీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Pages