S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 00:28

మొగల్తూరు, జూలై 31: మండలంలోని పేరుపాలెం బీచ్‌లో సముద్ర స్నానంచేస్తూ ఇరగవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన ఇరువురు వ్యక్తులు ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌కు ఆదివారం ఉదయం ఇరగవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన పది మంది ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు కలసి వచ్చారు.

08/01/2016 - 00:28

మొగల్తూరు, జూలై 31: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో ఆదివారం నరసాపురం గురుకుల పాఠశాల విద్యార్థులు వేసిన జల సంకల్పం సైకత శిల్పం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. నరసాపురం రూరల్ మండలం తూర్పుతాళ్ల గ్రామంలోగల ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులు 22మంది బీచ్‌లో సూమారు రెండు గంటలపాటు ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు.

08/01/2016 - 00:28

రియో డి జెనీరో, జూలై 31: టెన్నిస్ డబుల్స్ విభాగంలో టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి బరిలోకి దిగాల్సిన స్పెషలిస్టు ఆటగాళ్లు బాబ్ బ్రియాన్, మైక్ బ్రియాన్ తాము ఒలింపిక్స్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన ‘బ్రియాన్ బ్రదర్స్’ హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరమైన పరిణామం.

08/01/2016 - 00:27

గోపాలపురం, జూలై 31: పోలవరం కుడికాలువను ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవప్రకాష్ ఆదివారం పరిశీలించారు. గత మూడు రోజులుగా మండలంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో కాలువలు పొంగి పొర్లాయి. పోలవరం కాలువపై అక్కడక్కడ వంతెనలు నిర్మించాల్సిన ప్రదేశంలో అధికారులు గట్టుపై మట్టి పోసి పటిష్టపరిచారు. వర్షాల కారణంగా గట్లు ఏ విధంగా ఉన్నాయోనని ఇఇ దేవప్రకాష్ పరిశీలించారు.

08/01/2016 - 00:27

రియో డి జెనీరో, జూలై 31: వందకుపైగా అథ్లెట్లు డోపింగ్ పరీక్షలో పట్టుబడి, సస్పెన్షన్ వేటును ఎదుర్కొంటున్న నేపథ్యంలో రష్యాను ఒలింపిక్స్ నుంచి బహిష్కరించాలన్న డిమాండ్‌పై చర్చించి, నివేదికను సమర్పించడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ డోపింగ్ సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి, ప్రతిపాదనలు చేస్తుందని ఐఒసి అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపాడు.

08/01/2016 - 00:27

కింగ్‌స్టన్, జూలై 31: అశ్విన్ స్పిన్ మాయాజాలానికి వెస్టిండీస్ విలవిల్లాడింది. తొలి ఇన్నింగ్స్‌లో 52.3 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్ 52 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్‌కు జెర్మైన్ బ్లాక్‌వుడ్ (62), మార్లొన్ శామ్యూల్స్ (37) తప్ప ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లను అందించలేకపోయారు. చివరిలో మిగుల్ కమిన్స్ అజేయంగా 24 పరుగులు చేశాడు.

08/01/2016 - 00:27

ఏలూరు, జూలై 31 : మెడికల్, హెల్త్ ఉద్యోగుల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని, ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రులతో చర్చించి పరిష్కరించదగిన సమస్యలన్నీ కూడా సకాలంలో పరిష్కరిస్తానని జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు హామీ ఇచ్చారు. ఆదివారం స్థానిక ఐ ఎడిపి హాలులో తెలుగునాడు మెడికల్, హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశానికి ముఖ్య అతిధిగా జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు హాజరయ్యారు.

08/01/2016 - 00:26

ఏలూరు, జూలై 31 : మెట్ట ప్రాంతాన్ని పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా డెల్టాగా తీర్చిదిద్దుతామని భవిష్యత్తులో మెట్ట ప్రాంతాలు సమృద్ధిగా గోదావరి జలాలు తాగు, సేద్యపునీరుగా అందించడమే ప్రధాన ధ్యేయమని ఏలూరు ఎంపి మాగంటి బాబు చెప్పారు.

08/01/2016 - 00:26

ఏలూరు, జూలై 31 : దళితుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించినా, ప్రభుత్వ కార్యాలయాలలో దళితులకు న్యాయంగా లభించాల్సిన ప్రమోషన్లను తొక్కిపట్టినా సహించబోనని ఆంధ్రప్రదేశ్ ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ హెచ్చరించారు.

08/01/2016 - 00:25

పాలకొల్లు, జూలై 31: తనకున్న విధులు నిర్వర్తించకపోగా కౌన్సిల్‌ర్లను దొంగలని కౌన్సిల్ సమావేశంలో చెప్పటం సహించరాని నేరమని, కౌన్సిల్‌ను కించపరిచిన వ్యక్తిని తక్షణం సస్పెండు చెయ్యాలని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ఉద్యోగులంటే తమకు చాలా గౌరవం ఉందని, కానీ తప్పుచేసిన వారిని వెనకేసుకొచ్చే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు.

Pages