S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 02:37

జగ్గయ్యపేట రూరల్, జూలై 31: పత్రికల్లో వచ్చిన కథనాలు జిల్లా కలెక్టర్ బాబు ఎ స్వయంగా పరిశీలించి పనులు నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో మండలంలోని ముక్త్యాల గ్రామంలో పుష్కర నిర్మాణాలు, ఇతర పనులు వేగవంతం అయ్యాయి. ఇప్పటి వరకూ మొక్కుబడిగా పరిశీలన చేసి వెళ్లిన వివిధ శాఖల ఉన్నతాధికారులు గ్రామంలోనే మకాం పెట్టి దగ్గర ఉండి పనులు చేయిస్తున్నారు.

08/01/2016 - 02:37

తోట్లవల్లూరు, జూలై 31: తోట్లవల్లూరు మండలంలో పుష్కరఘాట్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా వుంది. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని మండలంలో తొమ్మిది ఘాట్లను గుర్తించారు. వీటిలో ఏడు సి గ్రేడ్ ఘాట్‌లుగా రొయ్యూరు, వల్లూరుపాలెం, తోట్లవల్లూరులో రెండు, ఐలూరులో మూడు ఘాట్లను చేర్చారు. రెండు లోకల్ ఘాట్లుగా దేవరపల్లి, చాగంటిపాడులను నిర్ధారించారు.

08/01/2016 - 02:36

మండవల్లి, జూలై 31: కొల్లేరులోని అభయారణ్యంలో నిబంధలకు విరుద్ధంగా అక్రమ చెరువుల తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన అటవీ శాఖ సిబ్బందిపై గ్రామస్తులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. సుప్రీం కోర్టు సాధికార కమిటీ తీర్పు, 120 జీవోను ధిక్కరిస్తూ ధ్వంసం చేసిన చెరువులను మరలా పునరుద్ధరిస్తున్నారు.

08/01/2016 - 02:36

అవనిగడ్డ, జూలై 31: పుష్కర యాత్రికులకు 12 రోజులు పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టటంలో భాగంగా దివి సబ్ డివిజన్‌లో 2వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తామని ఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సిసి కెమెరాల ఏర్పాటుతో పాటు రిజర్వ్ ఫోర్స్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు.

08/01/2016 - 02:35

విజయవాడ, జూలై 31: కృష్ణా పుష్కరాల్లో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు విచ్చేసే భక్తులకు రోజుకు లక్ష మంది వరకైనా నమూనా ఆలయంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఏర్పాటు చేపట్టామని తితిదే కార్య నిర్వహణాధికారి డా.డి సాంబశివరావు వెల్లడించారు. పుష్కరాల్లో లక్ష మంది భక్తులకు రాష్ట్ర, కృష్ణా జిల్లా యంత్రాంగం సహకారంతో అన్నప్రసాదాలను అందిస్తామని తెలిపారు.

08/01/2016 - 02:34

ఇబ్రహీంపట్నం, జూలై 31: పవిత్ర సంగమ ప్రాంతాన్ని శాశ్వత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దిడం జరుగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ప్రాంతంలో రూ. 5.50 కోట్లతో అభివృద్ధి చేసిన 20 ఐమాస్ట్ లైట్లను ఆయన ఆదివారం ప్రారంభించారు.

08/01/2016 - 02:33

విజయవాడ, జూలై 31: కృష్ణా పుష్కరాల కోసం ప్రజానీకం ఎదురుతెన్నులు చూస్తోంది. అయితే కృష్ణానది ఆవిర్భావ ఘట్టం ఎంతో ప్రశస్తనీయమైంది. పూర్వం బ్రహ్మాది దేవతలు విష్ణుమూర్తి వద్దకు వెళ్లి భూలోక వాసులను పాప విముక్తుల జేయుటకు సులభోపాయమును తెలుపమని ప్రార్థించారు. విష్ణువు బ్రహ్మాదులను తోడ్కొని పరమేశ్వరుని వద్దకు వెళ్లి వివరించి సరైన తరుణోపాయమును సూచించమని కోరడం జరిగింది.

08/01/2016 - 02:33

విజయవాడ, జూలై 31: హోటల్ రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలని, టాక్స్‌ల విధానంలో సరళమైన విధానం ఉండాలని ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం శ్రీనివాసబాబు, టి సత్యనారాయణ అన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో హోటల్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం జరిగింది.

08/01/2016 - 02:32

విజయవాడ, జూలై 31: రోడ్లు విస్తరణ పేరిట అర్ధరాత్రి వేళ దారుణాతి దారుణంగా తొలగించబడిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంశ్య విగ్రహాన్ని తొలగించిన ప్రదేశంలోనే యథావిథిగా పునః ప్రతిష్ఠించాలని కోరుతూ వైఎస్సార్సీ ఆధ్వర్యంలో ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వరకు శాంతి ర్యాలీ జరిగింది. అనంతరం కలెక్టర్ బాబు ఎకి వినతిపత్రం అందించారు.

08/01/2016 - 02:29

కశింకోట, జూలై 31: రాష్ట్రంలో మూడువేల కోట్ల రూపాయలతో 4,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లను నిర్మించామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.

Pages