S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మళ్లీ రేబిస్ కలకలం?

హైదరాబాద్, జూలై 31: హైదరాబాద్‌లో మళ్లీ రేబిస్ కలకలం మొదలైంది. గత ఆరు నెలల క్రితం రేబిస్ వ్యాధితో నలుగురు చిన్నారులు మృతి చెందగా 12 మంది చికిత్స పొందారు. తాజాగా నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో ఆదివారం ఓ రేబిస్ కేసు నమోదైంది. ప్రస్తుతం రోగి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నల్గొండ జిల్లా మోత్కూర్ గట్టు సింగారం గ్రామానికి చెందిన కిష్టయ్య (50)ను రెండు నెలల క్రితం ఓ వీధికుక్క కరిచింది. ఆ సమయంలో అతను సరైన చికిత్స తీసుకోలేదు. కాగా శనివారం సాయంత్రం నుంచి వింతగా ప్రవర్తిస్తున్న అతణ్ణి స్థానిక ఆసుపత్రికి తీసుకు వెళ్లగా అనుమానంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకు వెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు శనివారం రాత్రి నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. కిష్టయ్యను పరీక్షించిన వైద్యులు రేబిస్‌గా నిర్ధారించి ఇన్ పేషంట్‌గా చేర్చుకొని చికిత్సలు అందిస్తున్నారు.