S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 01:36

చెన్నూరు,జూలై 31:స్థానిక పెన్నానది తీరంలో పరమటి వీధిలో వెలసిన శ్రీరామలింగేశ్వర చౌడేశ్వరీదేవి ఆలయంలో ఈనెల 2వ తేదీ మంగళవారం అమ్మవారి జయంతి జరిపేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. 150సంవత్సరాలు కిందట చెన్నూరులో దేవాంగ పూర్వీకులు ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి అమ్మవారు పూజలందుకుంటూ వస్తోంది. ప్రతి ఏడాది చౌడేశ్వరీదేవి జయంతిరోజున ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది.

08/01/2016 - 01:36

సిద్దవటం,జూలై 31: మండల పరిధిలోని మాధవరం -1 గ్రామంలోని పార్వతీపురం గ్రామంలో చోరీకి పాల్పడిన దొంగను ఆదివారం సిద్దవటం ఎస్‌ఐ లింగప్ప అరెస్టు చేశారు. అతని వద్దనుంచి రెండు బంగారు చైన్లు, ఒక ఉంగరం, రెండు జతల వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. చోరీ విషయమై ఆదివారం సాయంత్రం సిద్దవటం పోలీసుస్టేషన్‌లో ఒంటిమిట్ట సిఐ వివరా లు వెల్లడించారు.

08/01/2016 - 01:35

చెన్నూరు,జూలై 31:కడప -కర్నూలు జాతీయ రహదారిలోని స్థానిక పెన్నానదిపై నిర్మించతలపెట్టిన రెండవ వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ వంతెన నిర్మాణ పనులు చేపట్టి రెండేళ్లు అవుతున్నా ఇంతవరకు పూర్తి చేయడం లేదు. హైవే పాతవంతెన స్థానంలో వంతెన పైభాగంలో ఉన్న గడ్డర్లు తొలగించి వాటి స్థానంలో కొత్తగా గడ్డర్లు ఏర్పాటుచేసి నిర్మాణ పనులు పూర్తి చేయాల్సివుంది.

08/01/2016 - 01:34

వాషింగ్టన్, జూలై 31: ఇప్పటివరకు పొకెమాన్‌ను పట్టుకోవటమే అన్ని దేశాల యువత పనిగా పెట్టుకున్న నేపథ్యంలో అమెరికా ఓ వినూత్న ప్రయోగం చేస్తోంది. ఏకంగా నేరగాళ్లను పట్టుకోవటానికి పోకెమాన్ అస్త్రాన్ని ప్రయోగించేదిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పోకెమాన్ గో క్రేజ్ అన్ని దేశాల్లోనూ ఉత్కంఠ రేకెత్తిస్తున్న తరుణంలో వర్జీనియాకు చెందిన పోలీస్ విభాగం ఈ వినూత్న ఆలోచనతో తెరపైకి వచ్చింది.

08/01/2016 - 01:34

హిందూపురం టౌన్, జూలై 31 : మున్సిపాలిటీలో రెండేళ్ల తర్వాత ఓ భారీ మార్పునకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ వైస్ చైర్మన్ జెపికె రాము స్థానంలో మరొకరిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మనం చేసినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాతనే అప్పట్లో చైర్మన్ పేరు ముందుగానే ఖరారైనా వైస్ చైర్మన్ పేరును చివరి నిమిషం దాకా ఖరారు చేయలేదు.

08/01/2016 - 01:33

న్యూఢిల్లీ, జూలై 31: నేపాల్‌లోని ముక్తినాథ్ వద్ద మంచుకొండలు విరిగిపడటంతో హైదరాబాద్‌కు చెందిన ఎనిమిది మంది మహిళా యాత్రికులు చిక్కుకున్నారు. దీనిపై స్పందించిన ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి, నేపాల్ ఎంబసి అధికారులతోను మాట్లాడారు. యాత్రికులను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టాలని కోరారు.

08/01/2016 - 01:33

అనంతపురం, జూలై 31 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఇందులో భాగంగా రెండు రోజుల నుంచి కమ్యూనిస్టు పార్టీలతోపాటు ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మల దగ్ధం, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం కూడా సిపిఐ నాయకులు మొక్కలు నాటి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.

08/01/2016 - 01:32

అనంతపురం, జూలై 31 : ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 6వ తేదీ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోన శశిధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈమేరకు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఆదివారం స్థానిక రెవెన్యూ భవన్‌లో జెసి బి.లక్ష్మీకాంతం, జెపి-2 ఖాజామొహిద్దీన్, ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్, డిఆర్‌ఓ హేమసాగర్‌తో కలిసి సమావేశం నిర్వహించారు.

08/01/2016 - 01:32

న్యూఢిల్లీ, జూలై 31: సామాజిక శాస్తవ్రేత్త డాక్టర్ ఎంవికె శివమోహన్ విద్యారతన్ గోల్డ్ అవార్డు అందుకొన్నారు. ఇంటర్ నేషనల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్, ఇండియన్ సాలిడారిటీ కౌన్సిల్‌లు ఈ అవార్డును ఆయనకు ప్రకటించాయి. ఢిల్లీలోని ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.

08/01/2016 - 01:32

అనంతపురం కల్చరల్, జూలై 31: రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ఎంపి వైద్యులకు వృత్తిపరమైన శిక్షణనిచ్చి వారి సేవలను వినియోగించుకుంటుందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు నగరంలోని కమ్మ భవన్‌లో ఆదివారం జరిగిన రాష్ట్ర మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా మహాసభలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

Pages