S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/02/2016 - 05:48

అవనిగడ్డ, ఆగస్టు 1: మండల పరిధిలోని మోదుమూడి గ్రామంలో సోమవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో తుంగల ధనలక్ష్మి, పులగం అనసూయలకు చెందిన పూరిళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. గ్యాస్ సిలెండర్ పేలటంతో ఈ ప్రమాదం జరిగింది. అవనిగడ్డ అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. రూ.2.30లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు.

08/02/2016 - 05:48

మచిలీపట్నం, ఆగస్టు 1: జిల్లా ఇన్‌ఛార్జ్ డిపిఆర్‌ఓగా విజయవాడ డివిజనల్ పిఆర్‌ఓ ఎస్‌వి మోహనరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డిపిఆర్‌ఓగా కొనసాగిన జి గోవిందరాజులు పదవీ విరమణ చేయటంతో ఆయన స్థానంలో మోహనరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర సమాచార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సోమవారం ఆయన గోవిందరాజులును పదవీ బాధ్యతలు స్వీకరించారు.

08/02/2016 - 05:47

తిరుపతి, ఆగస్టు 1: వికలాంగులకు ఇళ్లస్థలాలు కేటాయింపునకు సంబంధించి అన్ని స్థాయుల్లో అనుమతులు లభించినా కలెక్టర్ కార్యాలయంలో జాప్యం జరుగుతుండటంతో నిరసించిన వికలాంగుల సంఘం జిల్లా నాయకుడు మాధవయ్య తిరుపతిలోని తాతయ్య గంగమ్మ గుడి సమీపంలో సెల్ టవర్ ఎక్కి ఇళ్లస్థలాలు ఇస్తారా.. దూకి చావమంటారా అంటూ డిమాండ్ చేయడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు హడావుడి పడాల్సిన పరిస్థితి సోమవారం తలెత్తింది.

08/02/2016 - 05:46

మచిలీపట్నం, ఆగస్టు 1: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ అపహాస్యానికి గురవుతోంది. ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ‘మీకోసం’ అర్జీల స్వీకరణ కార్యక్రమానికి ఉన్నతాధికారులు సైతం గైర్హాజరవుతుండటంతో అర్జీలుదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మూడు నెలలుగా కృష్ణా పుష్కర ఏర్పాట్లపై కలెక్టర్ బాబు.ఎ, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు విజయవాడలో బిజీ బిజీగా ఉంటున్నారు.

08/02/2016 - 05:45

మచిలీపట్నం, ఆగస్టు 1: నిరుపేదల వ్యవసాయ భూములను కొల్లగొట్టేందుకే ప్రభుత్వం మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ’ (మడ)ను ఏర్పాటు చేసిందని ఎపి రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షులు గుంటూరు రాఘవులు విమర్శించారు. ‘మడ’ ఏర్పాటు, ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేకంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

08/02/2016 - 05:45

అనంతపురం, ఆగస్టు 1: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితుల్లో రాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అనంతపురం ఎంపి జెసి.దివాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన అనంతపురంలో విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే యోచన కేంద్రానికి లేదన్నారు. ఎన్ని బంద్‌లు, ఆందోళనలు చేసినా నిష్ప్రయోజనమేనన్నారు. హోదా రాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయేది అనంతపురం జిల్లానేనని అన్నారు.

08/02/2016 - 05:44

విజయవాడ, ఆగస్టు 1: పార్లమెంట్‌లో, టిడిపి ప్రభుత్వంలో కదలిక రావటంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అన్ని వర్గాల ప్రజలు ఒకే గొంతుతో నినదించి, మంగళవారం బంద్‌కు మద్దతు తెలపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు.

08/02/2016 - 05:42

కుప్పం, ఆగస్టు 1: తరచూ తనకు ఆడపిల్లలే పుడుతున్నారని ఓ కసాయి తండ్రి ఇద్దరు ఆడపిల్లలను చంపేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం అటవీ ప్రాంతంలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మండల పరిధిలోని నూలుకుంట పంచాయతీకి చెందిన మదనపురం గ్రామంలో మునస్వామి, లక్ష్మిలకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

08/02/2016 - 05:35

గుంటూరు, ఆగస్టు 1: మద్యం మత్తులో మంత్రి తనయుడు వీరంగం సృష్టించాడు. ఈ ఉదంతం గుంటూరు నగరంలో వెలుగుచూసింది.. రాష్ట్ర మంత్రివర్గంలో కీలక భూమిక పోషిస్తున్న జిల్లాకు చెందిన ఓ మంత్రి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గప్‌చుప్‌గా సద్దుమణిగింది.

08/02/2016 - 05:33

విశాఖపట్నం, ఆగస్టు 1: ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ నిర్వహణపై రాష్ట్ర ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత దావ్రా అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు వెబ్‌సైట్లను నిర్వహించడమే కాకుండా అప్‌డేట్ చేయకపోవడంపై అధికారులను ఆమె గట్టిగా ప్రశ్నించారు. ఎయు ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అయితే తరువాతి కాలంలో పరీక్ష సమాచారం కోసం మరొక వెబ్‌సైట్‌ను రూపొందించారు.

Pages