S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అబ్దుల్ కలామ్ ఆశయ సాధనకు కృషి

ఖైరతాబాద్, జూలై 31: భారత అణుపితామహుడు, మాజీ రాష్టప్రతి ఏపిజె అబ్దుల్ కలామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గాడ్ ఫాదర్ కలామ్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షురాలు ఎస్‌ఎస్ సుల్తానా మాట్లాడుతూ జీవించినంత కాలం దేశ అభివృద్ధి కోసమే తపించే మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలామ్ అని అన్నారు. యువత అభివృద్ధితోనే దేశ భవిష్యత్ ఉందని ఆయన కన్న కలలను సాకారం చేస్తూ ఆయన బాటలో పయనించేందుకు యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. భారతదేశ చరిత్రోలోనే దేశానికి ఆయన చేసిన సేవలు అమోఘమని తెలిసిన భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న అవార్డును అందించిందన్నారు.
బడుగు, బలహీన, మైనారిటీల అభ్యున్నతకి కోసం నిరంతరం శ్రమించేందుకు గాడ్ ఫాదర్ కలామ్ అసోసియేషన్ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. తమ అసోసియేషన్ ద్వారా కలామ్ ఘనతను యావత్ ప్రపంచానికి చాటడంతో పాటు ఆయన చూపిన దారిలో నడిపించేందుకు సిద్ధమయ్యామని చెప్పారు. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, వృద్ధులు, అనాథలు, వితంతువులు, వికలాంగుల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్ధిక సహాయం అందించడం, యువతకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శిక్షణ ఇప్పించడం వంటి కార్యక్రమాలు చేపడతామని వివరించారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, మహిళ సాధికారత వంటివాటిని నిర్వహిస్తామని చెప్పారు. కలామ్ కలలుగన్న విధంగా దేశం అభివృద్ధి సాధించాలంటే ఆయన రచించిన విజన్ 2020 పుస్తకంలో పొందుపరిచిన అంశాలను యువతకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 100 అడుగుల కలామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన చిత్రపటాలను, విగ్రహాలను విరివిరిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు జలీల్, రంజిత్, గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.ః