S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎక్సైజ్ కానిస్టేబుల్ రాత పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థుల ఆందోళన

మేడ్చల్, జూలై 31: ప్రభుత్వ ఉద్యోగంపై ఉన్న అమితమైన మక్కువతో రాత పరీక్షకు హజరైన అభ్యర్థులు.. పరీక్ష నిర్వాహకులు తీరుతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గంటల తరబడి వేచియుండి వర్ణించలేనంతగా అవేదనపడ్డారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుళ్ల ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహించింది. మేడ్చల్ మండలం కండ్లకోయ గ్రామ పరిధిలోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 1750 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హజరయ్యారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు పరీక్ష పూర్తయ్యింది. అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ మిషన్ ద్వారా బొటనవేలి ముద్రలను సేకరించాలనే నిబంధన ఉండటంతో అధికారులు పరీక్ష పూర్తయిన అనంతరం అభ్యర్థుల నుంచి థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటుండగా అభ్యర్థులంతా ఒక్కసారిగా దూసుకురావడంతో తీవ్ర గందగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 1750 మంది అభ్యర్థులకు ఒక్క బయోమెట్రిక్ మిషన్ మాత్రమే ఉండటంతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పరీక్ష నిర్వాహకులు థంబ్ ఇంప్రెషన్ సేకరించడాన్ని నిలిపివేశారు. అభ్యర్థులు తీవ్ర ఆందోళను గురయ్యారు. అధికారుల తీరును నిరసిస్తూ అభ్యర్థులు నిరసనకు దిగారు. సుదూర ప్రాంతాల నుంచి ఉదయమే పరీక్షా కేంద్రానికి చేరుకుని రాత పరీక్ష రాశామని మధ్యాహ్నం సమయం కావడంతో ఆకలితో అలమటించి ఇబ్బందులకు గురవుతున్నామని అభ్యర్థులు వాపోయారు. కేవలం ఒక్క మిషన్‌తో ఇంత పెద్ద సంఖ్యలో రాత పరీక్షకు హజరైన అభ్యర్థుల బొటనవేలి ముద్రలను సేకరించాలంటే ఒక రోజంతా పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు పరీక్షా కేంద్రం వద్దకు చేరుకుని అభ్యర్థులను సముదాయించారు. టిఎస్‌పిఎస్‌సి 40 మంది అభ్యర్థులకు ఒక్కో బయోమెట్రిక్ మిషన్‌ను పంపిస్తామని చెప్పి, 1750 మంది అభ్యర్థులకు కేవలం ఒక్క మిషన్‌ను మాత్రమే పంపించడంతో తామేమి చేయగలమని అధికారులు చేతులెత్తేశారు. ఇన్‌స్పెపెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఉన్నతాధికారులతో మాట్లాడి సమీపంలోని పరీక్షా కేంద్రం నుంచి పది మిషన్‌లను తెప్పించడంతో అధికారులు అభ్యర్థుల నుంచి థంబ్ ఇంప్రెషన్ తీసుకోవడం ప్రారంభించారు. వివాదం సద్దుమణిగి అభ్యర్థులు ఆందోళను విరమించారు.