S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 01:41

వేంపల్లె, జూలై 31: రైతులకు రావాల్సిన రుణమాఫీ డబ్బులను వారి ఖాతాలలో వెంటనే జమ చేయాలని లీడ్‌బ్యాంకు మేనేజర్ రఘునాథరెడ్డితో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ సతీష్‌కుమార్‌రెడ్డి ఫోన్ ద్వారా సంభాషించారు. ఆదివారం ఆయన స్వగృహంలో లీడ్‌బ్యాంకు మేనేజర్ రఘునాథరెడ్డితో పాటు సంబంధిత అధికారులతో రుణమాఫీ విషయం గురించి ఆయన ఆరాతీశారు.

08/01/2016 - 01:40

రాయచోటి, జూలై 31: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆగస్టు 2న వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

08/01/2016 - 01:40

కడప,(కల్చరల్)జూలై 31: కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేంపల్లి మండలంలోని శ్రీగండి వీరాంజనేయస్వామి సన్నిధిలో ఈనెల 13న శ్రావణ శనివారం పురస్కరించుకుని ఉదయం 8గంటల నుండి 9గంటల లోపల దశమి మిధున లగ్నంలో అన్ని కులాలకు చెందిన పేద జంటలకు ఉచిత సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు గండి శ్రీ వీరాంజనేయస్వామి స్వచ్చంధ అనాధల సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, వివాహాల నిర్వాహకులు కిరసనాయిల్ వెంకటయ్య ఆదివారం

08/01/2016 - 01:39

ఒంటిమిట్ట, జూలై 31:మరో అయోధ్యగా పిలవడమే కాకుండా రానున్న రోజులలో ఏకశిలానగర ఒంటిమిట్ట కోదండ రామాలయం మహాక్షేత్రంగా ప్రపంచ గర్వించేలా రూపుదిద్దుకొంటుందని త్రిదండి అష్టాక్షరీ సంపత్‌కుమార్ రామానుజ అయ్యర్‌స్వామి అన్నారు. ఆదివారం కోదండ రాముని దర్శనార్ధం ఆయన ఒంటిమిట్టకు విచ్చేశారు. ఈ సందర్భంగా ముందుగా అర్చకులు, టిటిడి అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.

08/01/2016 - 01:39

పులివెందుల, జూలై 31: పట్టణ పరిధిలోని ఎపికార్ల్‌ను కృషీ విజ్ఞాకేంద్రం బృందం (కెవికె)వారు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా విజ్ఞాన కేంద్రం సమీకరణ కమిటీ ఛైర్మన్ ఎస్‌ఎన్.సుభాష్‌పూరితోపాటు వైవి.ప్రసాద్, ఠాగూర్‌నాయక్‌లతో కూడిన బృందం ఎపికార్ల్‌ను సందర్శించారు. అనంతరం వారు విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు వ్యవసాయ, హార్టికల్చర్ తదితర విభాగాల కళాశాలలు మంజూరయ్యాయన్నారు.

08/01/2016 - 01:38

వీరబల్లి, జూలై 31: మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రోళ్లమడుగు నీరు గ్రామ గ్రామానికి అందించే క్రమంలో పలుచోట్ల లీకేజీలతో నీరు వృధాగా పోతోంది. సంవత్సరాలు గడుస్తున్నా మండలంలో తాగునీటి కొరత తీరలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వీరబల్లిటౌన్‌లోకి రోళ్లమడుగు తాగునీరు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు.

08/01/2016 - 01:38

రైల్వేకోడూరు, జూలై 31:మండలంలోని బాలుపల్లె సమీపంలో ఆదివారం కూంబింగ్ నిర్వహిస్తుండగా తమిళనాడుకు చెందిన ఒక స్మగ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 2 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పట్టుకున్నట్లు ఎస్సై రమేష్‌బాబు తెలిపారు. తమిళనాడు ధర్మపురికి చెందిన సుబ్రమణ్యం అనే స్మగ్లర్‌ను అరెస్టు చేసి 6 ఎర్రచందనం దుంగలు పట్టుకున్నామన్నారు.

08/01/2016 - 01:38

న్యూఢిల్లీ, జూలై 31: గత నాలుగు వారాల్లో వరుసగా మూడోసారి దేశంలోని పెట్రోలు వినియోగదారులకు ఊరట లభించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చే విధంగా పెట్రోలుపై లీటరుకు రూ.1.42, డీజిల్‌పై లీటర్‌కు రూ.2.01 ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ఉత్పత్తుల ధరలు తగ్గటంతో ఈ వెసులుబాటును కల్పిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.

08/01/2016 - 01:37

చెన్నూరు,జూలై 31: చెన్నూరు పరిధిలో భవానీనగర్ వెనుకభాగంలో వ్యవసాయ పొలాల్లోసాగుచేసిన పసుపుపంటలో పిడుగుపడటం వల్ల సెంటు విస్తీర్ణంలో పసుపుపంట పూర్తిగా ధ్వంసమైంది. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షాలకు పిడుగు పసుపుపంటలో పడటంతో అప్పటికి చుట్టుపక్కలవారు ఎవరూ గమనించలేదు.

08/01/2016 - 01:37

ప్రొద్దుటూరు రూరల్, జూలై 31: పట్టణంలో చైన్‌స్నాచర్స్ రోజురోజుకూ పెట్రేగిపోతున్నారు. శనివారం సాయంత్రం వన్‌టౌన్ పరిధిలోని వరలక్ష్మీ అపార్ట్‌మెంట్ వద్ద ఓ మహిళ మెడలోని గొలుసును దొంగిలించిన విషయం మరువక ముందే ఆదివారం ఉదయం మరో గొలుసు దుండగులు లాక్కెళ్లారు. వివరాలలోకి వెళితే టుటౌన్ పోలీసు స్టేషన్ పరిదిలోని గోకుల్‌నగర్ వద్ద సుబ్బలక్ష్మి అను మహిళ మెడలో నుంచి దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లారు.

Pages