S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 01:17

మేడ్చల్, జూలై 31: ప్రభుత్వ ఉద్యోగంపై ఉన్న అమితమైన మక్కువతో రాత పరీక్షకు హజరైన అభ్యర్థులు.. పరీక్ష నిర్వాహకులు తీరుతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గంటల తరబడి వేచియుండి వర్ణించలేనంతగా అవేదనపడ్డారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుళ్ల ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహించింది.

08/01/2016 - 01:16

శేరిలింగంపల్లి, జూలై 31: బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సి.లక్ష్మారెడ్డి.. అమ్మవారి ఫలహారబండి లాగి ఊరేగింపును ప్రారంభించారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్‌పర్సన్ రాగం సుజాత ఆధ్వర్యంలో భెల్ ఎంఐజి కాలనీలోని శ్రీరేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద ఆదివారం భారీ ఎత్తున బోనాలు నిర్వహించారు.

08/01/2016 - 01:16

ఖైరతాబాద్, జూలై 31: భారత అణుపితామహుడు, మాజీ రాష్టప్రతి ఏపిజె అబ్దుల్ కలామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గాడ్ ఫాదర్ కలామ్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

08/01/2016 - 01:09

ఈ వీరుడి పేరు ల్యూక్ అయికిన్స్ (42). ప్రపంచంలోనే అరుదైన రికార్డు సాధించాడు. పారాచూట్ లేకుండా 25వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న ఓ విమానం నుంచి భూమిపైకి దూకేశాడు. కాలిఫోర్నియాలోని సిమి లోయలో ఈ ఫీట్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 25వేల అడుగుల ఎత్తునుంచి రెండు నిమిషాల
వ్యవధిలో భూమిపై ఏర్పాటు చేసుకున్న 100 అడుగుల వెడల్పు, 100 అడుగుల పొడవు కలిగిన వలపైకి విజయవంతంగా దూకాడు.

08/01/2016 - 01:08

ముంబయి/్థనె, జూలై 31: మహారాష్టల్రోని ముంబయి మహానగరం, దానికి ఆనుకుని ఉన్న థానె, పాల్‌ఘర్ జిల్లాల్లో ఆదివారం ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమయింది. థానె జిల్లాలోని భివాండి పట్టణంలో కుండపోత వర్షాలకు ఓ నివాస భవనం కూలిపోవడంతో తొమ్మిది మంది చనిపోగా, మరో పదిమంది గాయపడ్డారు.

08/01/2016 - 01:02

బులంద్‌షహర్, జూలై 31: ఉత్తరప్రదేశ్‌లో ఒక బందిపోటు దొంగల ముఠా జాతీయ రహదారిపై కాపుకాసి ఒక కారును అడ్డగించి అందులో ప్రయాణిస్తున్న ఒక 35 ఏళ్ల మహిళను, 13ఏళ్ల వయసు గల ఆమె కుమార్తెను కారులోంచి లాగి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.

08/01/2016 - 01:02

న్యూఢిల్లీ, జూలై 31: సౌదీ అరేబియాలో పది వేలకు పైగా భారతీయ కార్మికులు తమ ఉపాధిని కోల్పోయి తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. వారికి ఆహార పదార్థాలను అందజేయడంతోపాటు ఇతరత్రా సహకరించాలని భారత ప్రభుత్వం సౌదీలోని తన దౌత్యసిబ్బందిని ఆదేశించింది.

08/01/2016 - 01:01

వాషింగ్టన్, జూలై 31: ఆర్థిక రంగానికి సంబంధించి తాను రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం దేశంలో కోటి ఉద్యోగాలను సృష్టించేందుకు వీలవుతుందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న హిల్లరీ క్లింటన్ ఆదివారం స్పష్టం చేశారు.

08/01/2016 - 01:00

అహ్మదాబాద్, జూలై 31: గుజరాత్‌లో దళితులపై దాడులు పెరిగిపోవడానికి నిరసనగా ఆందోళన చేస్తున్న వేలాది మంది దళితులు ఆదివారం అహ్మదాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వానికి ఒక బలమైన సందేశాన్ని ఇవ్వడానికి చనిపోయిన పశులకు అంత్యక్రియలు నిర్వహించే తమ వృత్తిని వదిలిపెట్టాలని ఆ ర్యాలీలో ప్రసంగించిన దళిత నేతలు తమ కులం వారికి పిలుపునిచ్చారు.

08/01/2016 - 00:59

న్యూఢిల్లీ, జూలై 31: దేశవ్యాప్తంగా అయిదు లక్షల మంది రైల్వే ఉద్యోగులు, టిటిఇలు, గార్డులు, డ్రైవర్లకు భారత రైల్వేలు కొత్త డ్రస్‌కోడ్‌ను అమలు చేయబోతోంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రీతూబేరి ఈ యూనిఫామ్‌ను రూపొందిస్తున్నారు. భారత సంస్కృతిని ప్రతిబింబించే థీమ్‌వర్క్‌తో ఈ డ్రస్‌లను తయారుచేస్తారు. దీనికి సంబంధించి నాలుగు సెట్ల డిజైన్ వర్క్‌లను రైల్వే శాఖకు రీతూబేరి అయిదురోజుల క్రితమే సమర్పించారు.

Pages